Latest

పోలీసుల బిగ్ ఆపరేషన్.. డ్రోన్‌తో స్పెషల్‌ పెట్రోలింగ్‌
Local· 21 Aug 2026

పోలీసుల బిగ్ ఆపరేషన్.. డ్రోన్‌తో స్పెషల్‌ పెట్రోలింగ్‌

TG: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు నిఘా పెంచారు. మంచిర్యాల జిల్లా నస్పూర్‌ పరిధిలోని శ్రీరాంపూర్‌ పోలీసులు డ్రోన్‌ సహాయంతో ప్రత్యేక పెట్రోలింగ్‌ నిర్వహించారు. ప్రగతి స్టేడియం పరిసరాలు, అరుణక్కనగర్‌, హైవే ప్రాంతాల్లో డ్రోన్‌ ద్వారా విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న ముగ్గురిని పోలీసులు గుర్తించారు. వారిపై మూడు ఓపెన్‌ డ్రింకింగ్‌ కేసులు నమోదు చేసినట్లు శ్రీరాంపూర్‌ సీఐ ఆకుల అశోక్‌ తెలిపారు.

కొండా సురేఖపై కాంగ్రెస్ MLAలు ఫైర్.. రాజీనామాకు డిమాండ్
TG· 21 Aug 2026

కొండా సురేఖపై కాంగ్రెస్ MLAలు ఫైర్.. రాజీనామాకు డిమాండ్

TG: కొండా సురేఖపై కాంగ్రెస్ MLAలు, MLCలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె వెంటనే రాజీనామా చేయాలని లేదా బర్తరఫ్ చేయాలని పట్టుబట్టారు. CLP సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశానికి 15 మంది MLAలు, ఐదుగురు MLCలు హాజరయ్యారు. CM రేవంత్ రెడ్డిపై అలా మాట్లాడటం సరికాదని MLAలు అన్నారు. కొండా సురేఖ వెంటనే తన కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలను ఖండించాలని డిమాండ్ చేశారు. సీఎంకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలన్నారు.

హైదరాబాద్ రోడ్డు ప్రమాదం: రాజ్యసభ ఎంపీ కుమారుడిపై కేసు
Crime· 21 Aug 2026

హైదరాబాద్ రోడ్డు ప్రమాదం: రాజ్యసభ ఎంపీ కుమారుడిపై కేసు

హైదరాబాద్‌లోని ఇనార్బిట్ మాల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ ఎంపీ, జనసేన నాయకుడు లింగమనేని రమేష్ కుమారుడు సంజుష్ ప్రయాణిస్తున్న ఆస్టన్ మార్టిన్ కారు భారతి ముఖి అనే 26 ఏళ్ల షాపింగ్ మాల్ ఉద్యోగినిని ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన ఆమెను ఆసుపత్రికి తరలించగా మృతిచెందింది. మాదాపూర్ పోలీసులు వేగంగా, నిర్లక్ష్యంగా వాహనం నడిపినందుకు కేసు నమోదు చేశారు. అయితే ఇది బెయిలబుల్ నేరం కావడంతో ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు.

రాజస్థాన్ లో  CJP  టీమ్ అడ్డగింత
National· 21 Aug 2026

రాజస్థాన్ లో CJP టీమ్ అడ్డగింత

రాజస్థాన్‌లోని బాగ్రూ గ్రామంలో ప్రభుత్వ స్కూల్ పరిస్థితి చూడటానికి వెళ్లిన Cockroach Janata Party (CJP) టీమ్‌ను కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. School Thik Karo క్యాంపెయిన్‌లో భాగంగా అక్కడికి వెళ్లిన CJP కో-కన్వీనర్ ఆశుతోష్ రాంకా, ఇతర కార్యకర్తలను వెనక్కి పంపించారు. తమ కార్యకర్తలపై దాడి చేసి “టెర్రరిస్టులు, నక్సలైట్లు” అంటూ అన్నారని CJP కార్యకర్త శివాంగి శర్మ చెప్పారు. “ఔట్‌సైడర్‌, ఇన్‌సైడర్‌ అని ఎందుకు? ఇది ఒక్క దేశం.. మన దేశంలోని పిల్లల గురించే మాట్లాడుతున్నాం” అని ఆమె అన్నారు.

ఫిర్యాదులకు డైరెక్ట్ యాక్సెస్.. ‘ఓపెన్ బాక్స్’ ఏర్పాటు
Local· 21 Aug 2026

ఫిర్యాదులకు డైరెక్ట్ యాక్సెస్.. ‘ఓపెన్ బాక్స్’ ఏర్పాటు

TG: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు చెన్నూరు ఎమ్మెల్యే, మంత్రి వివేక్ వెంకటస్వామి వినూత్న విధానానికి శ్రీకారం చుట్టారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గ ప్రజల సమస్యలు, ఫిర్యాదులను నేరుగా తన దృష్టికి తీసుకువచ్చేందుకు ‘ఓపెన్ బాక్స్’ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పార్టీ, కులం, మతం, వర్గం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి సమస్యను తెలుసుకోవడమే తన ఉద్దేశమన్నారు. ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులు, అవసరమైతే తనపై ఉన్న ఫిర్యాదులను కూడా పెన్ను, పేపర్‌పై స్పష్టంగా రాసి బాక్స్‌లో వేయాలని కోరారు.

మున్సిపల్ కార్మికులకు సెలవుల జీవో సీఐటీయూ పోరాట ఫలితమే
Local· 21 Aug 2026

మున్సిపల్ కార్మికులకు సెలవుల జీవో సీఐటీయూ పోరాట ఫలితమే

TG: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు నిర్వహించిన పోరాటాల ఫలితంగానే వారాంతపు సెలవులు, నెలవారీ సెలవులు, క్యాజువల్ సెలవులు, వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసిందని సీఐటీయూ నాగర్‌కర్నూలు జిల్లా కోశాధికారి పొదిల రామయ్య అన్నారు. జిల్లా కేంద్రంలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులతో కలిసి మున్సిపల్ మేనేజర్‌కు ప్రభుత్వ సర్క్యులర్ జీవోను అందించారు.

గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు
Local· 21 Aug 2026

గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు

AP: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం చేపట్టిన గాలింపు చర్యలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈనెల 3న వేటకు వెళ్లిన బోటు 16వ తేదీకి తిరిగి రాకపోవడంతో కుటుంబాలు అధికారులకు సమాచారం ఇచ్చాయి. కోస్ట్‌గార్డ్, మెరైన్‌ పోలీసు లు, నేవీ డార్నియర్ విమానాలతో 216 నాటికల్ మైళ్ల పరిధిలో గాలింపు చేపట్టారు. ఇలాంటి ఘటనలు నివారించేందుకు ఎస్‌ఓపీ అమలు చేసి, ప్రతి బోటు, మత్స్యకారుడి వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు.

మాలీలకు ఎస్టీ హోదా కల్పించాలి
Local· 21 Aug 2026

మాలీలకు ఎస్టీ హోదా కల్పించాలి

TG: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా మాలీ కులస్థులకు ఎస్టీ హోదా కల్పించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మాలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లెండుగురే శ్యామ్‌రావు డిమాండ్ చేశారు. ఎస్టీ హోదా సాధించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. గత ఎన్నికల్లో బీజేపీ నాయకులు మాలీలకు ఎస్టీ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చినా, ఎన్నికల అనంతరం పార్లమెంట్‌లో గానీ అసెంబ్లీలో గానీ ఈ అంశాన్ని ప్రస్తావించడం లేదని విమర్శించారు.

కన్న కూతురిపై తండ్రి దారుణం
Crime· 21 Aug 2026

కన్న కూతురిపై తండ్రి దారుణం

TG: హైదరాబాద్‌లోని చంద్రాయణగుట్టలో ఘోరం జరిగింది. ఒక తండ్రి తన 12 ఏళ్ల కూతురిపై కొన్ని రోజులుగా లైంగిక వేధింపులకు పాల్పడుతూ, ఫ్యామిలీని బెదిరిస్తున్నాడు. గురువారం రాత్రి అతను మళ్ళీ మరోసారి దాడి చేయడానికి ట్రై చేయగా, ఆ చిన్నారి ఏమాత్రం భయపడకుండా డైరెక్ట్ Dial 112కి కాల్ చేసి పోలీసులకు విషయం చెప్పేసింది. స్పాట్‌కి వచ్చిన పోలీసులు నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నారు. ఇలాంటి రాక్షసుడికి న్యాయస్థానం కఠినమైన శిక్ష విధించాలని కోరుకుందాం.

'సీఎం రేవంత్ రెడ్డి పతనం మొదలైంది'
Local· 21 Aug 2026

'సీఎం రేవంత్ రెడ్డి పతనం మొదలైంది'

TG: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తోందని, సీఎం రేవంత్ రెడ్డి పతనం మొదలైందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఘాటుగా విమర్శించారు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ నుంచి భారీగా కొనసాగిన నిరసన మహాధర్నా ర్యాలీలో పాల్గొన్నారు. ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని వినతి పత్రం అందజేశారు. ఆడపిల్లల వివాహాలకు అండగా నిలిచే పథకాలను నిర్వీర్యం చేయడం దారుణం అని విమర్శించారు.

దళితవాడల సమస్యల పరిష్కారానికి ప్రచార యాత్ర
Local· 21 Aug 2026

దళితవాడల సమస్యల పరిష్కారానికి ప్రచార యాత్ర

AP: దళితవాడల్లో నెలకొన్న సమ స్యలను పరిష్కరించాలని కోరుతూ కెవిపిఎస్, వ్యవసా య కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రచార యాత్ర నిర్వహించారు. గుంటూరు జిల్లా పెదకాకానిలో ప్రారంభమైన యాత్ర దుగ్గిరాల మండలంలోని తుమ్మపూడి, చిలువూరు, పెనుమూలి, దుగ్గిరాల గ్రామాల్లో కొనసాగింది. కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏ.మాలాద్రి, వై.నేతాజీ, ఈమని అప్పారావు, జెట్టి బాలరాజు, బూరుగ వెంకటేశ్వర్లు, జె.నవీన్ ప్రకాష్, ఏ.కమలాకర్ తదితరులు పాల్గొన్నా రు.

నా టార్గెట్ రేవంత్ రెడ్డి మాత్రమే- కొండా సురేఖ కూతురు
TG· 21 Aug 2026

నా టార్గెట్ రేవంత్ రెడ్డి మాత్రమే- కొండా సురేఖ కూతురు

TG: తన టార్గెట్ రేవంత్ రెడ్డి మాత్రమే కానీ కాంగ్రెస్ పార్టీ కాదని కొండా సురేఖ కూతురు <a href="https://www.theclearcutnews.com/n/UgPwZBR">సుష్మిత పటేల్</a> మళ్ళీ కామెంట్స్ చేశారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ పట్ల తనకు ఎంతో రెస్పెక్ట్ ఉందన్నారు. రేవంత్ రెడ్డి, అతని బ్రదర్స్ విపరీతమైన కరప్షన్‌కు పాల్పడుతున్నారని, ఎమ్మెల్యే క్యాండిడేట్స్‌ను అనౌన్స్ చేయడానికి అతనికి ఏ రకమైన పవర్ ఉందని ప్రశ్నించారు. అవసరమైతే ఇండిపెండెంట్‌ కాండిడేట్‌గా పోటీ చేయడానికి కూడా తానేమీ వెనుకాడబోనని మాట్లాడారు. Credits: IANS

UBI RSETI ఆధ్వర్యంలో సర్టిఫికెట్ల అందజేత
Local· 21 Aug 2026

UBI RSETI ఆధ్వర్యంలో సర్టిఫికెట్ల అందజేత

TG: కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న,యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో జగిత్యాల DRDO PD రఘువరన్ CCTV శిక్షకులకు సర్టిఫికేట్లు అందజేశారు. అధికారులు మాట్లాడుతూ నిరుద్యోగులు ఉచిత స్వయం ఉపాధి శిక్షణను వినియోగించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో UBI RSETI డైరెక్టర్ బాపు, సెర్ప్ DPM రమేశ్, APM గంగాధర్, UBI బ్రాంచ్ మేనేజర్ ఆదిత్య, UBI RSETI సిబ్బంది శ్రీధర్, రాకేష్, వసంత, భరత్, CCTV శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులు పాల్గొన్నారు.

స్మార్ట్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలి
Local· 21 Aug 2026

స్మార్ట్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలి

AP: స్మార్ట్ కిచెన్ విధానంతో తమ ఉపాధికి ముప్పు ఏర్పడుతుందని ఆరోపిస్తూ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు గుంటూరులో ఆందోళనకు దిగారు. సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా కమిటీ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించింది. యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు దండా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. మండలానికి రూ.30–40 లక్షలు ఖర్చు చేసి స్మార్ట్ కిచెన్లు ఏర్పాటు చేయడం ఎందుకని ప్రశ్నించారు. కార్మికులకు మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలు, బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

రోడ్డు వేయకపోతే ఎన్నికలు జరగనివ్వము.. గ్రామస్థుల తిరుగుబాటు
AP· 21 Aug 2026

రోడ్డు వేయకపోతే ఎన్నికలు జరగనివ్వము.. గ్రామస్థుల తిరుగుబాటు

AP: అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం గాడిగుంట గ్రామస్థులు సొంతంగా రోడ్డు వేసుకున్నారు. కూటమి ప్రభుత్వం రోడ్డు వేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్తులు అన్నారు. 30 ఏళ్లుగా ఓటు వేస్తున్నా తమ గ్రామానికి రోడ్డు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే రోడ్డు వేయకపోతే వచ్చే సర్పంచ్ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు.

కాల్వలో చెత్త, దోమల బెడద.. వార్డు ప్రజల అవస్థలు
Local· 21 Aug 2026

కాల్వలో చెత్త, దోమల బెడద.. వార్డు ప్రజల అవస్థలు

TG: మురుగునీరు, చెత్తాచెదారంతో కాలువ నిండిపోవడంతో వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ఎక్మాయి గ్రామంలోని ఎస్సీ వార్డులో పారిశుధ్య సమస్య తీవ్రంగా మారింది. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ఎక్మాయి గ్రామంలో మురికినీటి కాలువ అధ్వానంగా తయారై దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువలో చెత్త పేరుకుపోవడంతో మురుగునీరు సక్రమంగా ప్రవహించక పోవడంతో దోమలు విపరీతంగా పెరిగిపోయాయని తెలిపారు. దీంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని గ్రామస్థులు వాపోయారు.

తమిళనాడు పాస్టర్‌కు నాలుగు మరణశిక్షలు
Crime· 21 Aug 2026

తమిళనాడు పాస్టర్‌కు నాలుగు మరణశిక్షలు

తమిళనాడులోని తిరునెల్వేలి POCSO స్పెషల్ కోర్టు ఒక ఘోరమైన కేసులో బిగ్ జడ్జిమెంట్ ఇచ్చింది. 2022లో సమ్మర్ మోరల్ క్లాసెస్ పేరుతో నలుగురు మైనర్ బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన S. అబ్రహం (47) అనే పాస్టర్‌కు కోర్టు ఏకంగా నాలుగు మరణశిక్షలు విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. దీంతో పాటు అతనికి ₹52,000 జరిమానా విధించింది. బాధిత బాలికలకు ఒక్కొక్కరికి ₹10 లక్షల చొప్పున పరిహారం అందించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

నాన్న గర్వంగా చూస్తుంటారు- రాహుల్ గాంధీ
Motivational· 21 Aug 2026

నాన్న గర్వంగా చూస్తుంటారు- రాహుల్ గాంధీ

రాజీవ్ గాంధీ బర్త్‌డే సందర్భంగా <a href="https://x.com/RahulGandhi/status/2090341208845647960?s=20">రాహుల్ గాంధీ</a> తన మదర్ సోనియా గాంధీ గురించి ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. సోనియా గాంధీ రాసిన “Belonging: A Journey of Love” అనే బుక్‌ని అనౌన్స్ చేస్తూ.. ఫాదర్ దూరమయ్యాక ఆమె ఎంత ధైర్యంగా కష్టాలను ఫేస్ చేశారో చెప్పారు. ఎప్పుడూ ప్రైవేట్‌గా ఉండే సోనియా గాంధీ తన లైఫ్ స్టోరీని ప్రపంచంతో షేర్ చేసుకోవడం హ్యాపీగా ఉందన్నారు. ఈ రోజు పైన ఉన్న నాన్న మిమ్మల్ని చూసి ప్రౌడ్‌గా ఫీలవుతారని రాహుల్ ఈ పోస్ట్‌లో మెన్షన్ చేశారు.

కారు–బైక్ ఢీ.. యువకుడి పరిస్థితి విషమం
Local· 21 Aug 2026

కారు–బైక్ ఢీ.. యువకుడి పరిస్థితి విషమం

AP: కారు, బైక్ ఢీకొన్న ఘోర ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న ఘటన కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది. రౌతులపూడి మండలం బంగారిపేట గ్రామంలో జరిగిన ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ములగపూడి గ్రామానికి చెందిన కాపారపు మిలీషా రాజుకు తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 అంబులెన్స్‌లో రౌతులపూడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేశారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.

రైల్వేలో 4,029 ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల
Jobs· 21 Aug 2026

రైల్వేలో 4,029 ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) జూనియర్ ఇంజనీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS) పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 4,029 వేకెన్సీలను భర్తీ చేయనుంది. గుర్తింపు పొందిన సంస్థ 3 ఏళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా లేదా సమానమైన B.E./B.Tech అర్హత ఉండాలి. SC/STలకు 5, OBC-NCLకు 3 ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అప్లికేషన్ Fee జనరల్‌కు రూ. 500, రిజర్వుడ్ కేటగిరీలకు రూ. 250. ఏజ్ 18–33 ఏళ్లు మధ్య ఉండాలి. ఆగస్ట్ 14 నుంచి సెప్టెంబర్ 13 వరకు అప్లై చేసుకోవచ్చు. <a href="https://www.rrbapply.gov.in/#/auth/landing">అప్లికేషన్ కోసం ఇక్కడ Click చేయండి.</a>

పులివెందులలో ఏకకాలంలో ఈడీ సోదాలు
Local· 21 Aug 2026

పులివెందులలో ఏకకాలంలో ఈడీ సోదాలు

AP: కడప జిల్లా పులివెందులలో శుక్రవారం ఉదయం ఈడీ సోదాలు కలకలం రేపాయి. ఉదయం 6 గంటల నుంచి పలువురు ప్రముఖుల నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి తదితరుల ఇళ్లలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి వీరంతా సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు.