Latest
రోడ్డు వేయకపోతే ఎన్నికలు జరగనివ్వము.. గ్రామస్థుల తిరుగుబాటు
AP: అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగుల మండలం గాడిగుంట గ్రామస్థులు సొంతంగా రోడ్డు వేసుకున్నారు. కూటమి ప్రభుత్వం రోడ్డు వేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్తులు అన్నారు. 30 ఏళ్లుగా ఓటు వేస్తున్నా తమ గ్రామానికి రోడ్డు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే రోడ్డు వేయకపోతే వచ్చే సర్పంచ్ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు.

కాల్వలో చెత్త, దోమల బెడద.. వార్డు ప్రజల అవస్థలు
TG: మురుగునీరు, చెత్తాచెదారంతో కాలువ నిండిపోవడంతో వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ఎక్మాయి గ్రామంలోని ఎస్సీ వార్డులో పారిశుధ్య సమస్య తీవ్రంగా మారింది. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ఎక్మాయి గ్రామంలో మురికినీటి కాలువ అధ్వానంగా తయారై దుర్వాసన వెదజల్లుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువలో చెత్త పేరుకుపోవడంతో మురుగునీరు సక్రమంగా ప్రవహించక పోవడంతో దోమలు విపరీతంగా పెరిగిపోయాయని తెలిపారు. దీంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని గ్రామస్థులు వాపోయారు.

తమిళనాడు పాస్టర్‌కు నాలుగు మరణశిక్షలు
తమిళనాడులోని తిరునెల్వేలి POCSO స్పెషల్ కోర్టు ఒక ఘోరమైన కేసులో బిగ్ జడ్జిమెంట్ ఇచ్చింది. 2022లో సమ్మర్ మోరల్ క్లాసెస్ పేరుతో నలుగురు మైనర్ బాలికలపై లైంగిక దాడికి పాల్పడిన S. అబ్రహం (47) అనే పాస్టర్‌కు కోర్టు ఏకంగా నాలుగు మరణశిక్షలు విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. దీంతో పాటు అతనికి ₹52,000 జరిమానా విధించింది. బాధిత బాలికలకు ఒక్కొక్కరికి ₹10 లక్షల చొప్పున పరిహారం అందించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

నాన్న గర్వంగా చూస్తుంటారు- రాహుల్ గాంధీ
రాజీవ్ గాంధీ బర్త్‌డే సందర్భంగా <a href="https://x.com/RahulGandhi/status/2090341208845647960?s=20">రాహుల్ గాంధీ</a> తన మదర్ సోనియా గాంధీ గురించి ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. సోనియా గాంధీ రాసిన “Belonging: A Journey of Love” అనే బుక్‌ని అనౌన్స్ చేస్తూ.. ఫాదర్ దూరమయ్యాక ఆమె ఎంత ధైర్యంగా కష్టాలను ఫేస్ చేశారో చెప్పారు. ఎప్పుడూ ప్రైవేట్‌గా ఉండే సోనియా గాంధీ తన లైఫ్ స్టోరీని ప్రపంచంతో షేర్ చేసుకోవడం హ్యాపీగా ఉందన్నారు. ఈ రోజు పైన ఉన్న నాన్న మిమ్మల్ని చూసి ప్రౌడ్‌గా ఫీలవుతారని రాహుల్ ఈ పోస్ట్‌లో మెన్షన్ చేశారు.

కారు–బైక్ ఢీ.. యువకుడి పరిస్థితి విషమం
AP: కారు, బైక్ ఢీకొన్న ఘోర ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న ఘటన కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది. రౌతులపూడి మండలం బంగారిపేట గ్రామంలో జరిగిన ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ములగపూడి గ్రామానికి చెందిన కాపారపు మిలీషా రాజుకు తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 అంబులెన్స్‌లో రౌతులపూడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి రిఫర్ చేశారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.

రైల్వేలో 4,029 ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) జూనియర్ ఇంజనీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS) పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 4,029 వేకెన్సీలను భర్తీ చేయనుంది. గుర్తింపు పొందిన సంస్థ 3 ఏళ్ల ఇంజినీరింగ్ డిప్లొమా లేదా సమానమైన B.E./B.Tech అర్హత ఉండాలి. SC/STలకు 5, OBC-NCLకు 3 ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అప్లికేషన్ Fee జనరల్‌కు రూ. 500, రిజర్వుడ్ కేటగిరీలకు రూ. 250. ఏజ్ 18–33 ఏళ్లు మధ్య ఉండాలి. ఆగస్ట్ 14 నుంచి సెప్టెంబర్ 13 వరకు అప్లై చేసుకోవచ్చు. <a href="https://www.rrbapply.gov.in/#/auth/landing">అప్లికేషన్ కోసం ఇక్కడ Click చేయండి.</a>

పులివెందులలో ఏకకాలంలో ఈడీ సోదాలు
AP: కడప జిల్లా పులివెందులలో శుక్రవారం ఉదయం ఈడీ సోదాలు కలకలం రేపాయి. ఉదయం 6 గంటల నుంచి పలువురు ప్రముఖుల నివాసాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి తదితరుల ఇళ్లలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి వీరంతా సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు.

Weaponsతో వెళ్తున్న షిప్ హైజాక్.. ఆరుగురు భారతీయులు బందీ!
సోమాలియా తీరంలో సముద్ర దొంగలు ఓ కార్గో షిప్‌ను హైజాక్ చేశారు. కెమెరూన్ జెండాతో వెళ్తున్న ‘LUTUF’ నౌకను సోమాలియాలోని పుంట్‌లాండ్ దగ్గరలో హైజాక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ షిప్‌లో మొత్తం 10 మంది స్టాఫ్ ఉండగా, వారిలో ఆరుగురు ఇండియన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. టర్కీ నుంచి మొగదిషులోని మిలిటరీ ట్రైనింగ్ సెంటర్‌కు వెపన్స్, కమ్యూనికేషన్, శాటిలైట్ ఎక్విప్‌మెంట్స్ షిప్‌లో తీసుకెళ్తున్నారు. 8 మంది Pirates నౌకను తీర ప్రాంతం వైపు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఘటనపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

43% పడిపోయిన ఉపాధి హామీ పనులు?
MGNREGA స్థానంలో కొత్తగా వచ్చిన VB-G RAM G స్కీమ్ ట్రాన్సిషన్ వల్ల రూరల్ ఎంప్లాయ్‌మెంట్ తీవ్రంగా పడిపోయింది. ఏప్రిల్-జూలై 2026లో ఉపాధి పనులు 43% తగ్గి, కేవలం 70 కోట్ల పర్సన్-డేస్‌కే లిమిట్ అయ్యాయి. గత రెండేళ్ల యావరేజ్ 128 కోట్లతో పోలిస్తే ఇది బిగ్ డ్రాప్. ముఖ్యంగా MP, UP, జార్ఖండ్ వంటి స్టేట్స్‌లో 60-85% వర్క్ తగ్గింది. బడ్జెట్‌లో ₹95,692 కోట్లు అలొకేట్ చేసినా, వర్కర్స్‌కి వేతనం సరిగ్గా అందక, పనులు ఆగిపోయి విలేజ్ వర్కర్స్ తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

సీఎం టూర్‌పై స్పెషల్ ఫోకస్.. పకడ్బందీ ఏర్పాట్లు
AP: ఈ నెల 22న ముఖ్యమంత్రి అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేశారు. సీఎం పర్యటనకు సంబంధించి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు కీలక సూచనలు చేశారు. హెలిప్యాడ్, రహదారి, సభా వేదికతో పాటు ఏ-కోడూరు ఎస్సీ కాలనీలో నిర్వహించనున్న ప్రజలతో ముఖాముఖి కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను నిర్ణీత సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు. పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని సూచించారు.

ACBకి పట్టుబడ్డ రాజంపేట ఎస్సై
TG: కేసులో అనుకూలంగా వ్యవహరించేందుకు లంచం తీసుకుంటున్నారనే ఆరోపణలపై కామారెడ్డి జిల్లాలో ఓ ఎస్సై ఏసీబీకి పట్టుబడ్డారు. రాజంపేట పోలీస్ స్టేషన్ ఎస్సై ఆంజనేయులు రూ.30 వేల లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు సమాచారం. ఓ కేసులో అనుకూలంగా వ్యవహరించేందుకు లంచం డిమాండ్ చేశారని బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా అధికారులు పక్కా ప్రణాళికతో దాడి నిర్వహించి ఎస్సైను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులపై రాళ్లతో దాడి.. ఉద్రిక్తత
TG: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తికి న్యాయం చేయాలంటూ చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెద్దమ్మ తండాకు చెందిన బొగ్గుల సాయిగౌడ్ తిమ్మాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన వాహనం నడిపింది మైనర్ అని, ఎఫ్‌ఐఆర్‌లో అతని పేరు నమోదు చేయలేదని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు మృతదేహంతో పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు బయలుదేరారు. అయితే తండా వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.

గోల్కొండ కోటలో సొరంగం.. అసలు మిస్టరీ ఏంటి?
TG: హైదరాబాద్‌లోని హిస్టారిక్ గోల్కొండ కోటలో ఆర్మీ ఆఫీసర్స్ తవ్వకాల్లో సొరంగం బయటపడింది. 500 ఏళ్ల చరిత్ర ఉన్న కోటలో ఈ దారి ఎలా ఏర్పడింది? ఎక్కడికి వెళుతుంది? అనే ప్రశ్నలు వస్తున్నాయి. కోటలో గతంలో ఉన్న రహస్య దారులపై ఇప్పటికే ఎన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉన్నాయి. ఇప్పుడు బయటపడిన సొరంగంపై అధికారులు, Archaeologists రీసెర్చ్ చేసే అవకాశముంది. ఈ టన్నెల్ నిజంగా ఏ కాలానికి చెందినదో తేలాల్సి ఉంది. దీంతో గోల్కొండ నుండి చార్మినార్‌కు సీక్రెట్ దారి ఉందని ప్రచారం జరుగుతుంది.

జాతీయ రహదారిపై రెండు వాహనాలు ఢీ
TG: జాతీయ రహదారిపై రెండు భారీ వాహనాలు ఢీకొనడంతో ఒక్కసారిగా ట్రాఫిక్ నిలిచిపోయింది. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కల్వరాల శివారులో 42వ జాతీయ రహదారిపై గురువారం ఈ ప్రమాదం జరిగింది. నాగ్‌పూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ ముందు చక్రం విరిగి రోడ్డుపై ఆగిపోయింది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన డీసీఎం లారీని ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాలు రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు భారీ క్రేన్‌ను తీసుకువచ్చి వాహనాలను రహదారి నుంచి తొలగించే చర్యలు చేపట్టారు.

కీమోకి బైబై చెప్పించే కొత్త క్యాన్సర్ డ్రగ్?
కీమోలో క్యాన్సర్ కణాలతో పాటు హెల్తీ సెల్స్ కూడా దెబ్బతినొచ్చు. దీన్ని తగ్గించే లక్ష్యంతో RK-251 అనే కొత్త డ్రగ్‌ను IASSTకి చెందిన డా. ఆసిస్ బలా, IIT గువాహాటికి చెందిన డా. K.P. భాబక్ టీమ్స్ అభివృద్ధి చేశాయి. క్యాన్సర్ కణాల్లో ఎక్కువగా ఉండే ROSను triggerగా చేసుకుని, క్యాన్సర్ కణాల దగ్గరికి వెళ్లినప్పుడే పని చేసేలా ఈ డ్రగ్‌ను తయారు చేశారు. ల్యాబ్ టెస్టుల్లో triple-negative బ్రెస్ట్ కాన్సర్ పై మంచి ఫలితాలు వచ్చాయి. అయితే హ్యూమన్ trials ఇంకా చేయాల్సి ఉంది.

గ్లోబల్ జీనియస్ స్కూల్‌ను సీజ్ చేయాలి
AP: ప్రభుత్వ అనుమతులు లేకుండా పాఠశాల నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ గ్లోబల్ జీనియస్ స్కూల్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పీఆర్‌ఎస్‌వైఎఫ్ జిల్లా కన్వీనర్ రఘునాథ్, ఆర్‌పీఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షాహిద్ ఆఫ్రిది మాట్లాడారు. అనుమతులు, గుర్తింపు లేని పాఠశాలలో 200 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారని, వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

గేదెలను మేపుతుండగా విషాదం
TG: పాడి గేదెలను మేపేందుకు వెళ్లిన రైతుకు ఊహించని విషాదం ఎదురైంది. విద్యుత్ ఘాతానికి గురై రెండు గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని ఫరూక్‌నగర్ మండలం లింగారెడ్డిగూడెం గ్రామ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గోదా రమేష్ గ్రామ శివారులో గేదెలను మేపుతుండగా విద్యుత్ స్తంభం వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురయ్యాయి. దీంతో రెండు పాడి గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటనతో బాధిత రైతు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

అమలాపురం డిపో మేనేజర్‌గా ప్రేమ్ కుమార్
AP: ప్రయాణికులకు మెరుగైన, సురక్షితమైన రవాణా సేవలు అందించడమే తన ప్రధాన లక్ష్యమని అమలాపురం ఆర్టీసీ డిపో నూతన మేనేజర్ టీ. ప్రేమ్‌కుమార్ తెలిపారు. కోనసీమ జిల్లా అమలాపురం ఆర్టీసీ డిపో మేనేజర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డిపో పరిధిలోని బస్సుల కండిషన్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. బస్సులను ఎప్పటికప్పుడు తనిఖీ చేయిస్తూ ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. బస్సుల్లో పరిశుభ్రత, నిర్వహణ, సమయపాలనకు అధిక ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు.

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు!
గ్లోబల్ మార్కెట్‌లో US-ఇరాన్ టెన్షన్స్ వల్ల ఈరోజు గోల్డ్, సిల్వర్ రేట్లు బాగా పెరిగాయి. గుడ్ రిటర్న్స్ డేటా ప్రకారం ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹1,59,430కి, 22 క్యారెట్ల రేటు ₹1,46,160కి చేరింది. ముంబై, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి ₹1,59,280 కాగా, 22 క్యారెట్ల గోల్డ్ ₹1,46,010గా ట్రేడ్ అవుతోంది. మరోవైపు సిల్వర్ రేట్ భారీగా పెరిగి కేజీ వెండి ధర ₹2,60,100కి రీచ్ అయింది. బంగారం ధరలు ఎప్పడికప్పుడు మారుతుంటాయి షాపింగ్ ప్లాన్ చేసే ముందు ప్రైసెస్ చెక్ చేసుకోండి.

ఒకే వేదికపై సౌత్ పొలిటికల్ స్టార్స్
తమిళనాడులో జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ మీట్ రాజకీయంగా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. సెంట్రల్ మినిస్టర్ అమిత్ షా సమక్షంలో జరిగిన సమావేశంలో సౌత్ స్టేట్స్‌కు చెందిన CMలు, పొలిటికల్ లీడర్స్ ఒకే వేదికపై కనిపించారు. తమిళనాడు CM జోసెఫ్ విజయ్ స్వాగత ప్రసంగం చేశారు. ఈ సమావేశంలో ఏపీ CM చంద్రబాబు, కర్ణాటక CM D.K. శివకుమార్, తెలంగాణ డిప్యూటీ CM భట్టివిక్రమార్క, కేరళ CM V.D. సతీశన్ పాల్గొన్నారు. దక్షిణాది రాజకీయాల్లో కీలకంగా ఉన్న లీడర్స్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో ఈ విజువల్స్ ఆసక్తిగా మారాయి.

వీబీజీ రాంజీ పథకాన్ని రద్దు చేయాలి: సీపీఐ
AP: వీబీజీ రాంజీ పథకం వల్ల ఉపాధి కూలీలకు నష్టం జరుగుతోందని ఆరోపిస్తూ కర్నూలు జిల్లాలో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్దకడబూరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి వీరేశ్, రైతు సంఘం నాయకుడు ఆంజనేయ, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి చంద్ర మాట్లాడుతూ.. వీబీజీ రాంజీ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి కూలీలకు పెండింగ్‌లో ఉన్న వేతనాలను తక్షణమే చెల్లించాలని కోరారు.