Latest

గ్లోబల్ జీనియస్ స్కూల్‌ను సీజ్ చేయాలి
AP: ప్రభుత్వ అనుమతులు లేకుండా పాఠశాల నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ గ్లోబల్ జీనియస్ స్కూల్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. కర్నూలు జిల్లా సి.బెళగల్ మండలంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పీఆర్‌ఎస్‌వైఎఫ్ జిల్లా కన్వీనర్ రఘునాథ్, ఆర్‌పీఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షాహిద్ ఆఫ్రిది మాట్లాడారు. అనుమతులు, గుర్తింపు లేని పాఠశాలలో 200 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారని, వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

గేదెలను మేపుతుండగా విషాదం
TG: పాడి గేదెలను మేపేందుకు వెళ్లిన రైతుకు ఊహించని విషాదం ఎదురైంది. విద్యుత్ ఘాతానికి గురై రెండు గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని ఫరూక్‌నగర్ మండలం లింగారెడ్డిగూడెం గ్రామ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గోదా రమేష్ గ్రామ శివారులో గేదెలను మేపుతుండగా విద్యుత్ స్తంభం వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురయ్యాయి. దీంతో రెండు పాడి గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటనతో బాధిత రైతు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.

అమలాపురం డిపో మేనేజర్‌గా ప్రేమ్ కుమార్
AP: ప్రయాణికులకు మెరుగైన, సురక్షితమైన రవాణా సేవలు అందించడమే తన ప్రధాన లక్ష్యమని అమలాపురం ఆర్టీసీ డిపో నూతన మేనేజర్ టీ. ప్రేమ్‌కుమార్ తెలిపారు. కోనసీమ జిల్లా అమలాపురం ఆర్టీసీ డిపో మేనేజర్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డిపో పరిధిలోని బస్సుల కండిషన్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. బస్సులను ఎప్పటికప్పుడు తనిఖీ చేయిస్తూ ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. బస్సుల్లో పరిశుభ్రత, నిర్వహణ, సమయపాలనకు అధిక ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు.

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు!
గ్లోబల్ మార్కెట్‌లో US-ఇరాన్ టెన్షన్స్ వల్ల ఈరోజు గోల్డ్, సిల్వర్ రేట్లు బాగా పెరిగాయి. గుడ్ రిటర్న్స్ డేటా ప్రకారం ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹1,59,430కి, 22 క్యారెట్ల రేటు ₹1,46,160కి చేరింది. ముంబై, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి ₹1,59,280 కాగా, 22 క్యారెట్ల గోల్డ్ ₹1,46,010గా ట్రేడ్ అవుతోంది. మరోవైపు సిల్వర్ రేట్ భారీగా పెరిగి కేజీ వెండి ధర ₹2,60,100కి రీచ్ అయింది. బంగారం ధరలు ఎప్పడికప్పుడు మారుతుంటాయి షాపింగ్ ప్లాన్ చేసే ముందు ప్రైసెస్ చెక్ చేసుకోండి.

ఒకే వేదికపై సౌత్ పొలిటికల్ స్టార్స్
తమిళనాడులో జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ మీట్ రాజకీయంగా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. సెంట్రల్ మినిస్టర్ అమిత్ షా సమక్షంలో జరిగిన సమావేశంలో సౌత్ స్టేట్స్‌కు చెందిన CMలు, పొలిటికల్ లీడర్స్ ఒకే వేదికపై కనిపించారు. తమిళనాడు CM జోసెఫ్ విజయ్ స్వాగత ప్రసంగం చేశారు. ఈ సమావేశంలో ఏపీ CM చంద్రబాబు, కర్ణాటక CM D.K. శివకుమార్, తెలంగాణ డిప్యూటీ CM భట్టివిక్రమార్క, కేరళ CM V.D. సతీశన్ పాల్గొన్నారు. దక్షిణాది రాజకీయాల్లో కీలకంగా ఉన్న లీడర్స్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో ఈ విజువల్స్ ఆసక్తిగా మారాయి.

వీబీజీ రాంజీ పథకాన్ని రద్దు చేయాలి: సీపీఐ
AP: వీబీజీ రాంజీ పథకం వల్ల ఉపాధి కూలీలకు నష్టం జరుగుతోందని ఆరోపిస్తూ కర్నూలు జిల్లాలో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్దకడబూరు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి వీరేశ్, రైతు సంఘం నాయకుడు ఆంజనేయ, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి చంద్ర మాట్లాడుతూ.. వీబీజీ రాంజీ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి కూలీలకు పెండింగ్‌లో ఉన్న వేతనాలను తక్షణమే చెల్లించాలని కోరారు.

చించినాడ బ్రిడ్జిపై రాకపోకలు పునఃప్రారంభం
AP: ఏడాది కాలంగా ఎదురుచూస్తున్న వాహనదారులకు ఎట్టకేలకు ఊరట లభించింది.. దిండి–చించినాడ వంతెనపై భారీ వాహనాల రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి. బీ.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాలను కలిపే ఈ వంతెనపై మరమ్మతుల కారణంగా గత ఏడాది నుంచి భారీ వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించాల్సి వచ్చి అదనపు సమయం, ఖర్చుతో ఇబ్బందులు పడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వంతెనపై భారీ వాహనాలకు అనుమతులు ఇచ్చారు.

పవన్ కల్యాణ్‌కు ప్రకృతి వైద్యం.. 20 రోజులు కేరళలోనే
AP: డిప్యూటీ CM పవన్ కల్యాణ్ నేడు కేరళకు వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళలోని ఓ నేచురోపతి సెంటర్‌లో ట్రీట్‌మెంట్ తీసుకోనున్నారు. ఇటీవల తరచూ అనారోగ్యానికి గురవుతున్న పవన్ కల్యాణ్.. కొద్దిరోజుల క్రితం భుజానికి సర్జరీ చేయించుకున్నారు. అయన ప్రస్తుతం హెల్త్‌పై స్పెషల్ అటెన్షన్ తీసుకుంటున్నారు. 20 రోజుల నేచురోపతి ట్రీట్‌మెంట్ తరువాత తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు.

MP అవినాశ్ రెడ్డి ఇంట్లో ED సోదాలు.. ఒకేసారి రెండు చోట్ల!
AP: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఆఫీసర్స్ కడప MP YS అవినాశ్ రెడ్డికి సంబంధించిన ఇళ్లల్లో రైడ్స్ చేశారు. హైదరాబాద్‌లోని రెండు ప్రాంతాలు, పులివెందులలో నాలుగు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి YS భాస్కర్ రెడ్డికి సంబంధించిన ప్రదేశాల్లోనూ రైడ్స్ జరుగుతున్నాయి. YS వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన మనీలాండరింగ్ కేసు కింద ఈ సోదాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్కసారిగా ED అధికారులు రైడ్స్ చేయడంతో తెలుగు రాష్టాల్లో సంచలనంగా మారింది.

రిజర్వేషన్లు, భూ సమస్యలపై కమిషన్ కీలక సమీక్ష
TG: ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల నియామకాలు, పదోన్నతులు, రిజర్వేషన్లు, భూసమస్యలపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధ్యక్షతన సభ్యులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ శబరిష్, అదనపు కలెక్టర్ రెవెన్యూ కె.అనిల్‌కుమార్‌తో పాటు వివిధ శాఖల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసుల పరిష్కారం, బాధితులకు నష్టపరిహారం, భూ సమస్యలు, సబ్‌ప్లాన్ నిధుల వినియోగం తదితర అంశాలపై అధికారులు వివరాలు అందించారు.

భక్తుల కోసం తిరుమలలో హైటెక్ Robo డాగ్!
AP: తిరుమలలో భక్తుల సేఫ్టీ కోసం TTD హైటెక్ రోబో డాగ్‌ను వాడనున్నారు. అడవుల్లో చిరుతలు, ఇతర జంతువుల మూవ్‌మెంట్స్‌ను ఈ రోబో సూపర్‌వైజ్ చేస్తుంది. ఇందులో ఆప్టికల్, థర్మల్ కెమెరాలు, 360 డిగ్రీల లైడార్, AI టెక్నాలజీ ఉన్నాయి. జంతువులు, మనుషులు కనిపిస్తే కంట్రోల్ రూమ్‌కు లైవ్ వీడియో, జియో-ట్యాగ్ అలర్ట్‌లు పంపుతుంది. ఒకవేళ తిరుమల మెట్ల మార్గం వైపు అడవి జంతువులు వస్తే.. రోబోట్‌లోని సౌండ్, లైట్ యూనిట్స్ ద్వారా సేఫ్‌గా తిరిగి అడవిలోకి పంపేలా దీన్ని డిజైన్ చేశారు.
డ్రగ్స్‌కు దూరంగా ఉంటేనే మంచి భవిష్యత్తు: SI
AP: మాదకద్రవ్యాల అలవాటుతో విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని ఎస్సై రవిచంద్రకుమార్ హెచ్చరించారు. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాక జడ్పీ ఉన్నత పాఠశాలలో ‘కనెక్ట్ యూత్’ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ చదువుపై పూర్తి దృష్టి పెట్టాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల ఆరోగ్యంతో పాటు విద్య, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని వివరించారు. బాలికల భద్రతకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు.

జన్నారం మండలంలో ఓటర్ల జాబితాలపై కీలక ప్రకటన
TG: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేసి, పరిశీలన అనంతరం జాబితాలను ప్రకటించినట్లు మంచిర్యాల జిల్లా జన్నారం మండల తహశీల్దార్ బక్కయ్య తెలిపారు. మండలంలోని అన్ని గ్రామపంచాయతీ కార్యాలయాల నోటీసుబోర్డుల్లో ముసాయిదా ఓటర్ల జాబితాలను ప్రదర్శించినట్లు వెల్లడించారు. ఓటర్లు తమ పేర్లు, వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. జాబితాలో పేరు లేని అర్హులైన కొత్త ఓటర్లు ఫారం-6 ద్వారా పేర్లను నమోదు చేసుకోవచ్చని తెలిపారు.

రూ.40 లక్షల అభివృద్ధి పనులు ప్రారంభం
TG: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం మల్లుపేట్ గ్రామంలో నిర్మించిన మహిళా సమాఖ్య భవనం, సీసీ రోడ్డు, నూతన గ్రామపంచాయతీ భవనాలను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రారంభించారు. మహిళా సమాఖ్య భవనానికి రూ.10 లక్షలు, సీసీ రోడ్డుకు రూ.10 లక్షలు, గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి రూ.20 లక్షలు ఖర్చు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రజలకు అవసరమైన సౌకర్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు.

శ్రామికులకు వెల్డింగ్ మిషన్ల పంపిణీ
AP: గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని నూతక్కి, యర్రబాలెం గ్రామాలకు చెందిన శ్రామికులకు మంత్రి నారా లోకేశ్ సొంత నిధులతో వెల్డింగ్ మిషన్లను పంపిణీ చేశారు. నూతక్కికి చెందిన షేక్ మసూద్‌తో పాటు యర్రబాలెంకు చెందిన మిరియాల శేఖర్‌బాబు, ఉమ్మలేటి శ్రీకాంత్, షేక్ మొహమ్మద్ రసూల్‌కు పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు పల్లబోతుల శ్రీనివాసరావు మాట్లాడుతూ.. శ్రామికులు ఇతరులపై ఆధారపడకుండా స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ సహాయం అందించినట్లు తెలిపారు.

పోక్సో చట్టంపై అవగాహన
AP: NTR జిల్లా పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడులోని చైతన్య స్కూల్‌లో సైబర్ ఫ్రాడ్స్, ఆన్‌లైన్ మోసాలు, పోక్సో చట్టంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై అర్జున్ మాట్లాడుతూ.. గుర్తుతెలియని ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, అనుమానాస్పద లింకులకు స్పందించవద్దని సూచించారు. వ్యక్తిగత వివరాలు, బ్యాంకు సమాచారం, ఓటీపీ వంటి కీలక సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని వివరించారు. చిన్నారుల రక్షణ కోసం పోక్సో చట్టంలోని అంశాలను, బాలలపై జరిగే నేరాల నుంచి రక్షణ పొందేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

విద్యార్థుల హక్కులను కాలరాయొద్దు: KTR
TG: GO 97ను వెంటనే రద్దు చేయాలని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ జీవో కారణంగా రాష్ట్రంలోని వేలాది మంది పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జీవోకు వ్యతిరేకంగా విద్యార్థులు నిర్వహిస్తున్న రాష్ట్రవ్యాప్త నిరసనలకు BRS పూర్తి మద్దతు ఉంటుందని ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్న విద్యార్థులపై కొన్ని చోట్ల పోలీసులు అనుచితంగా వ్యవహరించడం బాధాకరమన్నారు.

SC విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కేంద్రాలు: మంత్రి డోలా
AP: SC విద్యార్థులకు JEE, NEET పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా నాణ్యమైన విద్యతో పాటు అత్యాధునిక సౌకర్యాలు అందించనున్నట్లు మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి తెలిపారు. గుంటూరు జిల్లా తాడికొండలో ఏర్పాటు చేయనున్న జేఈఈ, నీట్ ఎక్స్‌లెన్స్ సెంటర్లలో అదనపు భవనాల నిర్మాణం, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలపై సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అదనపు భవనాలతో పాటు అంతర్గత రహదారులు, వాకింగ్ ట్రాక్, బ్యాడ్మింటన్ కోర్టు, ఖోఖో కోర్టు, మల్టీపర్పస్ కోర్టులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఫీజు బకాయిలు చెల్లించకపోతే ఉద్యమమే: ఆర్. కృష్ణయ్య
TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలపై జాతీయ BC సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని నిలదీశారు. CM రేవంత్‌రెడ్డి రూ.2,300 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను బ్యాంకులో జమ చేసినట్లు ప్రకటించారని, ఆర్థికశాఖ నుంచి నిధులు విడుదల కాకపోతే వాటిని ఏ బ్యాంకులో డిపాజిట్ చేశారని ప్రశ్నించారు. APలో BC విద్యార్థుల పూర్తి ఫీజులతోపాటు రూ.15వేల ఉపకార వేతనాలు అందిస్తున్నారని, తెలంగాణలోనూ అదేవిధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలన్నారు.

ఉన్న నీటితోనే పంటలు కాపాడుకోవాలి: ఉత్తమ్
TG: నాగార్జునసాగర్‌లో నీటి నిల్వలు తగ్గిపోవడంతో రైతులు పంటల సాగుపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 31 శాతం వర్షపాతం లోటు ఉందని, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లోనూ ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసే పరిస్థితి లేదని నిపుణులు చెబుతున్నారని తెలిపారు. సూర్యాపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి, MBC (మహాత్మా గాంధీ ముక్త్యాల బ్రాంచ్ కెనాల్) ఎత్తిపోతల పథకాన్ని ఆయన పరిశీలించారు.

ఇక ప్రతి ఫిర్యాదుకూ పరిష్కారం: పొంగులేటి
TG: రాష్ట్రంలోని 22ఏ నిషేధిత భూముల సమస్యలపై ప్రజల నుంచి కాల్ సెంటర్‌కు వస్తున్న ప్రతి ఫిర్యాదును పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో పలు జిల్లాల్లో 22ఏ భూముల పరిస్థితి, పెండింగ్ దరఖాస్తులపై సమీక్షించారు. ఇప్పటివరకు కాల్ సెంటర్‌కు సుమారు 400 ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ప్రతి ఫిర్యాదును సంబంధిత అధికారులకు వెంటనే పంపించి, సమస్య పరిష్కారమయ్యే వరకు పర్యవేక్షించాలని మంత్రి సూచించారు.