Latest

నోయిడా కార్మికుల కన్నీటి కథ!
నోయిడాలో వేతన పెంపు కోసం ఆందోళన చేసిన కార్మికులపై పోలీసులు తీవ్రమైన కేసులు మోపారు. హత్యాయత్నం వంటి ఆరోపణలతో 106 మంది అరెస్ట్ కాగా, వారు సగటున 53 రోజులు జైల్లో గడిపారని 'ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్' దర్యాప్తులో తేలింది. అయితే నిరసన ప్రదేశంలో ఉన్నంత మాత్రాన బాధ్యులను చేయలేమని, నిర్దిష్ట ఆధారాలు లేవని పేర్కొంటూ కోర్టులు 84% మందికి బెయిల్ మంజూరు చేశాయి. కొందరిపై 'NSA' చట్టం ప్రయోగించి, వాట్సాప్ చాట్లు, చదివిన పుస్తకాలను ఆధారాలుగా చూపడం గమనార్హం.

ఉద్యోగాలు కోల్పోయిన 607 మందికి న్యాయం చేయాలి
AP: విజయవాడలో అర్బన్ ఈ–సేవ ఉద్యోగుల సమస్య మరోసారి తెరపైకి వచ్చింది. 2003 నుంచి ప్రభుత్వ అర్బన్ ఈ–సేవ కేంద్రాల్లో సుమారు 18 ఏళ్లపాటు సేవలందించిన 607 మంది ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఏపీ ఈ–సేవ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు కోల్పోయిన తమకు న్యాయం చేయాలని ఆగస్టు 17 నుంచి 20 వరకు ఈఎస్‌డీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్యోగ సాధన సంకల్ప దీక్షలు చేపట్టారు. కార్యక్రమానికి సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవి. నాగేశ్వరరావు మద్దతు తెలిపారు.

అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు.. Press meetలో జగన్!
AP: తాడేపల్లిలో ఈరోజు YSRCP అధినేత జగన్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. DSC స్కామ్‌పై మేము మొదటి నుంచి పోరాడుతున్నామని అన్నారు. తాము లేవనెత్తిన అంశాలు కరెక్ట్ అని ప్రభుత్వమే అంగీకరించిందన్నారు. CM చంద్రబాబు, మంత్రి లోకేశ్ అసెంబ్లీలో చేసిన ప్రకటనలే ఇందుకు నిదర్శనమన్నారు. తప్పు చేసిన వారు గింజుకుంటున్నారు కానీ.. CBI ఎంక్వైరీకి ప్రభుత్వం ఎందుకు అంగీకరించడం లేదని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా ఇస్తే CMకు ఇచ్చిన టైమ్ ప్రతిపక్ష నేతకూ ఇవ్వాల్సి వస్తుందని, అందుకే హోదా ఇవ్వడం లేదని ఆరోపించారు.

గొల్లప్రోలు మున్సిపాలిటీలో పునర్విభజన
AP: కాకినాడ జిల్లా గొల్లప్రోలు మున్సిపాలిటీలో వార్డుల పునర్విభజన పూర్తయింది. ఇప్పటివరకు ఉన్న 20 వార్డులను 23 వార్డులుగా పునర్వ్యవస్థీకరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుని వార్డుల సరిహద్దులను నిర్ణయించారు. పునర్విభజనకు సంబంధించిన సరిహద్దులతో కూడిన 23 వార్డుల వివరాలను పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచారు. మున్సిపల్ కమిషనర్ సంపత్తి దివిజ ఆధ్వర్యంలో నోటీస్ బోర్డులో గెజిట్ వివరాలను ప్రదర్శించారు.

నేడు సౌత్ స్టేట్స్ CMలతో అమిత్ షా భేటీ.. Hot Topics ఇవే!
తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు జిల్లా కోవళంలో 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ మీట్ ఈరోజు జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిగే ఈ భేటీకి సౌత్ స్టేట్స్ CMలు, అధికారులు హాజరవుతున్నారు. రాష్ట్రాల్లో సమస్యలు, నీటి పంపకాలు, ఎడ్యుకేషన్, హెల్త్, లా అండ్ ఆర్డర్, ఎకనామిక్ డెవలప్‌మెంట్‌పై చర్చించే అవకాశముంది. ముఖ్యంగా కావేరీ వాటర్ డిస్ప్యూట్స్, ఏపీ-తెలంగాణ విభజన అంశాలపై చర్చకు ఇంపార్టెన్స్ ఉండనుంది. ఈ సమావేశాలు కేంద్ర-రాష్ట్రాల మధ్య కోఆర్డినేషన్, వివాదాల పరిష్కారానికి కీలక వేదికగా నిలుస్తున్నాయి.

క్రీడా మైదానాలపై నిర్లక్ష్యం.. అధికారులపై స్థానికుల ఆగ్రహం
TG: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సర్కిల్ పరిధిలోని క్రీడా మైదానాల నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్వాల్‌గూడ, శంషాబాద్ డివిజన్లలోని పలు మైదానాలు పిచ్చి మొక్కలు, చెత్తాచెదారంతో నిండిపోయి ఆటలకు అనుకూలంగా లేకుండా మారాయని స్థానికులు చెబుతున్నారు. యువత, చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన క్రీడా పరికరాలు కూడా భద్రత లేకపోవడంతో దొంగల పాలయ్యాయని ఆరోపించారు. మైదానాల దుస్థితిపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు.

తెలంగాణకే బిగ్ ఇన్సిపిరేషన్ ఈ విలేజ్!
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్ గ్రామం జిల్లాలోనే తొలి ‘బాల్యవివాహ రహిత గ్రామం’గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ ఊరిలో జీరో బాల్య వివాహాలు, 18 ఏళ్లలోపు బాలికల్లో జీరో ప్రెగ్నెన్సీస్, అలాగే జీరో స్కూల్ డ్రాప్‌అవుట్స్ సాధించి గ్రామం ఆదర్శంగా నిలిచింది. దీంతో తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మర్రిపల్లి చందన చేతుల మీదుగా అంకుసాపూర్‌కు ‘చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ సర్టిఫికేట్’ అందజేశారు. ఇతర గ్రామాలకు కూడా ఇది బిగ్ ఇన్సిపిరేషన్‌గా నిలుస్తోంది.

ఆఫర్ చూసి మోసపోకండి.. టాస్క్ ఫ్రాడ్‌పై అలర్ట్
AP: టాస్క్ పేరుతో వచ్చే ఆకర్షణీయమైన మెసేజ్‌లకు స్పందిస్తే క్షణాల్లో డబ్బులు కోల్పోయే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరించారు. ఎన్‌టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో టాస్క్ ఆధారిత సైబర్ మోసాలపై వారం రోజుల ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను ప్రారంభించారు. మైలవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని మార్సుమిల్లి గ్రామంలో సీఐ కిషోర్ బాబు ఆధ్వర్యంలో ప్రజలు, యువత, విద్యార్థులకు సైబర్ మోసాలపై అవగాహన కల్పించారు. గుర్తుతెలియని లింకులను క్లిక్ చేయవద్దని, అపరిచితులకు నగదు బదిలీ చేయవద్దని సూచించారు.

మాంసం వ్యర్థాలతో ప్రజారోగ్యంపై ఆందోళన
TG: జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ పరిధిలో మాంసం వ్యర్థాల సమస్య స్థానికులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఉప్పల గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఏర్పాటు చేసిన ప్రైవేట్ కంటైనర్‌లో మాంసం వ్యర్థాలను నిల్వ చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. వ్యర్థాలు కుళ్లిపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్రమైన దుర్వాసన వ్యాపిస్తోందని, అటుగా వెళ్లే ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బొలెరో ఢీకొని దంపతులు మృతి
AP: పల్నాడు జిల్లా వినుకొండ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. వెల్లటూరు రోడ్డులోని హనుమాన్ నగర్ వద్ద గురువారం తెల్లవారుజామున బైక్‌పై వెళ్తున్న దంపతులను వెనుక నుంచి వచ్చిన బొలెరో వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వల్లూరి రవి (58), ఆయన భార్య సావిత్రి (55) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. మిద్దెబావి కాలనీలోని కుమార్తె ఇంటి నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పదేళ్ల సేవలకు గుర్తింపు.. బీర గాంధీకి కీలక పదవి
AP: కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం లచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన బీర గాంధీకి అంబేడ్కర్స్ ఇండియా మిషన్‌లో కీలక బాధ్యత దక్కింది. సంస్థతో దాదాపు పదేళ్లుగా కొనసాగుతూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయాలు, సమానత్వం, సామాజిక న్యాయం కోసం పలు కార్యక్రమాల్లో చురుకుగా పనిచేసిన ఆయన సేవలను గుర్తించి సంస్థ వ్యవస్థాపకులు పీవీ సునీల్ కుమార్ రాష్ట్ర సలహా కమిటీ సభ్యుడిగా నియమించారు. ఈ సందర్భంగా బీర గాంధీకి పలువురు నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.

రైతులు అధైర్యపడొద్దు.. ప్రభుత్వం అండగా ఉంటుంది
TG: మక్తల్–నారాయణపేట్–కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని యూత్ కాంగ్రెస్ కొడంగల్ అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలం గోఖపసల్వాడ్ గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో ఆయన మాట్లాడారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు కోల్పోతున్న రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం తగిన పరిహారం అందించడంతో పాటు పునరావాస సౌకర్యాలు కూడా కల్పిస్తుందని చెప్పారు.

చీకట్లో పాముల భయం.. బస్తీ వాసుల అవస్థలు
TG: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ డివిజన్‌లోని హమీదుల్లా నగర్ బస్తీ మూడునెలలుగా వీధిదీపాలు లేక చీకట్లోనే ఉంటోంది. రాత్రివేళ రాకపోకలు సాగించేందుకు స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చుట్టుపక్కల వ్యవసాయ పొలాలు అధికంగా ఉండటంతో చీకటి వేళల్లో విషపురుగులు, పాముల సంచారం పెరిగి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వీధి దీపాల సమస్యను పలుమార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు పరిష్కారం కాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సామాజిక న్యాయం కోసం గ్రామాల్లో BSP యాత్ర
TG: సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం, సామాజిక న్యాయం వంటి విలువలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు BSP గ్రామస్థాయి ప్రచార యాత్రకు శ్రీకారం చుట్టింది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో బాబాసాహెబ్ అంబేడ్కర్, జ్యోతిరావు పూలే, గౌతమ బుద్ధుడు చూపిన మార్గాన్ని ప్రజలకు వివరించేందుకు గ్రామ గ్రామాన పర్యటించాలని నిర్ణయించారు. బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు గొల్ల సతీష్, నారాయణఖేడ్ నియోజకవర్గ అధ్యక్షుడు అనుముల తుకారాం ఆధ్వర్యంలో సిర్గాపూర్ మండలం వాసర్ గ్రామం నుంచి యాత్ర ప్రారంభమైంది.

మంత్రులకు సోషల్ మీడియా ఫేమ్ చెక్.. Gen Zపై ఫోకస్
సెంట్రల్ మినిస్టర్స్ సోషల్ మీడియా పనితీరుపై కేంద్రం రివ్యూ చేసింది. మే 1 నుంచి ఆగస్ట్ 15 వరకు X, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, లింక్డ్‌ఇన్‌లో మంత్రుల పోస్టులు, లైక్స్, ఎంగేజ్‌మెంట్, ఫాలోవర్ల వివరాలను విశ్లేషించారు. ఈ రిపోర్ట్స్‌ను మంత్రులకు ఇచ్చి, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో యాక్టివిటీని పెచుకోవాలని సూచించారు. సోషల్ మీడియా ద్వారా Gen Zతో మరింతగా కనెక్ట్ కావాలని ప్రధాని మోదీ చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సమీక్షకు ఇంపార్టెన్స్ ఏర్పడింది.

NET పరీక్షల రద్దుపై విద్యార్థుల బిగ్ ప్రొటెస్ట్
TG: UGC-NET పరీక్షల రద్దును నిరసిస్తూ హైదరాబాద్‌లో దిశా స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆందోళనకు పిలుపునిచ్చారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహణ తీరును తప్పుబడుతూ విద్యార్థులు నిరసన ప్రదర్శన చేపట్టనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. పరీక్షలను రద్దు చేయడం ఎన్‌టీఏ వైఫల్యానికి మరో నిదర్శనమని ఆరోపించారు. NTAను రద్దుచేసి, పరీక్షల నిర్వహణలో సమూల మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఇవాళ (ఆగస్టు 20న) మధ్యాహ్నం 3గంటలకు హైదరాబాద్‌లోని ధర్నాచౌక్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.

గాజా చిన్నారి కేసులో ట్విస్ట్.. తప్పు ఒప్పుకున్న ఆర్మీ!
గాజాలో 2024లో ఐదేళ్ల పాలస్తీనా బాలిక హింద్ రజబ్‌తో పాటు కుటుంబం ఉన్న కారుపై తామే ఫైరింగ్ జరిపినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ మొదటిసారి అధికారికంగా ఒప్పుకుంది. దాడి నుంచి బతికిన హింద్ రక్షణ కోసం రెడ్ క్రెసెంట్‌కు ఫోన్ చేసి వేడుకున్న ఆడియో రికార్డింగ్ గ్లోబల్‌గా వైరల్ అయింది. ఈ ఘటనతో పాటు ఆమెను రక్షించేందుకు వెళ్లిన అంబులెన్స్‌పై జరిగిన అటాక్‌పై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్‌కు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఆర్డర్స్ ఇచ్చింది. ఈ కన్నీటి కథ ఆధారంగా వచ్చిన ‘ది వాయిస్ ఆఫ్ హింద్ రజబ్’ మూవీ ఆస్కార్ రేసులో నిలిచింది.

దభోల్కర్ హత్యకు 13 ఏళ్లు.. నిరసనకు పిలుపు
TG: మూఢనమ్మకాల నిర్మూలన కోసం పోరాడిన <a href="https://www.theclearcutnews.com/n/aK7JuvZ">నరేంద్ర దభోల్కర్ </a>హత్యకు 13ఏళ్లు పూర్తైన సందర్భంగా తెలంగాణ మూఢనమ్మకాల నిర్మూలన చట్ట సాధన సమితి నిరసనకు పిలుపునిచ్చింది. దభోల్కర్ హత్యకేసులో స్థానిక కోర్టు నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించగా, హైకోర్టు విచారణ కొనసాగుతున్న సమయంలో మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం, శిక్షను నిలిపివేయడాన్ని తీవ్రంగా ఖండించింది. బెయిల్‌ను రద్దుచేసి కింది కోర్టు విధించిన శిక్షను కొనసాగించాలంది. దభోల్కర్ వర్ధంతి సభకు ముందు నల్ల దుస్తులు, నల్లజెండాలతో నిరసన చేపట్టాలని పిలుపునిచ్చింది.

ఉద్యోగుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి
TG: ఉద్యోగులు, ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీజీఈజేఏసీ వేంసూరు మండల నాయకులు డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా అడసర్లపాడు కాంప్లెక్స్‌లో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. రెండో వేతన సవరణ సంఘం అమలు చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను వెంటనే విడుదల చేయాలని కోరారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి త్వరితగతిన నిర్ణయాలు తీసుకోవాలని నాయకులు కోరారు.

బడుల్లో డ్రగ్స్‌కు చెక్.. మూడేళ్ల యాక్షన్ ప్లాన్ రెడీ!
TG: రాష్ట్రంలో స్టూడెంట్స్‌కు డ్రగ్స్, పొగాకు వంటి మత్తు ప్రొడక్ట్స్‌ను దూరంగా ఉంచేందుకు ప్రభుత్వం మూడేళ్ల యాక్షన్ ప్లాన్ అమలు చేయనుంది. స్కూల్స్ చుట్టూ 500 మీ. పరిధిని Drug Free Zoneగా ప్రకటించనున్నారు. డ్రగ్స్ అమ్మినా, వాడినా హెడ్‌మాస్టర్, నోడల్ టీచర్లు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలి. స్టూడెంట్స్‌కు అవేర్‌నెస్‌తో పాటు టీచర్లుకు ట్రైనింగ్, కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు. స్టేట్‌లో 42వేల గవర్నమెంట్, ఎయిడెడ్, ప్రైవేట్ వంటి స్కూళ్లు <a href="https://tofei.education.gov.in/">NMV</a> పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

అక్టోబర్‌కు ముందే సిద్ధం కావాలి.. కలెక్టర్ బిగ్ డెసిషన్
TG: ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు ముందే నిల్వ సామర్థ్యాన్ని సిద్ధం చేసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో జిల్లాలోని ప్రస్తుత నిల్వ పరిస్థితులు, గత మూడు సీజన్ల కస్టమ్ మిల్డ్ రైస్ బకాయిలపై చర్చించారు. అక్టోబర్ చివరి వారం నుంచి కొత్త ధాన్యం వచ్చే అవకాశం ఉన్నందున అప్పటిలోగా గోదాములు, ఖాళీ ప్రాంగణాలు సిద్ధం చేయాలని సూచించారు.