Latest

బడుల్లో డ్రగ్స్‌కు చెక్.. మూడేళ్ల యాక్షన్ ప్లాన్ రెడీ!
TG: రాష్ట్రంలో స్టూడెంట్స్‌కు డ్రగ్స్, పొగాకు వంటి మత్తు ప్రొడక్ట్స్‌ను దూరంగా ఉంచేందుకు ప్రభుత్వం మూడేళ్ల యాక్షన్ ప్లాన్ అమలు చేయనుంది. స్కూల్స్ చుట్టూ 500 మీ. పరిధిని Drug Free Zoneగా ప్రకటించనున్నారు. డ్రగ్స్ అమ్మినా, వాడినా హెడ్‌మాస్టర్, నోడల్ టీచర్లు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలి. స్టూడెంట్స్‌కు అవేర్‌నెస్‌తో పాటు టీచర్లుకు ట్రైనింగ్, కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు. స్టేట్‌లో 42వేల గవర్నమెంట్, ఎయిడెడ్, ప్రైవేట్ వంటి స్కూళ్లు <a href="https://tofei.education.gov.in/">NMV</a> పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.

అక్టోబర్‌కు ముందే సిద్ధం కావాలి.. కలెక్టర్ బిగ్ డెసిషన్
TG: ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు ముందే నిల్వ సామర్థ్యాన్ని సిద్ధం చేసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో జిల్లాలోని ప్రస్తుత నిల్వ పరిస్థితులు, గత మూడు సీజన్ల కస్టమ్ మిల్డ్ రైస్ బకాయిలపై చర్చించారు. అక్టోబర్ చివరి వారం నుంచి కొత్త ధాన్యం వచ్చే అవకాశం ఉన్నందున అప్పటిలోగా గోదాములు, ఖాళీ ప్రాంగణాలు సిద్ధం చేయాలని సూచించారు.

గోల్డ్ షాపింగ్ ప్లాన్ చేస్తున్నారా? ఈ రేట్స్ చూడండి!
అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల వల్ల గురువారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. గుడ్ రిటర్న్స్ లైవ్ డేటా ప్రకారం హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,54,960గా ఉండగా, 22 క్యారెట్ల ఆర్నమెంటల్ గోల్డ్ ప్రైస్ రూ.1,42,040గా నమోదైంది. అలాగే సిల్వర్ రేట్ కూడా కిలోకు రూ.100 తగ్గి ప్రస్తుతం రూ.2,49,900 వద్ద ట్రేడ్ అవుతోంది. కాబట్టి బంగారం ప్రియులు గోల్డ్ షాపింగ్ చేసే ముందు లేటెస్ట్ రేట్స్‌ను చెక్ చేసుకోవడం బెటర్.
ఆర్లికే బ్రిడ్జ్‌పై ప్రాణభయం.. వాహనదారుల ఆందోళన
TG: నిర్మల్ జిల్లాలోని ఆర్లికే బ్రిడ్జ్ వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. లోకేశ్వరం మండలంలోని ఈ వంతెన శిథిలావస్థకు చేరడంతో ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రాకపోకలు సాగిస్తున్నారు. వంతెనకు ఉన్న రెయిలింగ్‌లు ధ్వంసమై పడిపోవడంతో పాటు ఇరువైపులా రక్షణ గోడలు లేకపోవడం ప్రమాదాన్ని మరింత పెంచుతోంది. రాత్రివేళ పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉంటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంతెన దుస్థితిపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదన్నారు.
పోచారం శ్రీనివాస్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి
TG: బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు నిరసనకు దిగారు. నిజామాబాద్ జిల్లా దుబ్బలో నిర్వహించిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం వద్ద ఏనుగు రవీందర్‌రెడ్డి వర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టారు. ‘పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాకొద్దు’ అంటూ నినాదాలు చేశారు. బాన్సువాడలో పోచారం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల సీనియర్ కాంగ్రెస్ నాయకులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.

కెన్యాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం.. ఏడు మంది మృతి
నార్త్ కెన్యాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. సాంబురు కౌంటీలోని Mount Ololokwe వద్ద హెలికాప్టర్ క్రాష్ అవ్వడంతో ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు అమెరికన్లు, ఈక్వెడార్ నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ హెడ్ మిచెల్ సెన్సి-కాంటూగి, ఆయన భార్య స్టెఫనీ ఉన్నారు. మారుమూల ప్రాంతం కావడంతో రెస్క్యూ ఆపరేషన్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రమాదానికి కారణాలపై కెన్యా ఏవియేషన్ అధికారులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు.

దభోల్కర్ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం
TG: మూఢనమ్మకాలను ప్రశ్నిస్తూ వైజ్ఞానిక దృక్పథం కోసం జీవితాంతం పోరాడిన డా. నరేంద్ర దభోల్కర్‌ను స్మరించుకుంటూ ఇవాళ (ఆగస్టు 20న) హైదరాబాద్‌లో నేషనల్ సైంటిఫిక్ టెంపర్ డేను నిర్వహించనున్నారు. దభోల్కర్ వర్ధంతి సందర్భంగా మూఢనమ్మకాలను తిరస్కరించి, విజ్ఞానాన్ని స్వీకరించాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ప్రశ్నించడం, హేతుబద్ధంగా ఆలోచించడం, ఆధారాలను పరిశీలించడం వంటి శాస్త్రీయ విలువలను ప్రజల్లో పెంపొందించాల్సిన అవసరాన్ని వివరించనున్నారు. బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కార్యక్రమం జరగనుంది.

ఓటర్ల వివరాలను సమగ్రంగా పరిశీలించాలి
TG: నిర్మల్ జిల్లాలో ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన SIR ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పూర్తి చేయాలని కలెక్టర్ భవిష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రతి అంశాన్ని సమగ్రంగా ధ్రువీకరించాలని సూచించారు. ఎస్‌ఐఆర్‌లో భాగంగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఇంకా మ్యాపింగ్ కాని ఓటర్ల వివరాలను ప్రత్యేకంగా పరిశీలించాలని తెలిపారు. నిర్ణీత కార్యాచరణ ప్రణాళిక ప్రకారం ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు, ఓటర్ల వివరాల్లో తప్పిదాలు జరగకుండా చూడాలన్నారు.

AIకి ప్రభుత్వం సేఫ్టీ టెస్టులు పెట్టబోతోందా?
AI ఎంత శక్తివంతంగా మారితే.. దాన్ని పరీక్షించే విధానం కూడా అంతే గట్టిగా ఉండాలి కదా? 🤖 అమెరికా ప్రభుత్వం శక్తివంతమైన AI మోడళ్లకు భద్రతా పరీక్షల విధానాన్ని సిద్ధం చేసింది. ముఖ్యంగా సైబర్ దాడులకు ఈ మోడళ్లు ఎంతవరకు ఉపయోగపడగలవో పరీక్షించడంపై దృష్టి ఉంది. OpenAI, Anthropic, Google, Meta వంటి సంస్థలతో అధికారులు దీనిపై చర్చించారు. ఇటీవల కొన్ని AI ఏజెంట్లు పరీక్షల్లో అనుమతి లేని సైబర్ చర్యలకు వెళ్లడంతో ఆందోళన పెరిగింది. అది ఎంతవరకు వెళ్లగలదో ముందే తెలుసుకుని, ప్రమాదం రాకముందే రక్షణ పెట్టడమే అసలు లక్ష్యం.

మనిషికంటే వేగంగా పరిగెత్తే రోబోట్! 🤖
రోబోట్ పరుగెత్తడం చూశాం.. కానీ ఇది చూసిన తర్వాత ఒక్క ప్రశ్న వస్తుంది: మనిషికంటే వేగంగా రోబోట్ ఎలా పరిగెడుతోంది? చైనాకు చెందిన Unitree రూపొందించిన ‘Superman’ అనే హ్యూమనాయిడ్ రోబోట్ సెకనుకు 12.66 మీటర్ల వేగంతో పరుగెత్తగలదని సంస్థ చెబుతోంది. అంతేకాదు, రెండు మీటర్ల ఎత్తు దూకగలదట. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే.. ఈ రోబోట్‌ను మూడు నెలల్లోనే అభివృద్ధి చేశామని కంపెనీ చెబుతోంది. అయితే ఈ వేగం నిజ జీవితంలో ఎంతవరకు ఉపయోగపడుతుంది? మనుషుల మధ్య సురక్షితంగా పనిచేయగలదా? అసలు పరీక్ష ఇక్కడే మొదలవుతుంది.

డిమాండ్లు పరిష్కరించకపోతే ఉద్యమం తప్పదు
తెలంగాణ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యుత్ ఉద్యోగ సంఘాల ఐకాస డిమాండ్ చేసింది. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోవడంతో హైదరాబాద్‌లోని ఛలో విద్యుత్ సౌధ పేరుతో మహాధర్నా నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన ఉద్యోగులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. వేతన సవరణ కమిటీ ఏర్పాటు, ఖాళీ పోస్టుల భర్తీ, ఆర్టిజన్లకు క్యాడర్, సీనియారిటీ, ప్రమోషన్లు, సర్వీస్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు.

AI మోడళ్లు సైబర్ దాడులు చేయగలిగితే…?
AIకి ఒక సమస్యను చెప్పి పరిష్కారం అడగడం వేరు… అదే AI ఒక సిస్టమ్‌లోని బలహీనతను గుర్తించి దానిపై దాడి చేయడం వేరు. తాజా భద్రతా పరీక్షల్లో కొన్ని శక్తివంతమైన AI ఏజెంట్లు మనుషుల సహాయం లేకుండా లోపాలు వెతకడం, సిస్టమ్‌ల్లోకి వెళ్లే ప్రయత్నాలు చేయడం కనిపించింది. కొన్ని పరీక్షల్లో నిజమైన నష్టం జరగలేదు. కానీ మోడళ్లకు ఎక్కువ స్వేచ్ఛ, ఇంటర్నెట్ యాక్సెస్, టూల్స్ ఇస్తున్న కొద్దీ రిస్క్ పెరుగుతుంది. మనం AIని రోజువారీ పనుల్లోకి ఎంత ఎక్కువగా తీసుకొస్తామో… దాని భద్రత కూడా అంతే ముఖ్యమవుతుంది.

పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయాలి: హరీశ్‌రావు
TG: 22ఏ భూముల వ్యవహారంపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆరోపణలు చేశారు. సెటిల్మెంట్లు, కమీషన్ల కోసమే ప్రైవేట్ భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారని ఆరోపించారు. బాధితులకు అండగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో BRS లీగల్ సెల్ ఏర్పాటు చేసి, 10మంది న్యాయవాదులతో ఉచిత న్యాయసాయం అందిస్తామని ప్రకటించారు. తెలంగాణ భవన్‌లో 22ఏ నిషేధిత భూములతో నష్టపోయిన బాధితులతో ఆయన మాట్లాడారు. ఆంక్షలతో లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నారని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని క్యాబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

అర్ధరాత్రి ఘోర విషాదం
TG: సిద్దిపేట జిల్లాలో అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. దుబ్బాక మండలం అప్పనపల్లి శివారులో అదుపుతప్పిన కారు రహదారి పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లడంతో దంపతులు, ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. బల్వంతాపూర్‌కు చెందిన దండుగుల రాజు(30), అతని భార్య భాగ్య(25), కుమారుడు నిహాల్ష్(4), కుమార్తె శాన్విక(2) సిద్దిపేట నుంచి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

విద్యా వ్యవస్థ మార్చాల్సిందే: నేహా బోరా
AP: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావని AISA జాతీయ అధ్యక్షురాలు, జెన్ జీ ఉద్యమ నేత నేహా బోరా అన్నారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీట్ ది ప్రెస్‌లో ఆమె మాట్లాడారు. దేశ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నీట్ పేపర్ లీక్, పరీక్ష రద్దు వ్యవహారాల్లో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. ఢిల్లీలో నిరాహార దీక్ష సందర్భంగా తమను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.

మారిన నేరాలకు తగ్గట్టుగా భారీ మార్పులు: DGP
TG: మారుతున్న నేరాల తీరుకు అనుగుణంగా పోలీస్ శాఖలో కీలక మార్పులు చేపడుతున్నట్లు DGP CV ఆనంద్ తెలిపారు. హైదరాబాద్‌లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. గతంలో తీవ్రవాదం, ఉగ్రవాదం ప్రధాన సవాళ్లుగా ఉండగా, ఇప్పుడు డ్రగ్స్, సైబర్‌నేరాలు, ఆన్‌లైన్ బెట్టింగ్, పెట్టుబడి మోసాలు, ట్రాఫిక్, ఆహార కల్తీ, రోడ్డు ప్రమాదాలు కొత్త సమస్యలుగా మారాయని తెలిపారు. వీటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు గ్రేహౌండ్స్, ఆక్టోపస్, ఎస్ఐఐబీ వంటి విభాగాల నుంచి 513మంది సిబ్బందిని 8విభాగాలకు కేటాయించినట్లు చెప్పారు.

రికార్డులను పరిశీలించిన తర్వాతే నిర్ణయం: పొంగులేటి
TG: రాష్ట్రంలోని 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న భూముల సమస్యలను ఫాస్ట్‌ట్రాక్ విధానంలో పరిష్కరిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి రిజిస్ట్రేషన్ల విషయంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. ప్రైవేట్ భూములకు సంబంధించి ప్రస్తుత పరిస్థితి, హక్కుదారుల పత్రాలు, గత రిజిస్ట్రేషన్లు, రికార్డులను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలన్నారు.

వెలిగొండ నిర్వాసితులకు భారీ పరిహారం
AP: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి భరోసా కల్పించింది. ప్రాజెక్టు తొలి దశ ప్రారంభోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో రూ.200 కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. అసెంబ్లీ ప్రాంగణంలో CM చంద్రబాబు నాయుడు నిర్వాసిత కుటుంబాలకు చెక్కులు అందజేశారు. ఇప్పటికే జూన్ 27న రూ.318 కోట్లు అందించగా, తాజాగా విడుదల చేసిన మొత్తంతో కలిపి ఇప్పటివరకు రూ.518 కోట్ల పరిహారం అందినట్లైంది. మిగిలిన పరిహారాన్ని కూడా త్వరలో అందిస్తామని CM హామీ ఇచ్చారు.

‘Brain Rot’ అంటే తెలుసా?
ఒక్క రీల్ చూద్దామని ఫోన్ తీస్తాం.. చూస్తే గంట గడిచిపోతుంది! 📱 ఇలాంటి లో-క్వాలిటీ, రిపీటెడ్ ఆన్‌లైన్ కంటెంట్‌ను ఎక్కువగా చూడటం వల్ల మన ఆలోచనా సామర్థ్యం లేదా మెంటల్ స్టేట్ దెబ్బతింటోందనే భావనను ‘బ్రెయిన్ రాట్’ అంటారు. ఇది మెడికల్ డయాగ్నోసిస్ కాదు.. ఇంటర్నెట్‌లో పాపులర్ అయిన పదం మాత్రమే. ఈ పదం ఎంత ట్రెండ్ అయిందంటే Oxford Word of the Year 2024గా కూడా ఎంపికైంది. కంటెంట్ చూస్తున్నామా.. లేక స్క్రోలింగ్‌కే అలవాటు పడిపోయామా అనేది అప్పుడప్పుడు చెక్ చేసుకోవడం బెటర్!

9-to-5 job వదిలేసింది.. ఇప్పుడు తనే బాస్! 🏠
ఉద్యోగం ఉంది.. జీతం ఉంది.. అయినా ఒక అమ్మ తన 9–5 జీవితాన్ని వదిలేసింది. కారణం డబ్బు కాదు.. తన పిల్లతో ఎక్కువ సమయం గడపాలనుకోవడమే. 😮 2023లో స్నిగ్ధా ఉద్యోగం మానేసి, హోమ్‌స్టే మొదలుపెట్టారు. మొదట భయం ఉన్నా, క్రమంగా వ్యాపారం నిలదొక్కుకుంది. ఢిల్లీలోని కొన్ని ఇళ్లను అద్దెకు ఇస్తూ, ఇప్పుడు తన స్వల్పకాలిక అద్దె వ్యాపారం ద్వారా ₹21 లక్షల ఆదాయం వస్తోందని ఆమె చెబుతున్నారు. ఉద్యోగం వదిలిన నిర్ణయం తనకు ఎక్కువ సమయం, స్వేచ్ఛ, పిల్లతో గడిపే విలువైన క్షణాలను ఇచ్చిందని స్నిగ్ధా చెబుతున్నారు.

OpenAI AI trainingను ఎందుకు స్లో చేసింది?
AI వేగం పెంచాల్సిన సమయంలో OpenAI ఒక్కసారిగా బ్రేక్ వేసింది. హగ్గింగ్ ఫేస్‌పై ఒక AI మోడల్ చేసిన సైబర్ దాడి తర్వాత, కంపెనీ తన కొన్ని అత్యంత శక్తివంతమైన మోడళ్ల ట్రైనింగ్‌ను నెమ్మదించింది. దాదాపు రెండు వారాల రీఫోర్స్‌మెంట్ లెర్నింగ్ ట్రైనింగ్‌ను ఆపడంతో పాటు, ప్లాన్ చేసిన అతిపెద్ద ఫ్రంటియర్ ట్రైనింగ్ రన్‌ను కూడా నిలిపింది. కారణం మోడల్ ఎంత శక్తివంతంగా మారుతుందో అంతే స్థాయిలో అది ఏం చేయగలదో ముందే పరీక్షించాల్సిన అవసరం పెరగడం