Latest

9-to-5 job వదిలేసింది.. ఇప్పుడు తనే బాస్! 🏠
ఉద్యోగం ఉంది.. జీతం ఉంది.. అయినా ఒక అమ్మ తన 9–5 జీవితాన్ని వదిలేసింది. కారణం డబ్బు కాదు.. తన పిల్లతో ఎక్కువ సమయం గడపాలనుకోవడమే. 😮 2023లో స్నిగ్ధా ఉద్యోగం మానేసి, హోమ్‌స్టే మొదలుపెట్టారు. మొదట భయం ఉన్నా, క్రమంగా వ్యాపారం నిలదొక్కుకుంది. ఢిల్లీలోని కొన్ని ఇళ్లను అద్దెకు ఇస్తూ, ఇప్పుడు తన స్వల్పకాలిక అద్దె వ్యాపారం ద్వారా ₹21 లక్షల ఆదాయం వస్తోందని ఆమె చెబుతున్నారు. ఉద్యోగం వదిలిన నిర్ణయం తనకు ఎక్కువ సమయం, స్వేచ్ఛ, పిల్లతో గడిపే విలువైన క్షణాలను ఇచ్చిందని స్నిగ్ధా చెబుతున్నారు.

OpenAI AI trainingను ఎందుకు స్లో చేసింది?
AI వేగం పెంచాల్సిన సమయంలో OpenAI ఒక్కసారిగా బ్రేక్ వేసింది. హగ్గింగ్ ఫేస్‌పై ఒక AI మోడల్ చేసిన సైబర్ దాడి తర్వాత, కంపెనీ తన కొన్ని అత్యంత శక్తివంతమైన మోడళ్ల ట్రైనింగ్‌ను నెమ్మదించింది. దాదాపు రెండు వారాల రీఫోర్స్‌మెంట్ లెర్నింగ్ ట్రైనింగ్‌ను ఆపడంతో పాటు, ప్లాన్ చేసిన అతిపెద్ద ఫ్రంటియర్ ట్రైనింగ్ రన్‌ను కూడా నిలిపింది. కారణం మోడల్ ఎంత శక్తివంతంగా మారుతుందో అంతే స్థాయిలో అది ఏం చేయగలదో ముందే పరీక్షించాల్సిన అవసరం పెరగడం

ఉప్పు అనుకుని డిటర్జెంట్ వేశారు… 36 మంది పిల్లలు అస్వస్థత
స్కూల్‌లో మధ్యాహ్న భోజనం తిన్న పిల్లలకు ఒక్కసారిగా వాంతులు, తల తిరగడం మొదలయ్యాయి. బిహార్‌లోని నలందా జిల్లాలోని పరాసి ప్రభుత్వ పాఠశాలలో కనీసం 36 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. భోజనంలో ఉప్పు తక్కువగా ఉందని కొందరు చెప్పడంతో, వంటమనిషి ఉప్పు అనుకుని డిటర్జెంట్ పౌడర్ కలిపినట్లు స్థానికులు చెబుతున్నారు. వంటగదిలో ఉప్పు, డిటర్జెంట్ డబ్బాలు ఒకే చోట ఉండటమే ఈ పొరపాటుకు కారణమై ఉండొచ్చని సమాచారం. పిల్లలను ఆసుపత్రికి తరలించగా, అందరూ ప్రమాదం నుంచి బయటపడ్డారని అధికారులు తెలిపారు.

ఎస్‌ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలి
TG: ఎస్‌ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి సూచించారు. జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో డ్రాఫ్ట్ ఓటరు జాబితాపై క్లెయిమ్స్, అభ్యంతరాలను నిర్ణీత గడువులో పరిష్కరించాలని ఆదేశించారు. మ్యాపింగ్ కాని, అనామలీస్ గుర్తించిన ఓటర్లకు నోటీసులు జారీ చేసి వివరణకు అవకాశం కల్పించాలని తెలిపారు.

చాలీచాలని పెన్షన్‌తో అవస్థలు
AP: విశాఖపట్నం కలెక్టర్ వద్ద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పెన్షనర్స్, ఈపీఎస్ 95 పెన్షనర్స్ ధర్నా నిర్వహించారు. ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో పాల్గొన్న సభ్యులు తాము పడుతున్న అవస్థలు వివరించారు. Eps 95 పెన్షనర్స్ అతి తక్కువ పెన్షన్‌తో జీవితాలు గడుపుతున్నామని వివరించారు. పదవి విరమణ చేసిన సీనియర్ సిటిజన్స్ నెలకి వెయ్యి రూపాయలతో జీవనం గడుపుతున్నామని వివరించారు. జిల్లా డిప్యూటీ కలెక్టర్ విశ్వేశ్వర నాయుడుకు మెమొరండం సమర్పించారు
వ్యాధితో బాధపడుతున్న బాలికకు హీరో రామ్ చేయూత
AP: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడికి చెందిన శశిభవ్యత అరుదైన జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. తనకు సినీ హీరో రామ్ పోతినేని వీడియో కాల్ చేసి మాట్లాడారు. తనకు ధైర్యం చెప్పారు. బాధితురాలి వైద్యం, భోజనం, ఇతర ఖర్చులన్నీ తనే భరిస్తానని హామీ ఇచ్చారు. హీరో స్పందించడంపై బాలిక తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.

మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం
TG: నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో పదో తరగతి వరకు కలిసి చదువుకున్న తమ మిత్రుడు బోజారాం అనారోగ్యంతో మృతి చెందడంతో స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతుని భార్య విజయలక్ష్మిని పరామర్శించి, పిల్లలు హర్షిత్(11), హర్షిత(8) బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో రూ.51 వేల సహాయాన్ని అందించారు. భవిష్యత్తులోనూ అవసరమైన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు

అసెంబ్లీ సందర్శనకు కనిగిరి ZPHS విద్యార్థులు
AP: AP అసెంబ్లీ సందర్శనకు కోసం మార్కాపురం జిల్లా కనిగిరి ZPHS గర్ల్స్ హైస్కూల్ విద్యార్థులు అమరావతికి వచ్చారు. స్పీకర్ శ్రీ అయ్యన్నపాత్రుడు అసెంబ్లీ ఆవరణలో విద్యార్థులతో మాట్లాడి వారిని ఉత్సాహపరిచారు. వారికి అసెంబ్లీ గురించి వివరించారు. అనంతరం వారితో ఫొటో దిగారు.

చినతీనార్లలో ఘనంగా సరస్వతి విగ్రహావిష్కరణ
AP: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చినతీనార్ల గ్రామంలో అరుణ ఎడ్యుకేషనల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సరస్వతి దేవి విగ్రహాన్ని ఎంపీడీవో కె చలపతిరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల స్థాయి క్విజ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తున్న ట్రస్టు సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో రిటైర్డ్ హెచ్‌ఎం బి. సింహాచలం, పంచాయతీ సెక్రెటరీ చిన్నమనాయుడు, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

TOSS ప్రవేశాలపై పోస్టర్ ఆవిష్కరణ
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓపెన్ SSC, ఇంటర్మీడియట్ ప్రవేశాలపై రూపొందించిన ప్రచార పోస్టర్‌ను మెదక్ జిల్లా విద్యాశాఖాధికారి ఎస్. రాజు ఆవిష్కరించారు. జిల్లా కోఆర్డినేటర్ ఎ. వరప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కరుణాకర్, డీఈఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. చదువును మధ్యలో నిలిపివేసిన వారు, ఉద్యోగులు, గృహిణులు, రెగ్యులర్ విద్య కొనసాగించలేని వారికి TOSS మంచి ప్రత్యామ్నాయమని తెలిపారు.

ట్రిపుల్‌ఆర్ భూసేకరణ వేగవంతం చేయాలి
TG: ట్రిపుల్‌ఆర్ భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నేషనల్ హైవేస్, రైల్వే, రెవెన్యూ అధికారులు, ఆర్డీవోలు, తహసీల్దార్లతో భూసేకరణపై సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా భూసేకరణ వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అవార్డు పాసైన భూముల వివరాలను సంబంధిత పోర్టల్‌లో నమోదు చేసి, రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

విభజన హామీల పరిష్కారానికి కేంద్రానికి చంద్రబాబు వినతులు
AP: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని పెండింగ్ అంశాల పరిష్కారంతోపాటు రాష్ట్ర కీలక మౌలిక ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కోరేందుకు సీఎం చంద్రబాబు నాయుడు సిద్ధమయ్యారు. మహాబలిపురంలో అమిత్ షా అధ్యక్షతన జరిగే 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాలను ప్రస్తావించనున్నారు. షెడ్యూల్ 9, 10 సంస్థల విభజన, ఆస్తులు–అప్పులు, రెవెన్యూ గ్యాప్, పన్ను సమస్యల పరిష్కారంతో పాటు దుగరాజుపట్నం పోర్టు, విశాఖ–విజయవాడ మెట్రో, రైల్వే కనెక్టివిటీ, పారిశ్రామిక కారిడార్లకు కేంద్ర సహకారం కోరనున్నారు.
కొండపల్లిలో ఉద్రిక్త పరిస్థితి
AP: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. మహిళలు రైల్వే ఓవర్ బ్రిడ్జి పనుల నిమిత్తం ఇల్లు కూల్చివేస్తున్న సమయంలో నిర్వాసితులు అధికారులను అడ్డుకున్నారు. ఆ టైంలో ఓ మహిళా ఒంటిపై డీజిల్ పోసుకోవడంతో అక్కడివారు అడ్డుకున్నారు. డీజిల్ పోసుకున్న మహిళను ఆస్పత్రికి తరలించారు. తమకు న్యాయం చేసేవరకు ఇల్లు కూల్చివేతలను అడ్డుకుంటామని నిర్వాసితులు హెచ్చరించారు.
SHAKTHI పాలసీని ఉపసంహరించుకోవాలని SFI ధర్నా
TG: మహబూబ్‌నగర్‌లో SFI ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కాలేజీ ఎదుట దాదాపు 200 మంది విద్యార్థులు ధర్నా నిర్వహించారు. జీవో నెంబర్ 97ను, SHAKTHI పాలసీని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. SBTETని కొనసాగించాలని కోరారు. కార్యక్రమంలో. పట్టణ కార్యదర్శి ఈశ్వర్. డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రశాంత్, విద్యార్థులు పాల్గొన్నారు

యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
AP: కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర సమితి విమర్శించింది. రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా పల్నాడు జిల్లా వినుకొండ తహసీల్దార్ కార్యాలయంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గ కార్యదర్శి మరీబాబు మాట్లాడుతూ అత్యధిక యువజన జనాభా కలిగిన భారతదేశంలో ]నిరుద్యోగం, అస్థిర ఉపాధి, వలసలు పెరుగుతున్నాయని అన్నారు. ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ నెరవేరలేదని ఆరోపించారు.

ఎస్సీ, ఎస్టీ హాస్టల్ బాలురకు బ్లాంకెట్ల పంపిణీ
TG: మెదక్ జిల్లా శంకరంపేటలోని ఎస్సీ, ఎస్టీ హాస్టల్‌లోని స్టూడెంట్స్‌కు సానీక్ష ఫౌండేషన్ ఆధ్వర్యంలో అహిల్య ఉమెన్ ఫౌండేషన్ సహకారంతో బ్లాంకెట్లు పంపిణీ చేశారు. ఎంపీడీఓ దామోదర్ మాట్లాడుతూ విద్యార్థుల అవసరాలను గుర్తించి సేవా కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎంఆర్ఓ, ఎంఈఓ, ఎస్ఐ, సర్పంచ్, వార్డు సభ్యులు, అహిల్య ఉమెన్ ఫౌండేషన్ అధ్యక్షురాలు డా. పూనమ్ నోముల్వార్, సానీక్ష ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. డి.శివ పాల్గొన్నారు. దాతలకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

పోయిన 102 మొబైల్ ఫోన్లు అప్పగింత
TG: జగిత్యాల జిల్లాలో పోగొట్టుకున్న, చోరీకి గురైన 102 మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేసి అందజేశారు. వీటి విలువ సుమారు రూ.21 లక్షలు ఉంటుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. మొబైల్ పోయినా, చోరీకి గురైనా CEIR పోర్టల్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. CEIR ప్రారంభమైనప్పటి నుంచి జిల్లాలో 2,024 మొబైల్ ఫోన్లు, సుమారు రూ.4.5 కోట్ల విలువైన ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందించినట్లు తెలిపారు. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, మోసానికి గురైతే వెంటనే 1930కు ఫోన్ చేయాలని సూచించారు.

కల్లుగీత కార్మికుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట
TG: కల్లుగీత కార్మికుల సంక్షేమం, భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలో నియోజకవర్గంలోని 250 మంది కల్లుగీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచం సేఫ్టీ కిట్లను పంపిణీ చేశారు. తాటి చెట్లు ఎక్కే సమయంలో ప్రమాదాల నుంచి కార్మికులను రక్షించడంతోపాటు వారి కుటుంబాలకు భరోసా కల్పించడమే ఈ సేఫ్టీ కిట్ల ఉద్దేశమని తెలిపారు.

ఫీజు బకాయిల కోసం బీజేపీ పోరుబాట
TG: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు గత ఏడాది నుండి రీయింబర్స్‌మెంట్ ఇవ్వకుండా వాళ్ల జీవితాలను ఇరకాటంలో పడేసిందని బీజేపీ నేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. షాద్‌నగర్ చౌరస్తాలో విద్యార్థులతో కలిసి నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.

వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితులకు 200 కోట్లు విడుదల
AP: వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూములు, ఇళ్లు కోల్పోయి త్యాగాలు చేసిన నిర్వాసిత కుటుంబాలకు మరో రూ.200 కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం అందించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు శాసనసభ ఆవరణలో నిర్వాసిత కుటుంబాలకు రూ.200 కోట్ల చెక్కును అందజేశారు. ఇప్పటివరకూ వెలిగొండ నిర్వాసిత కుటుంబాలకు ప్రభుత్వం రూ.518 కోట్లను పరిహారంగా అందించింది.

రేపు వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా
AP: రేపు (ఈనెల 20న) వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాకు వందలాదిమంది నిరుద్యోగులు తరలిరావాలని సీపీఎం నాయకులు పిలుపునిచ్చారు. సిపిఎం మదనపురం మండల కార్యదర్శి వెంకటరములు మాట్లాడుతూ దేశంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మాటిచ్చిన కేంద్రం రెండేళ్లయినా ఇంకా ఆ హామీ నెరవేర్చలేదని అన్నారు. దేశంలో నిరుద్యోగులు ప్రతి సంవత్సరము పెరిగిపోతున్నారన్నారు.