Latest

అసెంబ్లీ బహిష్కరణను నా జీవితంలో చూడలేదు: చంద్రబాబు
AP· 19 Aug 2026

అసెంబ్లీ బహిష్కరణను నా జీవితంలో చూడలేదు: చంద్రబాబు

AP: అసెంబ్లీని ఓ పార్టీ మొత్తం బహిష్కరించడం తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదని సీఎం చంద్రబాబు అన్నారు. సభలో ప్రజా సమస్యలపై చర్చిస్తే వాటికి విలువ, గుర్తింపు ఉంటుందన్నారు. బయట కూర్చొని ఎంత మాట్లాడినా ప్రయోజనం ఉండదన్నారు. గ్రూప్-1 అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే సభకు రాకుండా డీఎస్సీపై వైసీపీ బురద జల్లుతోందని ఆరోపించారు.

మహనీయుల ఆశయ సాధనకు గ్రామగ్రామాన యాత్ర
Local· 19 Aug 2026

మహనీయుల ఆశయ సాధనకు గ్రామగ్రామాన యాత్ర

TG: బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, గౌతమ బుద్ధుడు చూపిన సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం, సామాజిక న్యాయం ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో గ్రామ గ్రామాన యాత్రకు శ్రీకారం చుట్టారు. బీఎస్పీ జిల్లా అధ్యక్షులు గొల్ల సతీష్, నారాయణఖేడ్ నియోజకవర్గ అధ్యక్షుడు అనుముల తుకారం ఆధ్వర్యంలో సిర్గాపూర్ మండలం వాసర్ గ్రామం నుంచి గ్రామ యాత్ర ప్రారంభమైంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ప్రజలకు వివరించి వాళ్లను చైతన్యపరచడమే ఈ యాత్ర ప్రధాన లక్ష్యమని నాయకులు తెలిపారు.

ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం.. ఇద్దరి అరెస్ట్
Local· 19 Aug 2026

ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం.. ఇద్దరి అరెస్ట్

AP: కడప జిల్లా పులివెందుల ప్రజల్ని ఉద్యోగాల పేరుతో మోసం చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. 2019లో ఇన్ఫోసిస్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని వెన్నపూస మల్లికార్జున రెడ్డిని, 2023లో రైల్వే శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని ఇస్లావత్ జనార్దన్ నాయక్‌ని నమ్మించి డబ్బులు వసూలు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు విశాఖపట్నానికి చెందిన నామల జన‌ప్రకాష్ రావు, తిరుపతి జిల్లాకు చెందిన కృష్ణయ్య మహేష్‌లను అరెస్టు చేశారు. రూ.8 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.

కామారెడ్డి జూనియర్ కళాశాలలో సమస్యలు పరిష్కరించాలి
Local· 19 Aug 2026

కామారెడ్డి జూనియర్ కళాశాలలో సమస్యలు పరిష్కరించాలి

TG: కామారెడ్డి జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అదనపు తరగతి గదులను నిర్మించాలని, కళాశాలలో సమస్యలను పరిష్కరించాలని మౌలిక సదుపాయలను కల్పించాలని AISA, SFI ,విద్యార్థి సేన, GVS విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీకి వినతిపత్రం అందించారు. విద్యార్థులకు అనుగుణంగా గదులు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో SFI జిల్లా కార్యదర్శి అరుణ్ కుమార్, AISA జిల్లా కన్వీనర్ విట్ఠల్, విద్యార్థిసేన జిల్లా అధ్యక్షుడు వినయ్, GVS జిల్లా అధ్యక్షులు వినోద్ పాల్గొన్నారు.

Gen Z..ప్రపంచ రాజకీయాలను మార్చే శక్తి :మాజీ ఎమ్మెల్సీ
AP· 19 Aug 2026

Gen Z..ప్రపంచ రాజకీయాలను మార్చే శక్తి :మాజీ ఎమ్మెల్సీ

AP: నేపాల్‌, బంగ్లాదేశ్‌ వంటి దేశాలతోపాటు తమిళనాడులో ప్రభుత్వాల మార్పులోనూ Gen Z కీలకపాత్ర పోషించిందని మాజీ ఎమ్మెల్సీ, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కె.ఎస్‌.లక్ష్మణరావు అన్నారు. గుంటూరు నగరం బ్రాడీపేటలో జరిగిన ‘Gen Z ఉద్యమంపై విశ్లేషణ’ చర్చాగోష్టిలో ఆయన మాట్లాడారు. 1997–2012 మధ్య జన్మించిన యువతను Gen Z గా పిలుస్తారని తెలిపారు. స్వేచ్ఛగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, వేగంగా ఫలితాల కోసం పోరాడటం వారి ప్రత్యేకత అన్నారు. భవిష్యత్తులో ప్రపంచ రాజకీయాలను మార్చగల శక్తి యువతకే ఉందని పేర్కొన్నారు.

యూనియన్ బ్యాంక్‌కు రూ.24 కోట్ల టోకరా
Crime· 19 Aug 2026

యూనియన్ బ్యాంక్‌కు రూ.24 కోట్ల టోకరా

AP: ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం ముచ్చనపల్లి గ్రామంలో ‘ఓంకార విజయలక్ష్మి స్ట్రైప్స్’ కంపెనీ తప్పుడు సమాచారంతో విజయవాడ యూనియన్ బ్యాంక్‌కు రూ.24 కోట్లు మోసం చేసింది. బ్యాంక్ లోన్ వచ్చాక ఆరు నెలల్లో కంపెనీలోని ఇద్దరు డైరెక్టర్లు రాజీనామా చేశారు. విజయవాడ యూనియన్ బ్యాంక్ ఏజీఏం సీబీఐకి ఫిర్యాదు చేశారు. కంపెనీ డైరెక్టర్లు, బ్యాంక్ ఉద్యోగులపై సీబీఐ దర్యాప్తు చేపట్టారు.

షార్ట్స్ వేసుకున్నారని టూరిస్టులను కొట్టారా? 😳
National· 19 Aug 2026

షార్ట్స్ వేసుకున్నారని టూరిస్టులను కొట్టారా? 😳

పుణేలోని సింహగఢ్ కోటకు వెళ్లిన నలుగురు టూరిస్టులను వారు షార్ట్స్, స్లీవ్‌లెస్ దుస్తులు వేసుకున్నారనే కారణంతో కొందరు అడ్డుకుని కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నలుగురిలో ముగ్గురు మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. “షార్ట్స్ ఎందుకు వేసుకున్నారు?” అంటూ ప్రశ్నించి, చెంపదెబ్బలు కొట్టినట్లు ఫిర్యాదు నమోదైంది. ఈ ఘటనపై ఎనిమిది మందిపై కేసు నమోదైంది. దీంతో ఇప్పుడు చర్చ డ్రెస్ కోడ్ గురించే కాదు.. పబ్లిక్ ప్లేస్‌లో ఎవరి దుస్తులు నచ్చలేదని వారిపై దాడి చేసే హక్కు ఎవరికైనా ఉందా? అనే ప్రశ్న చుట్టూ తిరుగుతోంది.

ఆదివాసీలకు వందశాతం రిజర్వేషన్ కోసం రిలే నిరాహార దీక్ష
Local· 19 Aug 2026

ఆదివాసీలకు వందశాతం రిజర్వేషన్ కోసం రిలే నిరాహార దీక్ష

AP: ఆదివాసీలకు వంద శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఏపీ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలని జీఓ నెంబర్ 3 సాధన, 1/70 చట్టం పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ రిలే నిరాహారదీక్ష ప్రారంభించారు. ఆదివాసీ హక్కులు, చట్టాల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే మరో పోరాటం చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశంలో ఆదివాసులకు వందశాతం రిజర్వేషన్ జీఓపై ప్రత్యేక బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు.

మంగళగిరి ఏపీఐఐసీ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం
AP· 19 Aug 2026

మంగళగిరి ఏపీఐఐసీ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం

AP: మంగళగిరి ఏపీఐఐసీకి చెందిన 116.88 ఎకరాల భూములపై 25 ఏళ్లుగా ఉన్న సమస్యకు పరిష్కారం దొరికింది. చెరువు పోరంబోకు భూములను అసైన్డ్ వేస్ట్ డ్రై ల్యాండ్‌గా మార్చడంతోపాటు, భూముల బదలాయింపును చట్టబద్ధం చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 2003 నాటి ధరల ప్రకారం ఎకరాకు రూ.2,87,375 చొప్పున రూ.3.36 కోట్లు ఏపీఐఐసీ ప్రభుత్వం చెల్లించనుంది. ఈ భూముల్లో ఆటోనగర్, ఐటీ, పారిశ్రామిక పార్కులతో పాటు టిడ్కో, రాజీవ్ గృహకల్పలో సుమారు 2,500 కుటుంబాలు ఉన్నాయి.

Delhi Airport టాప్ 11లోకి ఎలా వెళ్లింది? ✈️
National· 19 Aug 2026

Delhi Airport టాప్ 11లోకి ఎలా వెళ్లింది? ✈️

ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం మరోసారి వార్తల్లోకి వచ్చింది. 2025లో 7.81 కోట్లకు పైగా ప్రయాణికులను హ్యాండిల్ చేసి, ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉన్న విమానాశ్రయాల జాబితాలో 11వ స్థానంలో నిలిచింది. తాజా ACI డేటా ప్రకారం, ప్రపంచ టాప్ 20లో చోటు దక్కించుకున్న ఏకైక భారత విమానాశ్రయం కూడా ఇదే. సియోల్, లాస్ ఏంజెల్స్, పారిస్ వంటి పెద్ద ఎయిర్‌పోర్టులను దాటి ఢిల్లీ ముందుకు రావడం ఆసక్తికరమే. మన రాజధాని ఎయిర్ ట్రాఫిక్ స్కేల్ ఇప్పుడు ప్రపంచ స్థాయిలో ఎంత పెద్దదైందో ఈ ర్యాంక్ చెబుతోంది.

సైబర్ మోసాలపై అవగాహన!
AP· 19 Aug 2026

సైబర్ మోసాలపై అవగాహన!

AP : కోనసీమ జిల్లాలో ఉన్న రాజోలు బస్ స్టాండ్ వద్ద సైబర్ నేరాలపై ప్రజలకు పోలీసులు అవగాహన కల్పించారు. ఫోన్ కాల్స్, ఓటీపీలు, బ్యాంకు వివరాలు అడిగే కొత్త వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తుతెలియని లింక్‌లను క్లిక్ చేయవద్దని హెచ్చరించారు. ఏవైనా అనుమానాస్పద లావాదేవీలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

డిగ్రీ  కాలేజీలకు సొంత భవనాలు: లోకేష్
AP· 19 Aug 2026

డిగ్రీ కాలేజీలకు సొంత భవనాలు: లోకేష్

AP: రాష్ట్రంలోని 37 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు సొంత భవనాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఆళ్లగడ్డ డిగ్రీ కాలేజీకి భవన నిర్మాణంతోపాటు అవసరమైన వసతులు, సిబ్బంది కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రం లోని 175 నియోజకవర్గాల్లో మోడల్‌ లైబ్రరీలు ఏర్పాటు చేస్తామని, కడప లైబ్రరీని తొమ్మిది నెలల్లో పూర్తి చేస్తామని వెల్లడించారు. అమరావతిలో సెంట్రల్‌ లైబ్రరీ, శిక్షణ కేంద్రం, తెలుగు సాంస్కృతిక కేంద్రాన్ని ఒకే ప్రాంగణంలో ఏర్పాటు చేస్తామని, త్వరలో డిజైన్‌ ఖరారు చేస్తామన్నారు.

పిడుగురాళ్లలో మున్సిపల్ కార్మికుల మానవహారం
Local· 19 Aug 2026

పిడుగురాళ్లలో మున్సిపల్ కార్మికుల మానవహారం

AP: పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని సీఐటీయూ మండల కార్యదర్శి తెలకపల్లి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఈనెల 20న నిర్వహించే ‘చలో విజయవాడ’ కార్యక్రమంలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మున్సిపల్ మేనేజర్ షేక్ అబజల్ ఖాన్‌కు అందజేశారు.

“We are Gen Z”.. లడఖ్‌లో టూరిస్ట్  వైరల్
Gen Z· 19 Aug 2026

“We are Gen Z”.. లడఖ్‌లో టూరిస్ట్ వైరల్

లడఖ్‌లో ట్రాఫిక్ ఆపడంతో ఐదు గంటలు వెయిట్ చేయాల్సి వచ్చిందని ఓ మహిళా టూరిస్ట్ ఆగ్రహం వ్యక్తం చేసిన వీడియో వైరల్ అవుతోంది. మినిమార్గ్ చెక్‌పోస్ట్ దగ్గర భద్రతా సిబ్బందితో ఆమె వాగ్వాదానికి దిగుతూ “We are Gen Z.. ఈ నాన్సెన్స్ భరించం” అంటూ మాట్లాడినట్లు వీడియోలో కనిపిస్తోంది. వీడియోపై సోషల్ మీడియాలో కొందరు ఆమెను సమర్థిస్తుంటే, మరికొందరు ఆమె ప్రవర్తనను తప్పుపడుతున్నారు. అయితే ఘటనపై అధికారిక సమాచారం ఇంకా రావాల్సి ఉంది. ఐదు గంటల వెయిటింగ్‌తో మొదలైన ఈ గొడవ, ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది.

మాజీ మంత్రి చిన్నారెడ్డికి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నోటీసు
TG· 19 Aug 2026

మాజీ మంత్రి చిన్నారెడ్డికి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నోటీసు

TG: మాజీ మంత్రి చిన్నారెడ్డికి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. వనపర్తి నియోజకవర్గంలో పరిస్థితులు చూసి బాధగా ఉందని, ఈ పరిణామాలన్నీ భరిస్తూ పార్టీలో కొనసాగుతున్నానని ఇటీవల ఆయన కామెంట్ చేయడం వైరల్ అయ్యింది. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డితోపాటు మరికొందరు నేతలు టీపీసీసీ క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ కామెంట్స్‌కు వివరణ ఇవ్వాలంటూ టీపీసీసీ ఆయనకు నోటీసులిచ్చింది. మూడు రోజులు వివరణ ఇవ్వాలని తెలిపింది.

పోస్టర్లతో HIV, AIDS నివారణపై అవగాహన
Local· 19 Aug 2026

పోస్టర్లతో HIV, AIDS నివారణపై అవగాహన

HIV, AIDSతో పాటు లైంగిక వ్యాధులపై ప్రజల్లో ఉన్న అపోహలు తొలగించి వారిలో అవగాహన పెంచాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె.హరిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ నాగేంద్రతో కలిసి ప్రత్యేక అవగాహన పోస్టర్లను ఆమె ప్రారంభించారు. ప్రజలకు ఉన్న సందేహాలను నివారించడం కోసం ఈ పోస్టర్లలో ప్రత్యేకంగా QR కోడ్‌ను ఏర్పాటు చేశామని, దాన్ని స్కాన్ చేసి సరైన, నమ్మకమైన సమాచారాన్ని తెలుసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.

కాంగ్రెస్ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెన్షన్
TG· 19 Aug 2026

కాంగ్రెస్ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెన్షన్

TG: ఎల్బీనగర్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి జక్కిడి ప్రభాకర్ రెడ్డికి టీపీసీసీ షాక్ ఇచ్చింది. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కాంట్రోవర్షియల్ కామెంట్స్ చేశారంటూ వాయిస్ రికార్డులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఆ వాయిస్ రికార్డుల్లో పార్టీ నేతలతోపాటు కొన్ని బీసీ కులాలపై ఆయన అభ్యంతరకర కామెంట్స్ చేసినట్లు గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నారు.

మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నోటీసులు
TG· 19 Aug 2026

మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నోటీసులు

TG: మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన సంచలన కామెంట్స్‌కు తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ తీవ్రంగా పరిగణించింది. మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆమెకు నోటీసులు ఇచ్చింది. పార్టీ నియమాలను అతిక్రమించి, సీఎం ప్రతిష్టను దెబ్బతీసేలా మాట్లాడిన సుస్మిత కామెంట్స్‌పై తగిన చర్యలు తీసుకుంటామని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి హెచ్చరించారు.

నీళ్లు లేక ఎండిపోతున్న వరి పొలాలు!
Local· 19 Aug 2026

నీళ్లు లేక ఎండిపోతున్న వరి పొలాలు!

అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం రింతాడ గ్రామంలో సరైన వర్షాలు లేక వరి పొలాలు ఎండిపోతున్నాయి. పంటకు నీళ్లు అందక దిగుబడి తగ్గిపోతుందని రైతులు బాధపడుతున్నారు. ఎల్‌నినో ప్రభావం వల్ల పంటలు దెబ్బతినేలా ఉన్నాయని వారు భయపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ గ్రామాల్లో పంటలను పరిశీలించాలని, సాగునీటి వసతులు కల్పించి ఆదుకోవాలని మాజీ ఉప సర్పంచ్ సోమేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

ఆత్మహత్యలు వద్దు.. ధైర్యంగా జీవించాలి
Local· 19 Aug 2026

ఆత్మహత్యలు వద్దు.. ధైర్యంగా జీవించాలి

TG: జీవితంలో ఎదురయ్యే సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదని, ఎంతటి కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా యువతకు పిలుపునిచ్చారు. సమస్యలు ఉంటే కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా నమ్మకమైన వ్యక్తులతో మాట్లాడి పరిష్కారం కోసం ప్రయత్నించాలని అన్నారు. యువత నిరాశకు లోనుకాకుండా భవిష్యత్తుపై ఆశతో ముందుకు సాగాలని ఎస్పీ కోరారు.

దేశంలోని బడ్జెట్ స్కూళ్లలో నెంబర్ 1గా అభ్యాస విద్యాలయం
Education· 19 Aug 2026

దేశంలోని బడ్జెట్ స్కూళ్లలో నెంబర్ 1గా అభ్యాస విద్యాలయం

AP: విజయవాడలోని అభ్యాస విద్యాలయం(Abhyasa Vidyalayam) సీఫోర్ స్కూల్ ర్యాంకింగ్స్ 2026లో భారతదేశంలోని ఉత్తమ బడ్జెట్ స్కూళ్ల విభాగంలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ ర్యాంకింగ్‌లో అభ్యాస విద్యాలయం 949 స్కోర్‌ సాధించింది. నాణ్యమైన చదువును అందరికీ అందుబాటులో ఉంచేలా ఈ పాఠశాల కృషి చేస్తోంది. పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో పాఠాలు చెప్పడంతోపాటు అర్థవంతమైన చదువును వాళ్లకు అందించడం ఈ స్కూల్ విధానం. ఈ విజయానికి కారణం టీచర్స్, స్టూడెంట్స్, వాళ్ల తల్లిదండ్రులు అని స్కూల్ యాజమాన్యం తెలిపింది.