Latest

“మా అమ్మకు స్లిప్పర్లు ఇవ్వండి”..అస్సాం బాలుడి ఆవేదన
India· 29 Jul 2026

“మా అమ్మకు స్లిప్పర్లు ఇవ్వండి”..అస్సాం బాలుడి ఆవేదన

అస్సాం రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. వరదల్లో ఇళ్లు, వస్తువులు, ధాన్యం కోల్పోయిన వేలాది కుటుంబాల పునరావాసం కోసం ఎదురుచూస్తున్నాయి. దాతలు వస్తువులు పంపిణీ చేస్తున్న టైంలో ఆ పిల్లవాడు “మా అమ్మకు స్లిప్పర్లు ఇవ్వండి” అని వేడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వరదల్లో ఇప్పటికే 75 మంది దాకా ప్రాణాలు కోల్పోగా, ఊళ్లకు ఊళ్లు నీళ్లతో నిండిపోయాయి. వందల ఇళ్లు కొట్టుకుపోయాయి.

నన్ను క్లాస్‌రూమ్‌లోనే అరెస్ట్ చేశారు- జేపీ నడ్డా
Politics· 29 Jul 2026

నన్ను క్లాస్‌రూమ్‌లోనే అరెస్ట్ చేశారు- జేపీ నడ్డా

నిరసన తెలిపిన స్టూడెంట్స్‌పై పోలీసుల లాఠీచార్జ్‌ను రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే తప్పుపట్టారు. దీనిపై యూనియన్ మినిస్టర్ జేపీ నడ్డా కౌంటర్ ఇస్తూ.. తాను స్టూడెంట్ లీడర్‌గా ఉన్నప్పుడు ఎమర్జెన్సీ టైమ్‌లో పోలీస్ లు క్లాస్‌రూమ్‌లోనే తనను అరెస్ట్ చేశారని గుర్తుచేశారు. లా అండ్ ఆర్డర్ కాపాడేందుకు పోలీసులు రూల్స్ ప్రకారమే యాక్షన్ తీసుకున్నారని చెప్పారు. ఇంకోవైపు, యాంటీ-పేపర్ లీక్ బిల్‌పై డిస్కషన్ జరగకుండా అపోజిషన్ లీడర్స్ కావాలనే టాపిక్ డైవర్ట్ చేస్తున్నారని మినిస్టర్ కిరణ్ రిజిజు సీరియస్ అయ్యారు.

ఆమె చేసిన పనికి ప్రభుత్వం పరువు పోయింది!
Motivational· 29 Jul 2026

ఆమె చేసిన పనికి ప్రభుత్వం పరువు పోయింది!

'ఎవరైనా వచ్చి చేస్తారు' అనుకోలేదు, 'నేనే చేస్తా' అనుకుంది. బెంగళూరులో భారీ వర్షాలతో రోడ్లు గుంతలతో నిండిపోయాయి. దీంతో వాహనదారులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి ఓ పెద్ద గుంతను చూసిన మహిళ, సంచుల్లో నిర్మాణ సామగ్రి తీసుకొచ్చి, గుంతలో రాళ్లు పోసి దాన్ని సమం చేసే ప్రయత్నం చేసింది. ఒకవైపు ఆమె చొరవను నెటిజన్లు మెచ్చుకుంటుంటే, మరోవైపు 'ప్రజలే రోడ్లు బాగు చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది'? అంటూ కామెంట్లు చేస్తున్నారు. గుంతను మాత్రం నింపింది, కానీ లేవనెత్తిన ప్రశ్న మాత్రం ఇంకా అలాగే ఉంది!

బాలుణ్ని కాపాడినందుకు..ట్రంప్ అత్యున్నత పౌర పురస్కారం
World· 29 Jul 2026

బాలుణ్ని కాపాడినందుకు..ట్రంప్ అత్యున్నత పౌర పురస్కారం

అమెరికాలోని కాలిఫోర్నియాలో సాంటా క్రూజ్ బీచ్‌లో అలల్లో చిక్కుకున్న 10 ఏళ్ల బాలుణ్ని కాపాడిన లైఫ్‌గార్డ్‌ అత్యున్నత పౌర పురస్కారం అందుకోనున్నారు. ఆ యువకుడిని, అతని కుటుంబాన్ని, రక్షించిన బాలుడితో కలిసి వైట్‌హౌస్‌కు పిలిచి అవార్డు అందిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ఘటనలో మరో లైఫ్‌గార్డ్, బీచ్‌లో ఉన్నవారు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

ఉద్యోగం చేస్తూనే.. చదువుకునే అవకాశం
Education· 29 Jul 2026

ఉద్యోగం చేస్తూనే.. చదువుకునే అవకాశం

AP: ఉద్యోగాలు చేస్తూనే పైచదువులు చదవాలనుకునేవారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. AICTE నిబంధనల ప్రకారం వర్కింగ్ ప్రొఫెషనల్స్‌ కోసం అడ్మిషన్లను ప్రవేశపెట్టింది. ఉద్యోగులు వారు పనిచేసే చోటి నుంచి 50 కి.మీలలోపు ఉండే కాలేజీల్లో B.Tech, B.E, M.E, M.Tech, MBA, MCA, కోర్సులు చదువుకోవచ్చు. ఈ కోర్సులకు అప్లై చేసుకునేవాళ్లకు కనీసం ఒక ఏడాది ఉద్యోగ అనుభవం తప్పనిసరి. UGలో 60, PGలో 30 సీట్లు ఉంటాయి. ఈ ప్రత్యేక అడ్మిషన్లు 2026–27 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నాయి.

పేపర్ లీకేజీ నివారణ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
India· 29 Jul 2026

పేపర్ లీకేజీ నివారణ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

పబ్లిక్‌ పరీక్షల(అక్రమ పద్ధతుల నివారణ) సవరణ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. మూజువాణి(మౌఖిక) ఓటు ద్వారా పార్లమెంట్‌ ఈ బిల్లును ఆమోదించింది. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్, ఇతర పరీక్షల్లో అవకతవకల నేపథ్యంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్రం ఈ బిల్లును తయారు చేసింది. దీనిపై పాలక, ప్రతిపక్ష సభ్యులు చర్చించారు. మధ్యాహ్నం లోక్‌సభ దీన్ని ఆమోదించింది.

సౌరవ్‌ దాస్ పై కంగనా రనౌత్ హాట్ కామెంట్స్!
Politics· 29 Jul 2026

సౌరవ్‌ దాస్ పై కంగనా రనౌత్ హాట్ కామెంట్స్!

నీట్ పేపర్ లీక్ ప్రొటెస్ట్‌పై కంగనా రనౌత్ చేసిన కామెంట్స్‌కు CJP లీడర్ సౌరవ్ దాస్ కౌంటర్ ఇచ్చారు. కంగనా మాటలను ఓన్ పార్టీ వాళ్లే లైట్ తీసుకుంటారని విమర్శించారు. దీనికి ఇన్స్టాగ్రామ్‌లో రీయాక్ట్ అయిన కంగనా, గూగుల్ చేస్తే అతనికి 28 ఏళ్లని వచ్చిందని, ఇప్పటికీ స్టూడెంట్ అని ఎలా క్లెయిమ్ చేస్తాడని ఫైర్ అయ్యారు. అతడి ఏజ్ ఉన్నప్పుడే తాను 2 నేషనల్ అవార్డులు గెలిచానని.. నటిగా, MPగా, ప్రొడ్యూసర్‌గా బిజీగా ఉండే తనకి ఉన్న వర్క్ లోడ్, ఏ పనీ లేని అన్‌ఎంప్లాయిడ్ పీపుల్స్‌కి అర్థం కాదని స్పందించారు.

నీట్ పరీక్షలో ర్యాంకు రాలేదని విద్యార్థిని ఆత్మహత్య
Crime· 29 Jul 2026

నీట్ పరీక్షలో ర్యాంకు రాలేదని విద్యార్థిని ఆత్మహత్య

TG: నీట్ పరీక్షలో ర్యాంకు రాలేదని భూపాలపల్లి(D) పలిమెల(M)పంకెనకు చెందిన వైష్ణవి ఆత్మహత్యకు పాల్పడింది. నీట్ పరీక్షలో తక్కువ మార్కులు రావడంతో తనకు ర్యాంక్ రాలేదు. దీంతో మనస్తాపానికి గురై గడ్డి మందు తాగింది. వెంటనే నిమ్స్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తండ్రి రాజయ్య తెలిపారు.

మినిమం బ్యాలెన్స్ లేదని బ్యాంకులు రూ. 7,087 వసూలు
News· 29 Jul 2026

మినిమం బ్యాలెన్స్ లేదని బ్యాంకులు రూ. 7,087 వసూలు

బ్యాంకు అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేదని 2025-26 సంవత్సరంలో బ్యాంకులు ప్రజల నుంచి ఏకంగా రూ.7,087 కోట్లు ఫైన్ కింద వసూలు చేశాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం పార్లమెంట్‌లో చెప్పింది. ప్రైవేట్ బ్యాంకులు అత్యధికంగా రూ.4,948 కోట్లు వసూలు చేస్తే, ప్రభుత్వ బ్యాంకులు రూ 2,137 కోట్లు తీసుకున్నాయి. ఫైన్లు వేయడంలో HDFC బ్యాంక్ రూ.1,798 కోట్లతో టాప్‌లో ఉండగా, యాక్సిస్ బ్యాంక్ రూ 1,081 కోట్లతో రెండో ప్లేస్‌లో ఉంది.

బాలసదన్ నుంచి ఇద్దరు బాలికలు మిస్సింగ్
TG· 29 Jul 2026

బాలసదన్ నుంచి ఇద్దరు బాలికలు మిస్సింగ్

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని బాలసదన్ చిల్డ్రన్ హోమ్ నుంచి ఇద్దరు బాలికలు అదశ్యమయ్యారు. మార్కండేయ కాలనీలో ఉన్న బాలసదన్‌లో కుర్చీలు వేసుకుని కాంపౌండ్ గోడ దూకి తెల్లవారుజామున వెళ్లిపోయినట్లు అధికారులు గుర్తించారు. పాలితం గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థిని ఉమామహేశ్వరి(15), ఉప్పరిపల్లెకు చెందిన 4వ తరగతి విద్యార్థిని ఆకృతి(8) మిస్సయ్యారు. ఉమామహేశ్వరి 3 రోజుల క్రితమే బాలసదన్‌కు వచ్చినట్లు సమాచారం. సూపరింటెండెంట్ వనిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

గోల్డ్ లవర్స్‌కి బిగ్ రిలీఫ్..
Business· 29 Jul 2026

గోల్డ్ లవర్స్‌కి బిగ్ రిలీఫ్..

బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. గుడ్ రిటర్న్స్ లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, హైదరాబాద్, విజయవాడ నగరాల్లో బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.660 తగ్గి రూ.1,43,510 కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ గోల్డ్ రేట్ రూ.600 తగ్గి ప్రస్తుతం రూ.1,31,550 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్‌లో పసిడి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి, కొనేముందు ఒకసారి లైవ్ రేట్స్ చెక్ చేసుకోవడం బెటర్.

రోడ్లపై మోటర్లతో నీళ్లు తోడాల్సిన పరిస్థితి
TG· 29 Jul 2026

రోడ్లపై మోటర్లతో నీళ్లు తోడాల్సిన పరిస్థితి

TG: హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది. ఉప్పల్–నారపల్లి ఫ్లైఓవర్ పరిసరాల్లో భారీగా వరద నీరు నిలిచిపోవడంతో రోడ్లు చెరువులను తలపించాయి. నీటిని మోటర్ల సహాయంతో బయటకు పంపాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 2018లో ప్రారంభమైన ఉప్పల్–నారపల్లి ఫ్లైఓవర్ పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో ప్రతి వర్షానికి ఇదే పరిస్థితి రిపీట్ అవుతుందని స్థానికులు, వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బస్టాండ్ పక్కనే వైన్ షాపులు.. ఐద్వా ఆగ్రహం
AP· 29 Jul 2026

బస్టాండ్ పక్కనే వైన్ షాపులు.. ఐద్వా ఆగ్రహం

AP: తిరుపతి జిల్లా రేణిగుంటలో కొత్తగా ఏర్పాటు చేసిన రెండు మద్యం దుకాణాలను వెంటనే తొలగించాలని ఐద్వా మండల కమిటీ డిమాండ్ చేసింది. RTC బస్టాండ్, రైల్వేస్టేషన్, పాఠశాలలు, దేవాలయాలు, జనావాసాలకు సమీపంలో ఈ వైన్ షాపులు ఉండటం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని పేర్కొంది. గతంలో ప్రజల అభ్యంతరాలతో తొలగించిన ప్రాంతాల్లోనే మళ్లీ దుకాణాలు ఏర్పాటు చేయడం సరి కాదన్నారు. మహిళల భద్రత, చిన్నారుల రక్షణ దృష్ట్యా వెంటనే చర్యలు తీసుకోవాలని CIకి వినతిపత్రం అందజేశారు. సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ప్రతి భారతీయుడూ గర్వపడాలి: రాహుల్ గాంధీ
Politics· 29 Jul 2026

ప్రతి భారతీయుడూ గర్వపడాలి: రాహుల్ గాంధీ

దిల్లీలో జరిగిన CJP ఉద్యమం గురించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడారు. ఈ దేశ విద్యార్థులు వీధుల్లో చేసిన పని చూసి చాలా ఉత్సాహంగా, ఆత్మవిశ్వాసంతో ఉన్నానని అన్నారు. పబ్లిక్‌ పరీక్షల(అక్రమ పద్ధతుల నివారణ) సవరణ బిల్లుపై పార్లమెంట్‌లో జరుగుతున్న చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది ఈ దేశ యువత ఎక్స్‌ప్రెషన్ అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు దీన్ని గౌరవించాలన్నారు. ఈ దేశ యువత చేసిన పనికి ప్రతి భారతీయుడూ గర్వపడాలన్నారు.

హిందూ మహాసముద్రంలో SPACE X స్టార్‌షిప్
General· 29 Jul 2026

హిందూ మహాసముద్రంలో SPACE X స్టార్‌షిప్

SPACE X పంపిన స్టార్‌షిప్ స్పేస్ క్రాఫ్ట్ ఇప్పుడు హిందూ మహాసముద్రంలో తేలుతోంది. అదుపుతప్పి సముద్రంలో పడినా సురక్షితంగానే ఉంది. దీన్ని వెనక్కి తెచ్చేందుకు ఒక నౌక పంపుతున్నామని ఎలాన్ మస్క్ చెప్పారు. అంతరిక్షం నుంచి భూమికి వచ్చేటప్పుడు ఎదురయ్యే వేడిని, ఒత్తిడిని ఈ నౌక ఎలా తట్టుకుందో సైన్టిస్టులు పరిశీలించేందుకు రికవరీ టీమ్ అక్కడికి వెళ్ళింది. ఈ స్పెస్ షిప్ మళ్లీ వాడేందుకు ఉపయోగ పడొచ్చు అని మస్క్ తెలిపారు.

అస్సాంలో వరదలు.. 75కు చేరిన మృతుల సంఖ్య
News· 29 Jul 2026

అస్సాంలో వరదలు.. 75కు చేరిన మృతుల సంఖ్య

అస్సాంలో వరదల కారణంగా గత 24 గంటల్లో మరో ఏడుగురు మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 75కు చేరింది. ప్రస్తుతం ఏడు జిల్లాల్లో 3.32 లక్షల మంది వరదల ప్రభావానికి గురైనట్లు అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ASDMA) వెల్లడించింది. మృతుల కుటుంబాలకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియా సాయాన్ని రూ.9 లక్షలకు పెంచినట్లు తెలిపారు. రాష్ట్రంలో 81 సహాయక శిబిరాల్లో 32,477 మంది నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, NDRF, SDRFతో పాటు ఇతర బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.

మహిళ కోసం.. డ్రైవర్ ఏం చేశాడో తెలుసా?
Viral· 29 Jul 2026

మహిళ కోసం.. డ్రైవర్ ఏం చేశాడో తెలుసా?

బస్సులో ఓ మహిళ "సేవ్ చేయండి" అని అరిచిన వెంటనే.. డ్రైవర్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. బెంగళూరులోని BMTC బస్సులో మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ వ్యక్తిపై ఆరోపణలు వచ్చాయి. వెంటనే డ్రైవర్ ప్రవీణ్ బస్సు ఆపి తలుపులు మూసి.. నిందితుడిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ సమయంలో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. ట్రాఫిక్ కారణంగా తలుపులు తెరవాల్సి రావడంతో.. నిందితుడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. సమయానికి స్పందిస్తే.. ఒకరి ధైర్యం చాలామందికి అండగా నిలుస్తుంది.

ఎక్కువమంది పిల్లల్ని కనాలా..వద్దా?: అరవింద్ కేజ్రీవాల్
India· 29 Jul 2026

ఎక్కువమంది పిల్లల్ని కనాలా..వద్దా?: అరవింద్ కేజ్రీవాల్

బీజేపీ విధానాలపై దిల్లీ మాజీ మంత్రి అరవింద్ కేజ్రీవాల్ సెటైర్ వేశారు. RSS అధ్యక్షుడు మోహన్ భాగవత్ ఎక్కువ మంది పిల్లల్ని కనమంటున్నారని.. దిల్లీ సీఎం రేఖా గుప్తా మాత్రం ప్రభుత్వం ప్రారంభించిన దిల్లీ లక్ష్మీ యోజనలో ముగ్గురు కంటే ఎక్కువమంది పిల్లలుంటే అనర్హులుగా ప్రకటిస్తున్నారని అన్నారు. ఈ విధానాలతో దిల్లీ ప్రజలు అయోమయంలో పడ్డారని కేజ్రీవాల్ తన ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. మోహన్ భాగవత్, రేఖా గుప్తా కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఏం చేయాలో చెప్పాలన్నారు.

యువత ఆందోళనను దేశ ప్రజలు అర్థం చేసుకున్నారు: రాహుల్ గాంధీ
Politics· 29 Jul 2026

యువత ఆందోళనను దేశ ప్రజలు అర్థం చేసుకున్నారు: రాహుల్ గాంధీ

పబ్లిక్‌ పరీక్షల(అక్రమ పద్ధతుల నివారణ) సవరణ బిల్లుపై పార్లమెంట్‌లో జరుగుతున్న చర్చలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడారు. యువత సెంటిమెంట్స్‌ను అన్ని పార్టీలూ గౌరవించాలని అన్నారు. విద్యార్థుల ఆశల్ని, ఆశయాలను అందరం అర్థం చేసుకోవాలన్నారు. వారి ఆందోళనను దేశ ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టే వారికి భారీ స్థాయిలో మద్దతు పలికారని వివరించారు. యువతను తక్కువ అంచనా వేసిన వారికి విద్యార్థులు వారి పోరాటంతో సరైన పాఠం చెప్పారని అన్నారు.

మధ్యాహ్న భోజన పథకంలో చికెన్ బిర్యానీ
India· 29 Jul 2026

మధ్యాహ్న భోజన పథకంలో చికెన్ బిర్యానీ

మధ్యాహ్న భోజన పథకంలో వారానికోసారి చికెన్ బిర్యానీ పెట్టాలని తమిళనాడు ప్రభుత్వం ఆలోచిస్తోంది. టీచర్స్ యూనియన్స్ చేసిన ఈ సూచనను CM విజయ్ పరిశీలిస్తున్నారు. చికెన్ బిర్యానీ యాడ్ చెయ్యడంతో పిల్లలకు పౌష్టికాహారం అందడంతో పాటు స్కూల్ డ్రాపౌట్స్ తగ్గుతారని భావిస్తున్నారు. 1956లో తమిళనాడు సీఎం కామరాజ్ నాడార్ మొదలు పెట్టిన ఈ పథకం వల్ల డ్రాపౌట్స్ తగ్గడంతో మే 2001 నుంచి దేశమంతా అమల్లోకి తెచ్చారు. 2021 ‘PM పోషణ్’అని పేరు మార్చారు. తెలుగు రాష్ట్రాల్లో స్కూల్ పిల్లలకు చికెన్ బిర్యానీ పెడితే ఎలా ఉంటుంది?

తమిళనాడులో ‘విక్రమార్కుడు’ గుండు సీన్
India· 29 Jul 2026

తమిళనాడులో ‘విక్రమార్కుడు’ గుండు సీన్

రవితేజ ‘విక్రమార్కుడు’ సినిమాలోని గుండు సీన్ తమిళనాడులో జరిగింది. సేలం జిల్లా పుదుకొత్తంబాడికి చెందిన ఓ మహిళకు ఫోన్ వచ్చింది. ఎమ్మార్వో ఆఫీసు నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి, కరోనా లాంటి కొత్త వ్యాధి సోకుతోందని అవతలి వ్యక్తి చెప్పాడు. ఈ వ్యాధి సోకిన వారంతా గుండు గీయించుకున్నారని, ఇలా గుండు గీయించుకున్న మహిళలకు ప్రభుత్వం రూ.15 వేలు ఇస్తుందన్నాడు. మహిళ ఈ విషయాన్ని స్థానికులకు చెప్పడంతో ముగ్గురు మహిళలు గుండు చేయించుకొని అతని ఫోన్ చేశారు. స్విచ్ ఆఫ్ అని రావడంతో మోసపోయామని గ్రహించారు.