పేపర్ లీకేజీ నివారణ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

పబ్లిక్ పరీక్షల(అక్రమ పద్ధతుల నివారణ) సవరణ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. మూజువాణి(మౌఖిక) ఓటు ద్వారా పార్లమెంట్ ఈ బిల్లును ఆమోదించింది. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్, ఇతర పరీక్షల్లో అవకతవకల నేపథ్యంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్రం ఈ బిల్లును తయారు చేసింది. దీనిపై పాలక, ప్రతిపక్ష సభ్యులు చర్చించారు. మధ్యాహ్నం లోక్‌సభ దీన్ని ఆమోదించింది.


