Latest

ప్రాణహిత, గోదావరి నదుల ఉగ్రరూపం.. హైఅలర్ట్
TG· 29 Jul 2026

ప్రాణహిత, గోదావరి నదుల ఉగ్రరూపం.. హైఅలర్ట్

TG: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రాణహిత, గోదావరి నదుల వరద పరిస్థితిని పరిశీలించారు. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు <a href="https://www.theclearcutnews.com/n/ru3a7Gr">అప్రమత్తం</a>గా ఉండాలని ఆదేశించారు. మట్టి, పెంకుటిళ్లు, రేకుల ఇళ్లలో నివసించే ప్రజలు వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలు లేదా పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. నదులు, వాగులు, చెరువుల వద్దకు వెళ్లవద్దని, చేపల వేట, ఈత, స్నానాలు పూర్తిగా నివారించాలని హెచ్చరించారు. గ్రామాల్లో ప్రజలకు నిరంతరం అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రానికే గర్వకారణంగా IIM.. ప్రారంభానికి సిద్ధం
Education· 29 Jul 2026

రాష్ట్రానికే గర్వకారణంగా IIM.. ప్రారంభానికి సిద్ధం

AP: విశాఖపట్నంలోని IIM శాశ్వత క్యాంపస్ నిర్మాణం చివరి దశకు చేరుకుంది. రూ.450 కోట్ల వ్యయంతో 241.5 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్రాంగణం పనులు 95 శాతం పూర్తయ్యాయి. అకాడమిక్ బ్లాకులు, హాస్టళ్లు, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్, ఫ్యాకల్టీ క్వార్టర్స్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్, సోలార్ పవర్ సిస్టమ్‌తో క్యాంపస్‌ను అభివృద్ధి చేస్తున్నారు. 2015 నుంచి తాత్కాలిక ప్రాంగణంలో కొనసాగుతున్న విశాఖపట్నం IIM, త్వరలో శాశ్వత క్యాంపస్‌లోకి మారనుండటం ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా రంగానికి రాష్ట్రప్రజలు గర్వకారణంగా భావిస్తున్నారు.

అల్లు అర్జున్ ముందే బ్యాక్‌ఫ్లిప్!
Cinema· 29 Jul 2026

అల్లు అర్జున్ ముందే బ్యాక్‌ఫ్లిప్!

బన్నీ రీసెంట్‌గా హైదరాబాద్‌లో జరిగిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ (AAFA) ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ మీట్‌లో ఒక <a href="https://x.com/allubabloo/status/2082406917599867238?s=20">ఫ్యాన్</a> బన్నీ ముందే క్రేజీగా బ్యాక్‌ఫ్లిప్ వేసి, పుష్పా సిగ్నేచర్ స్టెప్‌తో అలరించాడు. అతడి పర్‌ఫార్మెన్స్‌కు అల్లు అర్జున్ షాక్ అయి ఫుల్ ఇంప్రెస్ అయ్యారు. ఆ ఫ్యాన్‌ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని విష్ చేయడమే కాకుండా.. ఐఫోన్ బ్యాక్‌పై ఆటోగ్రాఫ్ ఇచ్చి స్పెషల్ పిక్స్ తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

మహిళను వేధించిన జూబ్లీహిల్స్ SHO సస్పెండ్
TG· 29 Jul 2026

మహిళను వేధించిన జూబ్లీహిల్స్ SHO సస్పెండ్

TG: ఒక మహిళను వేధించి, బ్లాక్‌మెయిల్ చేసిన ఆరోపణలపై జూబ్లీహిల్స్ SHO యు. శ్రీనివాసులు రెడ్డిని అధికారులు సస్పెండ్ చేశారు. ఓ కేసు కోసం వచ్చిన తనను లోబరుచుకుని, లైంగికంగా వేధించి, అబార్షన్ చేయించాడని బాధితురాలు కంప్లైంట్ ఇచ్చింది. ప్రైవేట్ వీడియోలతో బెదిరించి రూ. 2 కోట్లు అడిగాడని చెప్పింది. జూబ్లీహిల్స్ పోస్టింగ్ కోసం ఆయన రూ. 25 లక్షలు లంచం ఇచ్చాడని కూడా ఆరోపించింది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.

కాంగ్రెస్ గవర్నమెంట్‌కు థాంక్స్ చెప్పిన పవన్ కళ్యాణ్!
AP· 29 Jul 2026

కాంగ్రెస్ గవర్నమెంట్‌కు థాంక్స్ చెప్పిన పవన్ కళ్యాణ్!

AP డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి థాంక్స్ చెప్పారు. APలో హ్యూమన్-ఎలిఫెంట్ ప్రాబ్లమ్‌ను కంట్రోల్ చేయడానికి, ఫారెస్ట్ సెక్యూరిటీ పెంచడానికి కుంకీ ఏనుగులను సరైన టైమ్‌లో పంపినందుకు థాంక్స్ చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లాలో కొత్తగా స్టార్ట్ చేసిన గుచిమి కుంకీ ఎలిఫెంట్ క్యాంప్‌ను ఆయన ఆన్‌లైన్‌లో ఓపెన్ చేశారు. పాలిటిక్స్ పక్కనపెట్టి ప్రజల కోసం స్టేట్స్ ఇలా కలిసి పనిచేయడం మంచి విషయమని పవన్ అన్నారు.

'ది ప్యారడైజ్'లో స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్?
Entertainment· 29 Jul 2026

'ది ప్యారడైజ్'లో స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్?

'ది ప్యారడైజ్' నుంచి మరో క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. లేటెస్ట్ బజ్ ప్రకారం.. ఈ సినిమాలో ఓ స్టార్ హీరోయిన్‌తో స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారట. ఇదే నిజమైతే, నాని కెరీర్‌లో తొలిసారి ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై హైప్ పెంచగా.. ఇప్పుడు ఈ స్పెషల్ సాంగ్ వార్త మరింత ఆసక్తి పెంచుతోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

మహిళని చంపి ఆ డెడ్‌బాడీతో 350 కి.మీ. ప్రయాణం
Crime· 29 Jul 2026

మహిళని చంపి ఆ డెడ్‌బాడీతో 350 కి.మీ. ప్రయాణం

మహారాష్ట్రలో దారుణ ఘటన జరిగింది. మరొకరితో సంబంధముందన్న అనుమానంతో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న మహిళను గొంతు నులిమి చంపాడు. హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కొల్హాపూర్ జిల్లాలోని షిర్గావ్ గ్రామానికి చెందిన ప్రకాష్ ఆనంద్ పాటిల్ (40) ఆదివారం తన పొలంలో సురేఖ శివాజీనే ఆరే (40)ను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. తరువాత మృతదేహాన్ని కారులో 350 కి.మీ. దూరంలోని థానే జిల్లా భివండీలోని కషెలికి తరలించినట్లు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

అవినీతిని అంతం చేయనున్న 'AI' పరిపాలన: RGV
General· 29 Jul 2026

అవినీతిని అంతం చేయనున్న 'AI' పరిపాలన: RGV

ప్రస్తుతం ఉన్న సిస్టమ్‌లో అధికారులు, లీడర్లు లంచాలకు ఆశపడి తప్పులు చేస్తున్నారు. వీరి స్థానంలో 'AI' ని పెడితే అద్భుతాలు జరుగుతాయి. అని RGV 'X' లో పోస్ట్ చేశారు. 'AI' కి ఫామిలీ, భయం ఉండదు కాబట్టి దానికి ఎవరూ లంచం ఇవ్వలేరు. దుబాయ్‌లో ఇప్పటికే AI పోలీస్ స్టేషన్లు నడుస్తున్నాయి. లీడర్లు సొంత లాభాల కోసం తప్పుడు లెక్కలు చెప్తారు. అదే AI అయితే అన్ని వివరాలు కరెక్ట్ గ చెప్తుంది. AI వస్తే తమ పవర్ పోతుందని పోలిటీషన్స్ భయపడతున్నారు అని వర్మ అన్నారు.

“మా అమ్మకు స్లిప్పర్లు ఇవ్వండి”..అస్సాం బాలుడి ఆవేదన
India· 29 Jul 2026

“మా అమ్మకు స్లిప్పర్లు ఇవ్వండి”..అస్సాం బాలుడి ఆవేదన

అస్సాం రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. వరదల్లో ఇళ్లు, వస్తువులు, ధాన్యం కోల్పోయిన వేలాది కుటుంబాల పునరావాసం కోసం ఎదురుచూస్తున్నాయి. దాతలు వస్తువులు పంపిణీ చేస్తున్న టైంలో ఆ పిల్లవాడు “మా అమ్మకు స్లిప్పర్లు ఇవ్వండి” అని వేడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వరదల్లో ఇప్పటికే 75 మంది దాకా ప్రాణాలు కోల్పోగా, ఊళ్లకు ఊళ్లు నీళ్లతో నిండిపోయాయి. వందల ఇళ్లు కొట్టుకుపోయాయి.

నన్ను క్లాస్‌రూమ్‌లోనే అరెస్ట్ చేశారు- జేపీ నడ్డా
Politics· 29 Jul 2026

నన్ను క్లాస్‌రూమ్‌లోనే అరెస్ట్ చేశారు- జేపీ నడ్డా

నిరసన తెలిపిన స్టూడెంట్స్‌పై పోలీసుల లాఠీచార్జ్‌ను రాజ్యసభలో కాంగ్రెస్ చీఫ్ ఖర్గే తప్పుపట్టారు. దీనిపై యూనియన్ మినిస్టర్ జేపీ నడ్డా కౌంటర్ ఇస్తూ.. తాను స్టూడెంట్ లీడర్‌గా ఉన్నప్పుడు ఎమర్జెన్సీ టైమ్‌లో పోలీస్ లు క్లాస్‌రూమ్‌లోనే తనను అరెస్ట్ చేశారని గుర్తుచేశారు. లా అండ్ ఆర్డర్ కాపాడేందుకు పోలీసులు రూల్స్ ప్రకారమే యాక్షన్ తీసుకున్నారని చెప్పారు. ఇంకోవైపు, యాంటీ-పేపర్ లీక్ బిల్‌పై డిస్కషన్ జరగకుండా అపోజిషన్ లీడర్స్ కావాలనే టాపిక్ డైవర్ట్ చేస్తున్నారని మినిస్టర్ కిరణ్ రిజిజు సీరియస్ అయ్యారు.

ఆమె చేసిన పనికి ప్రభుత్వం పరువు పోయింది!
Motivational· 29 Jul 2026

ఆమె చేసిన పనికి ప్రభుత్వం పరువు పోయింది!

'ఎవరైనా వచ్చి చేస్తారు' అనుకోలేదు, 'నేనే చేస్తా' అనుకుంది. బెంగళూరులో భారీ వర్షాలతో రోడ్లు గుంతలతో నిండిపోయాయి. దీంతో వాహనదారులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి ఓ పెద్ద గుంతను చూసిన మహిళ, సంచుల్లో నిర్మాణ సామగ్రి తీసుకొచ్చి, గుంతలో రాళ్లు పోసి దాన్ని సమం చేసే ప్రయత్నం చేసింది. ఒకవైపు ఆమె చొరవను నెటిజన్లు మెచ్చుకుంటుంటే, మరోవైపు 'ప్రజలే రోడ్లు బాగు చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది'? అంటూ కామెంట్లు చేస్తున్నారు. గుంతను మాత్రం నింపింది, కానీ లేవనెత్తిన ప్రశ్న మాత్రం ఇంకా అలాగే ఉంది!

బాలుణ్ని కాపాడినందుకు..ట్రంప్ అత్యున్నత పౌర పురస్కారం
World· 29 Jul 2026

బాలుణ్ని కాపాడినందుకు..ట్రంప్ అత్యున్నత పౌర పురస్కారం

అమెరికాలోని కాలిఫోర్నియాలో సాంటా క్రూజ్ బీచ్‌లో అలల్లో చిక్కుకున్న 10 ఏళ్ల బాలుణ్ని కాపాడిన లైఫ్‌గార్డ్‌ అత్యున్నత పౌర పురస్కారం అందుకోనున్నారు. ఆ యువకుడిని, అతని కుటుంబాన్ని, రక్షించిన బాలుడితో కలిసి వైట్‌హౌస్‌కు పిలిచి అవార్డు అందిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ ఘటనలో మరో లైఫ్‌గార్డ్, బీచ్‌లో ఉన్నవారు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు.

ఉద్యోగం చేస్తూనే.. చదువుకునే అవకాశం
Education· 29 Jul 2026

ఉద్యోగం చేస్తూనే.. చదువుకునే అవకాశం

AP: ఉద్యోగాలు చేస్తూనే పైచదువులు చదవాలనుకునేవారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. AICTE నిబంధనల ప్రకారం వర్కింగ్ ప్రొఫెషనల్స్‌ కోసం అడ్మిషన్లను ప్రవేశపెట్టింది. ఉద్యోగులు వారు పనిచేసే చోటి నుంచి 50 కి.మీలలోపు ఉండే కాలేజీల్లో B.Tech, B.E, M.E, M.Tech, MBA, MCA, కోర్సులు చదువుకోవచ్చు. ఈ కోర్సులకు అప్లై చేసుకునేవాళ్లకు కనీసం ఒక ఏడాది ఉద్యోగ అనుభవం తప్పనిసరి. UGలో 60, PGలో 30 సీట్లు ఉంటాయి. ఈ ప్రత్యేక అడ్మిషన్లు 2026–27 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నాయి.

పేపర్ లీకేజీ నివారణ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
India· 29 Jul 2026

పేపర్ లీకేజీ నివారణ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

పబ్లిక్‌ పరీక్షల(అక్రమ పద్ధతుల నివారణ) సవరణ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. మూజువాణి(మౌఖిక) ఓటు ద్వారా పార్లమెంట్‌ ఈ బిల్లును ఆమోదించింది. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్, ఇతర పరీక్షల్లో అవకతవకల నేపథ్యంలో నిందితులపై కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్రం ఈ బిల్లును తయారు చేసింది. దీనిపై పాలక, ప్రతిపక్ష సభ్యులు చర్చించారు. మధ్యాహ్నం లోక్‌సభ దీన్ని ఆమోదించింది.

సౌరవ్‌ దాస్ పై కంగనా రనౌత్ హాట్ కామెంట్స్!
Politics· 29 Jul 2026

సౌరవ్‌ దాస్ పై కంగనా రనౌత్ హాట్ కామెంట్స్!

నీట్ పేపర్ లీక్ ప్రొటెస్ట్‌పై కంగనా రనౌత్ చేసిన కామెంట్స్‌కు CJP లీడర్ సౌరవ్ దాస్ కౌంటర్ ఇచ్చారు. కంగనా మాటలను ఓన్ పార్టీ వాళ్లే లైట్ తీసుకుంటారని విమర్శించారు. దీనికి ఇన్స్టాగ్రామ్‌లో రీయాక్ట్ అయిన కంగనా, గూగుల్ చేస్తే అతనికి 28 ఏళ్లని వచ్చిందని, ఇప్పటికీ స్టూడెంట్ అని ఎలా క్లెయిమ్ చేస్తాడని ఫైర్ అయ్యారు. అతడి ఏజ్ ఉన్నప్పుడే తాను 2 నేషనల్ అవార్డులు గెలిచానని.. నటిగా, MPగా, ప్రొడ్యూసర్‌గా బిజీగా ఉండే తనకి ఉన్న వర్క్ లోడ్, ఏ పనీ లేని అన్‌ఎంప్లాయిడ్ పీపుల్స్‌కి అర్థం కాదని స్పందించారు.

నీట్ పరీక్షలో ర్యాంకు రాలేదని విద్యార్థిని ఆత్మహత్య
Crime· 29 Jul 2026

నీట్ పరీక్షలో ర్యాంకు రాలేదని విద్యార్థిని ఆత్మహత్య

TG: నీట్ పరీక్షలో ర్యాంకు రాలేదని భూపాలపల్లి(D) పలిమెల(M)పంకెనకు చెందిన వైష్ణవి ఆత్మహత్యకు పాల్పడింది. నీట్ పరీక్షలో తక్కువ మార్కులు రావడంతో తనకు ర్యాంక్ రాలేదు. దీంతో మనస్తాపానికి గురై గడ్డి మందు తాగింది. వెంటనే నిమ్స్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తండ్రి రాజయ్య తెలిపారు.

మినిమం బ్యాలెన్స్ లేదని బ్యాంకులు రూ. 7,087 వసూలు
News· 29 Jul 2026

మినిమం బ్యాలెన్స్ లేదని బ్యాంకులు రూ. 7,087 వసూలు

బ్యాంకు అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయలేదని 2025-26 సంవత్సరంలో బ్యాంకులు ప్రజల నుంచి ఏకంగా రూ.7,087 కోట్లు ఫైన్ కింద వసూలు చేశాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం పార్లమెంట్‌లో చెప్పింది. ప్రైవేట్ బ్యాంకులు అత్యధికంగా రూ.4,948 కోట్లు వసూలు చేస్తే, ప్రభుత్వ బ్యాంకులు రూ 2,137 కోట్లు తీసుకున్నాయి. ఫైన్లు వేయడంలో HDFC బ్యాంక్ రూ.1,798 కోట్లతో టాప్‌లో ఉండగా, యాక్సిస్ బ్యాంక్ రూ 1,081 కోట్లతో రెండో ప్లేస్‌లో ఉంది.

బాలసదన్ నుంచి ఇద్దరు బాలికలు మిస్సింగ్
TG· 29 Jul 2026

బాలసదన్ నుంచి ఇద్దరు బాలికలు మిస్సింగ్

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లోని బాలసదన్ చిల్డ్రన్ హోమ్ నుంచి ఇద్దరు బాలికలు అదశ్యమయ్యారు. మార్కండేయ కాలనీలో ఉన్న బాలసదన్‌లో కుర్చీలు వేసుకుని కాంపౌండ్ గోడ దూకి తెల్లవారుజామున వెళ్లిపోయినట్లు అధికారులు గుర్తించారు. పాలితం గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థిని ఉమామహేశ్వరి(15), ఉప్పరిపల్లెకు చెందిన 4వ తరగతి విద్యార్థిని ఆకృతి(8) మిస్సయ్యారు. ఉమామహేశ్వరి 3 రోజుల క్రితమే బాలసదన్‌కు వచ్చినట్లు సమాచారం. సూపరింటెండెంట్ వనిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

గోల్డ్ లవర్స్‌కి బిగ్ రిలీఫ్..
Business· 29 Jul 2026

గోల్డ్ లవర్స్‌కి బిగ్ రిలీఫ్..

బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. గుడ్ రిటర్న్స్ లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, హైదరాబాద్, విజయవాడ నగరాల్లో బుధవారం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.660 తగ్గి రూ.1,43,510 కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ గోల్డ్ రేట్ రూ.600 తగ్గి ప్రస్తుతం రూ.1,31,550 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్‌లో పసిడి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి, కొనేముందు ఒకసారి లైవ్ రేట్స్ చెక్ చేసుకోవడం బెటర్.

రోడ్లపై మోటర్లతో నీళ్లు తోడాల్సిన పరిస్థితి
TG· 29 Jul 2026

రోడ్లపై మోటర్లతో నీళ్లు తోడాల్సిన పరిస్థితి

TG: హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది. ఉప్పల్–నారపల్లి ఫ్లైఓవర్ పరిసరాల్లో భారీగా వరద నీరు నిలిచిపోవడంతో రోడ్లు చెరువులను తలపించాయి. నీటిని మోటర్ల సహాయంతో బయటకు పంపాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 2018లో ప్రారంభమైన ఉప్పల్–నారపల్లి ఫ్లైఓవర్ పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో ప్రతి వర్షానికి ఇదే పరిస్థితి రిపీట్ అవుతుందని స్థానికులు, వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బస్టాండ్ పక్కనే వైన్ షాపులు.. ఐద్వా ఆగ్రహం
AP· 29 Jul 2026

బస్టాండ్ పక్కనే వైన్ షాపులు.. ఐద్వా ఆగ్రహం

AP: తిరుపతి జిల్లా రేణిగుంటలో కొత్తగా ఏర్పాటు చేసిన రెండు మద్యం దుకాణాలను వెంటనే తొలగించాలని ఐద్వా మండల కమిటీ డిమాండ్ చేసింది. RTC బస్టాండ్, రైల్వేస్టేషన్, పాఠశాలలు, దేవాలయాలు, జనావాసాలకు సమీపంలో ఈ వైన్ షాపులు ఉండటం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని పేర్కొంది. గతంలో ప్రజల అభ్యంతరాలతో తొలగించిన ప్రాంతాల్లోనే మళ్లీ దుకాణాలు ఏర్పాటు చేయడం సరి కాదన్నారు. మహిళల భద్రత, చిన్నారుల రక్షణ దృష్ట్యా వెంటనే చర్యలు తీసుకోవాలని CIకి వినతిపత్రం అందజేశారు. సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.