Latest

ఎల్‌నినో గురించి ఆందోళన వద్దు: పొంగులేటి
News· 21 Jul 2026

ఎల్‌నినో గురించి ఆందోళన వద్దు: పొంగులేటి

TG: ఉమ్మడి వరంగల్ జిల్లా హనుమకొండ కలెక్టరేట్‌ అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశమయ్యారు. ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో లోటు వర్షపాతం నమోదైయింది. తాగునీరు, వ్యవసాయం, భూగర్భ జలాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిగా దేవసేన(ఐఏఎస్)ను నియమించామని మంత్రి తెలిపారు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని స్పష్టం చేశారు. ఎల్‌నినో గురించి ప్రజలు ఆందోళన చెందవద్దని అన్నారు.

బైక్ మెకానిక్‌పై రూ.66 వేల ఫైన్
News· 21 Jul 2026

బైక్ మెకానిక్‌పై రూ.66 వేల ఫైన్

కేరళం రాష్ట్రం తిరువనంతపురానికి చెందిన రెంజిత్ తన బైక్‌ను అనిల్‌కుమార్ మెకానిక్ షాప్‌లో రిపేర్ కోసం ఇచ్చాడు. అడ్వాన్స్ తీసుకున్న అతను లేటుగా రిపేర్ చేశాడు. బిల్లు ఇవ్వకుండానే బైక్ అప్పగించాడు. మూడు నెలల్లోనే ఇంజిన్ పాడైంది. పిస్టన్ తప్పుగా అమర్చడం వల్లే ఈ సమస్య వచ్చిందని గుర్తించిన రెంజిత్ కొల్లం కన్సూమర్ కమిషన్‌ను ఆశ్రయించాడు. బైక్ రిపేర్ సరిగ్గా చేయని మెకానిక్‌కు కమిషన్ రూ.66,752 జరిమానా విధించింది.

పులి-ఎలుగుబంట్ల ఫైటింగ్ వీడియో VIRAL
Viral· 21 Jul 2026

పులి-ఎలుగుబంట్ల ఫైటింగ్ వీడియో VIRAL

ఒక పులి, రెండు ఎలుగుబంట్ల మధ్య జరిగిన భీకర పోరాటం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొదట ఒంటరిగా ఉన్న ఎలుగుబంటిపై పులి తీవ్రంగా దాడి చేసింది. అంతలోనే మరో ఎలుగుబంటి అక్కడికి చేరుకుని పులిపై విరుచుకుపడింది. రెండు ఎలుగుబంట్లు కలిసి చుట్టుముట్టడంతో పులి రక్షించుకునేందుకు ఎంత ప్రయత్నించినా చివరికి నేలపై పడిపోయింది. ఆ తర్వాత రెండు ఎలుగుబంట్లు అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. అయితే ఇది AIతో క్రియేట్ చేసింది కావచ్చని కొందరు అంటున్నారు

ఢిల్లీ నిరసనలో ఖాకీ అరాచకం!
Politics· 21 Jul 2026

ఢిల్లీ నిరసనలో ఖాకీ అరాచకం!

ఢిల్లీలో నిన్న జరిగిన నిరసన ప్రదర్శనలో ఒక దారుణమైన వీడియో బయటకు వచ్చింది. ఆందోళన తెలుపుతున్న ఒక మహిళా ప్రొటెస్టర్ పై DCP సందీప్ లాంబా చేయి చేసుకున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఒక ఉన్నత పోలీసు అధికారి మహిళ పట్ల ఇలా ప్రవర్తించడంపై సోషల్ మీడియాలో అందరూ తీవ్రంగా మండిపడుతున్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేసిన ఆ అధికారిని వెంటనే ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాలని ప్రజలు, నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

KSOUలో అడ్మిషన్లు ప్రారంభం
Education· 21 Jul 2026

KSOUలో అడ్మిషన్లు ప్రారంభం

కర్ణాటక స్టేట్ ఓపెన్ యూనివర్సిటీ 2026–27 విద్యా సంవత్సరానికి 65 యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు అప్లికేషన్లు ఆహ్వానిస్తోంది. BA, BCom, BBA, BSc, MA, MSc, MCom, MBA, MSW, BEd వంటి కోర్సులతోపాటు 10 ఆన్‌ లైన్ కోర్సులకు కూడా అడ్మిషన్లు అందుబాటులో ఉన్నాయని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఏ.పీ. జ్ఞానప్రకాష్ తెలిపారు.

పవర్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యుత్‌ ఉద్యోగుల నిరసన
News· 21 Jul 2026

పవర్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యుత్‌ ఉద్యోగుల నిరసన

TG : యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు మంగళవారం నిరసన మొదలుపెట్టారు. కరీంనగర్‌లోని ఎస్‌ఈ కార్యాలయం ముందు నల్లబ్యాడ్జీలు ధరించి, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే ప్రైవేటీకరణ ఆలోచన మానుకోవాలని, న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం స్పందించే వరకు తమ పోరాటం ఆగదని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు.

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
Infotainment· 21 Jul 2026

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

గ్లోబల్ మార్కెట్‌లో మార్పులు, డాలర్ రేటు, బులియన్ మార్కెట్ ఎఫెక్ట్ వల్ల హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం సిటీల్లో బంగారం ధరలు కాస్త పెరిగాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల రేటు రూ.1,42,848కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.1,42,386గా ఉంది. ఇంకోవైపు కిలో వెండి రేటు రూ.2,19,200 దగ్గర ఉంది. పెళ్లిళ్ల సీజన్ వస్తుండటం, దేశాల మధ్య గొడవల వల్ల బంగారం ధరలు పెరుగుతూ ఉన్నాయని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు.

తెలంగాణ టెట్ (TET) నోటిఫికేషన్ విడుదల
Education· 21 Jul 2026

తెలంగాణ టెట్ (TET) నోటిఫికేషన్ విడుదల

TG: తెలంగాణలో ఇన్-సర్వీస్ టీచర్ అభ్యర్థుల కోసం విద్యాశాఖ టెట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. జూలై 22 నుంచి జూలై 29 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు తీసుకుంటారు. కంప్యూటర్ బేస్ టెస్ట్(CBT) ఎగ్జామ్స్ సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు రెండు పేపర్లుగా జరుగుతాయి. టీచర్ ఉద్యోగాలు సాధించాలనుకునేవారికి టెట్ స్కోరు ఎంతో అవసరం. అఫీషియల్ వెబ్‌సైట్‌ https://tgtet.aptonline.in/

మీ PFను ఇలా క్లెయిమ్ చేసుకోవచ్చు
Infotainment· 21 Jul 2026

మీ PFను ఇలా క్లెయిమ్ చేసుకోవచ్చు

దేశవ్యాప్తంగా ఉద్యోగుల పీఎఫ్ అకౌంట్లలో వేల కోట్ల రూపాయలు క్లెయిమ్ చేయకుండా ఉన్నాయి. ఇందులో రూ.9,330 కోట్లు ఇన్ ఆపరేటివ్‌గా పీఎఫ్ అకౌంట్లలోనే ఉందని తేలింది. ఆన్‌లైన్ ద్వారా ఇన్ ఆపరేటివ్ పీఎఫ్ ఖాతాలో డబ్బును పొందేందుకు ముందుగా మెంబర్ ఐడీ, పీఎఫ్ అకౌంట్ నంబర్ UAN వివరాలు అందించాలి. తరువాత EPFO పోర్టల్ లోకి వెళ్లి ఫామ్-19, ఫామ్-10Cను సమర్పించాలి. ఒకవేళ అకౌంట్ ఏడు సంవత్సరాలు ఇన్ ఆపరేటివ్‌గా ఉంటే మరిన్ని డాక్యుమెంట్స్ ఇవ్వాలి. UAN లాగిన్ ద్వారా అప్లికేషన్ పూర్తి చేసి, తరువాత క్లెయిమ్‌ను డిజిటల్‌గా సబ్మిట్ చేయాలి.

మానసిక ఒత్తిడికి చెక్: సెన్సరీ బేస్‌లైన్ రీసెట్
Infotainment· 21 Jul 2026

మానసిక ఒత్తిడికి చెక్: సెన్సరీ బేస్‌లైన్ రీసెట్

రోజంతా ఫోన్ స్క్రీన్ చూడటం, వర్క్ స్ట్రెస్ వల్ల వచ్చే మెంటల్ స్ట్రెస్‌ని తగ్గించడానికి 'సెన్సరీ బేస్‌లైన్ రీసెట్' హెల్ప్ అవుతుందని డాక్టర్లు చెప్తున్నారు. అంటే కళ్లు, చెవులకు బయట ప్రపంచం నుంచి విశ్రాంతి , మైండ్‌ను ప్రశాంతంగా ఉంచడం. గట్టి శబ్దాలు, రోజంతా ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వాడటం వల్ల వచ్చే స్ట్రెస్‌ను తగ్గించి, బ్రెయిన్‌ను ప్రశాంతంగా ఉంచుతుంది. రోజుకి 15 నుండి 20 నిమిషాలు ఫోన్, టీవీ దూరంగా పెట్టాలి. తక్కువ లైటింగ్‌లో కళ్లు మూసుకుని సైలెంట్‌గా కూర్చోవడం, పచ్చటి గడ్డిపై నడవడం, లాంగ్ బ్రీత్ తీసుకోవడం చేస్తే మైండ్ రీసెట్ అవుతుంది.

ఈ వీడియో చూస్తే కన్నీళ్ళు ఆగవు- CJP ప్రొటెస్టర్స్
Politics· 21 Jul 2026

ఈ వీడియో చూస్తే కన్నీళ్ళు ఆగవు- CJP ప్రొటెస్టర్స్

ఢిల్లీలో జరిగిన నిరసనల్లో తీవ్రంగా గాయపడిన బాధితులు ఒకరినొకరు చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. గాయాలకు బ్యాండేజీలతో ఉన్న ఇద్దరు వ్యక్తులు కన్నీళ్లతో ఆలింగనం చేసుకుని ఓదార్చుకున్న దృశ్యాలు అందరినీ కలచివేస్తున్నాయి. నిరసన వేదిక వద్ద మిగతా గాయపడిన వారు కూడా వరుసగా కూర్చుని నిరసన తెలుపుతున్నారు. ఈ హృదయవిదారక దృశ్యాలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

చంద్రబాబుతో UAE మంత్రుల భేటీ
Politics· 21 Jul 2026

చంద్రబాబుతో UAE మంత్రుల భేటీ

AP: సీఎం చంద్రబాబుతో యూఏఈ ఆర్థిక, పర్యాటకశాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ సచివాలయంలో భేటీ అయ్యారు. ఏపీలో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటుకు యుఏఈ ప్రతినిధుల బృందంతో చర్చలు జరిపారు. తరువాత ఏపీ ప్రభుత్వం యుఏఈ మధ్య భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. మామిడి, అరటి, కోకో ఉద్యాన ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లకు పంపేలా వాల్యూ చైన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. మంత్రి టీజీ భరత్, ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమలు, ఈడీబీ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నెక్కొండ SIపై సస్పెన్షన్ వేటు
TG· 21 Jul 2026

నెక్కొండ SIపై సస్పెన్షన్ వేటు

TG: వరంగల్ కమిషనరేట్ పరిధిలోని నెక్కొండ SI మహేందర్‌ను అవినీతి ఆరోపణల నేపథ్యంలో సస్పెండ్ చేశారు. ఆయనపై వచ్చిన ఫిర్యాదులపై నిర్వహించిన ప్రాథమిక విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో కమిషనర్ శ్వేత క్రమశిక్షణా రాహిత్యం కింద సస్పెన్షన్ ఆదేశాలు జారీ చేశారు. దర్యాప్తులో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. అక్రమాలకు పాల్పడే అధికారులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని కమిషనర్ స్పష్టం చేశారు. పోలీసు శాఖలో పారదర్శకత పెంపొందించడంతో పాటు విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మోదీ ఇంటి ముందు కూర్చున్న రాహుల్ గాంధీ, ప్రియాంక!
Politics· 21 Jul 2026

మోదీ ఇంటి ముందు కూర్చున్న రాహుల్ గాంధీ, ప్రియాంక!

స్టూడెంట్స్ పై జరిగిన పోలీసుల లాఠీచార్జ్, పరీక్షల అక్రమాల వివాదానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు రోడ్డుపైకి వచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ సహా పలువురు MPలు ప్రధాని మోదీ ఇంటి ముందు అక్కడే రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు. నేతల నినాదాలతో ప్రధాని ఇంటి పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

చైనా IMOలో ఇండియాకు ఆరు మెడల్స్
Sports· 21 Jul 2026

చైనా IMOలో ఇండియాకు ఆరు మెడల్స్

చైనాలోని షాంఘైలో జరుగుతున్న 67వ ఇంటర్నేషనల్ మాథెమాటిక్స్ ఒలింపియాడ్ (IMO) ఈరోజుతో ముగియనుంది. ఈ ఒలింపియాడ్‌లో భారతీయ విద్యార్థులు మరోసారి అద్భుత ప్రతిభను కనబరిచారు. రెండు గోల్డ్ మెడల్స్ నాలుగు సిల్వర్ మెడల్స్ సాధించారు. గోల్డ్ మెడల్స్ సాధించినవారిలో ఆరవ్ గుప్తా, ఏబెల్ జార్జ్ మాథ్యూ ఉన్నారు. బైరవ్ మురుగన్, కనవ్ తల్వార్, సంజన ఫిలో చాకో, శ్రేయ శాంతను ముంధడ రజత పతకాలను గెలుచుకున్నారు. కనవ్ తల్వార్, ఆరవ్ గుప్తా, జార్జ్ మాథ్యూ గతంలో ఆస్ట్రేలియాలో జరిగిన IMO-2025లో స్వర్ణ పతకాలను సాధించినవారే.

ప్రధాని నివాసానికి రాహుల్ గాంధీ, ప్రియాంక పాదయాత్ర!
Politics· 21 Jul 2026

ప్రధాని నివాసానికి రాహుల్ గాంధీ, ప్రియాంక పాదయాత్ర!

యువత వ్యతిరేక విధానాలు, పరీక్షల వివాదానికి నిరసనగా కాంగ్రెస్ నేతలు లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి పాదయాత్రగా బయల్దేరారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నేతృత్వంలో MPలంతా రోడ్డుపైకి వచ్చి తీవ్ర నిరసన తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ప్రధాని మోదీ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలతో హోరెత్తించారు.

మోదీ ఇంటిని ముట్టడించిన కాంగ్రెస్ నేతలు
Politics· 21 Jul 2026

మోదీ ఇంటిని ముట్టడించిన కాంగ్రెస్ నేతలు

నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యామంత్రి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీ ఇంటిని ముట్టడించారు. ఈ ధర్నాలో ప్రియాంక గాంధీ, ఖర్గే, కె.సి.వేణుగోపాల్ మోదీ నివాసం ముందు నిరసనకు దిగారు. చేతులకు సంకెళ్లు వేసుకొని కాంగ్రెస్ నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. దీంతో మోదీ ఇంటిముందు హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు: కేటీఆర్
Politics· 21 Jul 2026

ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు: కేటీఆర్

TG: ‘ఇది కాలం తెచ్చిన కరువు కాదు..కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు’ అని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో నిర్వహించిన బీఆర్‌ఎస్ 'రైతు సదస్సు'లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో యూరియా కష్టాలు, కరెంటు కోతలు, సాగునీటి సమస్యలతో రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఇటీవల ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద గోడ కూలి ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతు కుటుంబాలకు బీఆర్‌ఎస్ తరఫున రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.20 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు.

ఇంటర్నెట్ లేకున్నా UPI పేమెంట్స్: NPCI
Infotainment· 21 Jul 2026

ఇంటర్నెట్ లేకున్నా UPI పేమెంట్స్: NPCI

ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ పేమెంట్స్ చేసేలా 'నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా'(NPCI) కొత్త ఫీచర్‌ని తీసుకొస్తోంది. ఇకపై స్మార్ట్‌ఫోన్ లేదా వ్యాపారుల వద్ద ఉన్న PoS (పాయింట్ ఆఫ్ సేల్) మెషిన్లకు ఇంటర్నెట్ కనెక్షన్, సిగ్నల్ లేకపోయినా యూపీఐ ద్వారా ఈజీగా ప్రెమెంట్స్ చేయొచ్చు. ఈ విధానంలో నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్(NFC) టెక్నాలజీ ఆధారంగా కస్టమర్లు తమ ఫోన్‌ను PoS మెషిన్‌పై ట్యాప్ చేసి రూ.2,000 వరకు పేమెంట్ చేయవచ్చు. దీనికి PIN ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు.

స్టూడెంట్స్‌పై లాఠీఛార్జ్.. రాజ్యసభలో ఖర్గే తీవ్ర ఆగ్రహం!
Politics· 21 Jul 2026

స్టూడెంట్స్‌పై లాఠీఛార్జ్.. రాజ్యసభలో ఖర్గే తీవ్ర ఆగ్రహం!

NEET పరీక్షల వివాదంపై జంతర్ మంతర్ వద్ద ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న వేలాది మంది విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుపై మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటే, ప్రభుత్వం వారిని కొట్టి, భయపెట్టి, ఆందోళనలను అణచివేయడానికి చూస్తోందని ఆరోపించారు. యువత గొంతును నొక్కేయాలని చూస్తున్నారని, ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని సభలో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

‘పుష్ప' బ్రిడ్జ్ ఎక్కడుందో మీకు తెలుసా?
Cinema· 21 Jul 2026

‘పుష్ప' బ్రిడ్జ్ ఎక్కడుందో మీకు తెలుసా?

AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మోతుగూడెం ఫోర్‌బే డ్యామ్ బ్రిడ్జ్ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అల్లూరి జిల్లా చింతూరు మండలంలో ఉన్న ఈ డ్యామ్‌ను స్థానికులు ‘పుష్ప బ్రిడ్జ్’ అని పిలుస్తారు. అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' చిత్రంలోని ఎర్రచందనం స్మగ్లింగ్, పోలీసు తనిఖీల సీన్లను ఇక్కడే చిత్రీకరించారు. సినిమా హిట్‌తో ఈ ప్రాంతం బాగా పాపులరయ్యింది.