Latest
మోదీ ఇంటి ముందు కూర్చున్న రాహుల్ గాంధీ, ప్రియాంక!
స్టూడెంట్స్ పై జరిగిన పోలీసుల లాఠీచార్జ్, పరీక్షల అక్రమాల వివాదానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు రోడ్డుపైకి వచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ సహా పలువురు MPలు ప్రధాని మోదీ ఇంటి ముందు అక్కడే రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు. నేతల నినాదాలతో ప్రధాని ఇంటి పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

చైనా IMOలో ఇండియాకు ఆరు మెడల్స్
చైనాలోని షాంఘైలో జరుగుతున్న 67వ ఇంటర్నేషనల్ మాథెమాటిక్స్ ఒలింపియాడ్ (IMO) ఈరోజుతో ముగియనుంది. ఈ ఒలింపియాడ్‌లో భారతీయ విద్యార్థులు మరోసారి అద్భుత ప్రతిభను కనబరిచారు. రెండు గోల్డ్ మెడల్స్ నాలుగు సిల్వర్ మెడల్స్ సాధించారు. గోల్డ్ మెడల్స్ సాధించినవారిలో ఆరవ్ గుప్తా, ఏబెల్ జార్జ్ మాథ్యూ ఉన్నారు. బైరవ్ మురుగన్, కనవ్ తల్వార్, సంజన ఫిలో చాకో, శ్రేయ శాంతను ముంధడ రజత పతకాలను గెలుచుకున్నారు. కనవ్ తల్వార్, ఆరవ్ గుప్తా, జార్జ్ మాథ్యూ గతంలో ఆస్ట్రేలియాలో జరిగిన IMO-2025లో స్వర్ణ పతకాలను సాధించినవారే.
ప్రధాని నివాసానికి రాహుల్ గాంధీ, ప్రియాంక పాదయాత్ర!
యువత వ్యతిరేక విధానాలు, పరీక్షల వివాదానికి నిరసనగా కాంగ్రెస్ నేతలు లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి పాదయాత్రగా బయల్దేరారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నేతృత్వంలో MPలంతా రోడ్డుపైకి వచ్చి తీవ్ర నిరసన తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ప్రధాని మోదీ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలతో హోరెత్తించారు.

మోదీ ఇంటిని ముట్టడించిన కాంగ్రెస్ నేతలు
నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యామంత్రి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీ ఇంటిని ముట్టడించారు. ఈ ధర్నాలో ప్రియాంక గాంధీ, ఖర్గే, కె.సి.వేణుగోపాల్ మోదీ నివాసం ముందు నిరసనకు దిగారు. చేతులకు సంకెళ్లు వేసుకొని కాంగ్రెస్ నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. దీంతో మోదీ ఇంటిముందు హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు: కేటీఆర్
TG: ‘ఇది కాలం తెచ్చిన కరువు కాదు..కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు’ అని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో నిర్వహించిన బీఆర్‌ఎస్ 'రైతు సదస్సు'లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో యూరియా కష్టాలు, కరెంటు కోతలు, సాగునీటి సమస్యలతో రైతులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ఇటీవల ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద గోడ కూలి ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతు కుటుంబాలకు బీఆర్‌ఎస్ తరఫున రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.20 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు.

ఇంటర్నెట్ లేకున్నా UPI పేమెంట్స్: NPCI
ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ పేమెంట్స్ చేసేలా 'నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా'(NPCI) కొత్త ఫీచర్‌ని తీసుకొస్తోంది. ఇకపై స్మార్ట్‌ఫోన్ లేదా వ్యాపారుల వద్ద ఉన్న PoS (పాయింట్ ఆఫ్ సేల్) మెషిన్లకు ఇంటర్నెట్ కనెక్షన్, సిగ్నల్ లేకపోయినా యూపీఐ ద్వారా ఈజీగా ప్రెమెంట్స్ చేయొచ్చు. ఈ విధానంలో నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్(NFC) టెక్నాలజీ ఆధారంగా కస్టమర్లు తమ ఫోన్‌ను PoS మెషిన్‌పై ట్యాప్ చేసి రూ.2,000 వరకు పేమెంట్ చేయవచ్చు. దీనికి PIN ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు.
స్టూడెంట్స్‌పై లాఠీఛార్జ్.. రాజ్యసభలో ఖర్గే తీవ్ర ఆగ్రహం!
NEET పరీక్షల వివాదంపై జంతర్ మంతర్ వద్ద ప్రశాంతంగా నిరసన తెలుపుతున్న వేలాది మంది విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుపై మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటే, ప్రభుత్వం వారిని కొట్టి, భయపెట్టి, ఆందోళనలను అణచివేయడానికి చూస్తోందని ఆరోపించారు. యువత గొంతును నొక్కేయాలని చూస్తున్నారని, ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని సభలో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
‘పుష్ప' బ్రిడ్జ్ ఎక్కడుందో మీకు తెలుసా?
AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మోతుగూడెం ఫోర్‌బే డ్యామ్ బ్రిడ్జ్ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అల్లూరి జిల్లా చింతూరు మండలంలో ఉన్న ఈ డ్యామ్‌ను స్థానికులు ‘పుష్ప బ్రిడ్జ్’ అని పిలుస్తారు. అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' చిత్రంలోని ఎర్రచందనం స్మగ్లింగ్, పోలీసు తనిఖీల సీన్లను ఇక్కడే చిత్రీకరించారు. సినిమా హిట్‌తో ఈ ప్రాంతం బాగా పాపులరయ్యింది.

బాల బాబాయ్ త్వరగా కోలుకో: Jr NTR
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'NBK111' షూటింగ్‌లో పాల్గొన్న నందమూరి బాలకృష్ణకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ను హాస్పిటల్‌కు తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేశారు. ఇది మైనర్ ఇన్జూరీ అని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ తన బాల బాబాయ్ ‘త్వరగా కోలుకోవాలి’ అని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.

‘జననాయగన్’..విడుదలకు ముందే రూ.15.22 కోట్లు
తమిళనాడు సీఎం, హీరో విజయ్ నటించిన చివరి చిత్రం 'జననాయగన్' జులై 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ముఖ్యమంత్రి అయ్యాక వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమా భారీ అంచనాలున్నాయి. 30 దేశాల్లో 8 వేల స్క్రీన్‌లలో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. తెలుగులో వచ్చిన 'భగవంత్ కేసరి' మూల కథ ఆధారంగా హెచ్.వినోద్ మార్పులు చేసి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు 'ఏ' సర్టిఫికేట్ జారీ చేయగా, 183 నిమిషాల లెన్త్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటికే రూ.15.22 కోట్లు వసూళ్లు సాధించింది.

స్టూడెంట్స్‌పై దాడికి సమాధానం చెప్పాల్సిందే- రాహుల్ గాంధీ
పేపర్ లీక్ వివాదం, స్టూడెంట్స్ పై జరిగిన దాడి అంశంపై ప్రతిపక్ష MPలతో కలిసి రాహుల్ గాంధీ లోక్‌సభ స్పీకర్‌ను కలిశారు. తమ భవిష్యత్తుపై న్యాయమైన ప్రశ్నలు అడిగిన స్టూడెంట్స్ పై పోలీసులు దాడి చేయడం దారుణమని, దీనిపై ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుపై మాట్లాడని పార్లమెంట్ ఎందుకని విమర్శించారు. యువత ఆందోళనను పక్కదారి పట్టనివ్వమని, ఈ సమస్యపై వీధుల్లోనూ, పార్లమెంట్‌లోనూ ప్రతిపక్షాలు పోరాడుతాయని స్పష్టం చేశారు.

కలకలం రేపుతున్న డెంగీ కేసులు
TG: కురుస్తున్న వర్షాల కారణంగా డెంగీ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల జిల్లాల్లో దోమల వ్యాప్తి పెరిగింది. పగటిపూట కుట్టే దోమల పట్ల ప్రజలు తీవ్ర జాగ్రత్తలు వహించాలని వైద్యారోగ్య శాఖ అధికారులు హెచ్చరించారు. పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, వారానికి ఒకసారి నీటి పాత్రలను శుభ్రం చేయాలని సూచించారు. తీవ్రమైన జ్వరం, ఒంటినొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను కలిసి రక్తపరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేశారు.
దమ్ముంటే రాష్ట్రానికి నిధులు తీసుకురావాలి
TG: మంత్రి పొన్నం ప్రభాకర్ BJP రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ ఉనికిని చాటుకోవడానికి నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఆయన ఏ సభలో సభ్యుడు కాకపోవడం వల్ల సొంత పార్టీ నాయకుల నుంచే తగిన ప్రాధాన్యం లభించకపోవడంతో నిరాశలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని పొన్నం ఫైరయ్యారు. ఇళ్ల నిర్మాణ పథకంలో కేంద్ర నిధులు ఉన్నాయని చెబుతున్న BJP నాయకులు, చేతనైతే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి అదనపు నిధులు తీసుకురావాలని సవాల్ విసిరారు.
ప్రొటెస్ట్‌లో పోలీస్ ఆఫీసర్ షాకింగ్ బిహేవియర్!
జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో ఒక పోలీస్ ఆఫీసర్ ప్రవర్తించిన తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రొటెస్ట్ చేస్తున్న ఒక మహిళ పట్ల పోలీస్ ఆఫీసర్ అసభ్యంగా తాకడమే కాకుండా, లాఠీతో దాడి చేశారు. ఆ తర్వాత మరో కొలీగ్‌తో కలిసి నవ్వడం వీడియోలో కనిపించడంతో, "మహిళలకు ఇచ్చే రక్షణ ఇదేనా?" అని నెటిజన్స్ సదరు పోలీసులపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు.

వర్షాకాలంలో బండి ఇన్సూరెన్స్ కంపల్సరీ
వర్షాలు, వరదలు, చెట్లు పడటం వంటి ఘటనలతో ఈ వర్షాకాలంలో వాహనాలకు నష్టం కలుగుతుంది. ఈ టైంలో కాంప్రహెన్సివ్ మోటార్ బీమా ఉంటేనే కాంపన్సేషన్ వస్తుందని నిపుణులు అంటున్నారు. నీటిలో ఆగిపోయిన వాహనాన్ని మళ్లీ స్టార్ట్ చేయొద్దని హెచ్చరిస్తున్నారు. ఇంజిన్‌లోకి నీరు చేరిన తర్వాత స్టార్ట్ చేయడం వల్ల కలిగే నష్టానికి 'ఇంజిన్ ప్రొటెక్షన్' యాడ్-ఆన్ ఉండాలంటున్నారు. ఈ ప్రొటెక్షన్ లేకపోతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ చేసే అవకాశముందని అంటున్నారు.

స్ట్రెస్ తగ్గించే Gen-Z సీక్రెట్
ప్రస్తుత పరుగుల జీవితంలో తీవ్ర మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్న Gen-Z యువత ఒక కొత్త ట్రెండ్ ఎంచుకున్నారు. హాస్పిటల్ చుట్టూ తిరగకుండా స్ట్రెస్‌ను తగ్గించుకోవడం కోసం యాంటీ యాంగ్జైటీ జ్యువెలరీని ఉపయోగిస్తున్నారు వేళ్లతో తిప్పే స్పిన్నర్ రింగ్స్, బ్రీథింగ్ పెండెంట్లు, ప్రత్యేక బ్రాస్‌లెట్లు ముఖ్యమైనవి. ఒత్తిడి అనిపించినప్పుడు వీటితో శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల కాన్సంట్రేషన్ పెరిగి, నర్వ్ సిస్టం శాంతిస్తుంది. నలుగురిలో ఉంటూ, సీక్రెట్‌గా స్ట్రెస్ తగ్గించుకునే ఈ స్టైలిష్ ట్రెండ్ సోషల్ మీడియాలో వైరలవుతోంది

సోనమ్ వాంగ్‌చుక్‌కు బిగ్ రిలీఫ్- ఢిల్లీ హైకోర్టు
సోనమ్ వాంగ్‌చుక్‌కు ఢిల్లీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఆయనను వెంటనే డిశ్చార్జ్ చేసి, వారు కోరుకున్న మేదాంత హాస్పిటల్‌కు షిఫ్ట్ చేయాలని కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. ఈ ఫేవరబుల్ ఆర్డర్ రావడంపై సోనమ్ వైఫ్ గీతాంజలి సంతోషం వ్యక్తం చేస్తూ ఢిల్లీ హైకోర్టుకు థాంక్స్ చెప్పారు. అలాగే తమ తరఫున ఫైట్ చేసిన లాయర్లు అఖిల్ సిబల్, బాహులి శర్మ టీమ్‌కు ప్రత్యేకంగా థాంక్స్ చెప్తూ, చాలా తక్కువ టైమ్‌లో ఈ విజయం సాధించడం గ్రేట్ అని ట్వీట్ చేశారు.

తెలంగాణ..Rising or Falling?
‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ రాష్ట్రం 13వ స్థానానికి దిగజారడంపై BRS పార్టీ తన 'X' అకౌంట్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడింది. కేసీఆర్ పాలనలో పెట్టుబడులకు దేశంలోనే నెంబర్ 1 స్థానంలో వెలిగిన తెలంగాణ రేవంత్ రెడ్డి పాలనలో నేరాలు, దోపిడీలకు అడ్డాగా మారిందని ఆరోపించింది. ప్రభుత్వం పెట్టుబడిదారులను బెదిరింపులు, వసూళ్లతో భయపెడుతోందని, అందుకే ర్యాంకింగ్స్‌లో రాష్ట్రం పడిపోయిందని విమర్శిస్తూ "తెలంగాణ రైజ్ అవ్వడం లేదు, ఫాలింగ్ అవుతోంది" అనే పోస్టర్‌ను షేర్ చేశారు.
ఈ కస్టమర్, డెలివరీ బాయ్ చేసిన పనికి ఎవ్వరయిన ఫిదా అవుతారు!
ముంబైకి చెందిన అనుజ్ రావత్ అనే వ్యక్తి ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసి ఒక మంచి పని చేశారు. తాను ఆర్డర్ చేసిన ఫుడ్‌ని తను తినకుండా, జంతర్ మంతర్ దగ్గర ఆకలితో ఉన్న వారికి లేదా అవసరం ఉన్నవారికి ఇవ్వాలని జోమాటో డెలివరీ బాయ్‌ని రిక్వెస్ట్ చేశారు. ఆన్‌లైన్‌లోనే బిల్ అంతా పే చేసి, ఆకలితో ఉన్న స్టూడెంట్స్ కి హెల్ప్ చేసిన ఆ కస్టమర్ మంచి మనసుని, ఆర్డర్ సరిగ్గా అందించిన డెలివరీ బాయ్‌ని నెటిజన్లు మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.

హైదరాబాద్‌లో ఒకే రోజు 4 నిరసనలు, ఒకే లక్ష్యం!
ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ ఛలో పార్లమెంటుపై కేంద్ర అణచివేత చర్యలు, విద్యార్థులపై లాఠీచార్జ్ కి నిరసనగా హైదరాబాద్ లో ఈ రోజు (జూలై 21న) 4 వేర్వేరు ఆందోళనలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్, 4 గంటలకు గచ్చిబౌలి, 5 గంటలకు సచివాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు మార్చ్, 5:30కు నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో భారీ ర్యాలీలు ఉంటాయి. ప్రజాస్వామ్య పరిరక్షణ అనే ఏకైక లక్ష్యంతో ఈ నాలుగు కార్యక్రమాలను సివిల్ సొసైటీ అంటే వివిధ వర్గాల ప్రజలు చేపట్టారు. విద్యార్థులు, మేధావులు, తల్లిదండ్రులు ఈ నిరసనల్లో పాల్గొంటారు.

నీళ్లపై కనీస అవగాహన లేదు
TG: కాంగ్రెస్ ప్రభుత్వానికి నీళ్ల మీద కనీస అవగాహన లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. దేవాదుల BRS కట్టిన ప్రాజెక్టు.. ఆ విషయం కూడా కాంగ్రెస్ నాయకులకు తెలియదన్నారు. దేవాదుల ప్రాజెక్టులోని 38.16 TMCల నీటిని ఎత్తుతామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారని తెలిపారు. 22 రిజర్వాయర్లు నింపుతామని, ప్రతి ఎకరాకు సాగునీరు ఇస్తామని చెప్పారని పేర్కొన్నారు. మంత్రి మాటలు నమ్మి రైతులు నారు పోసుకున్నారని పేర్కొన్నారు. ఇప్పుడేమో ప్రాజెక్టుల నుంచి నీళ్లు విడుదల చేయడంలేదని ఫైరయ్యారు.