Latest

స్టీరింగ్ మీదే గుండెపోటు- 100 ప్రాణాలు కాపాడిన హీరో లక్ష్మణ్
జగిత్యాల జిల్లా మద్దూనూరు నుంచి వస్తున్న RTC బస్సు డ్రైవర్ లక్ష్మణ్‌కు ప్రయాణం మధ్యలో ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. తీవ్ర నొప్పితోనే.. ఆయన బస్సును సురక్షితంగా రోడ్డు పక్కకు నిలిపి స్టీరింగ్‌పైనే పడిపోయారు. దీంతో ఆ టైంలో అందులో ప్రయాణిస్తున్న 100 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడబడ్డాయి.సమయానికి 108 రాకపోవడంతో ఆటోలో ఆయనను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు చికిత్స పొందుతున్నారు. ట్విస్ట్ ఏంటంటే Mondayతో రిటైర్ అవ్వాల్సిన లక్ష్మణ్ అనారోగ్యంలో ఉన్నా డిపో అధికారులు బలవంతంగా డ్యూటీ వేశారు.

కొత్తపేట డిగ్రీ కాలేజీలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం
తెలుగు భాషకు పునర్జన్మ ఇచ్చిన గిడుగు రామ్మూర్తి పంతుల్ని గుర్తుచేసుకునేందుకు కొత్తపేటలో ప్రత్యేక వేడుకలు జరిగాయి. విశ్వకవి వేమన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం తెలుగు భాషా దినోత్సవం నిర్వహించారు. ఇంచార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ డి.సి.హెచ్. పాపారావు గిడుగు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. <br>ఆయన మాట్లాడుతూ – "జనం మాట్లాడే తెలుగును నిలబెట్టిన గిడుగు సేవలు మరువలేనివి. ప్రజలకు అర్థమయ్యే భాషలో తెలుగు అభివృద్ధి చెందాలని ఆయన చేసిన కృషి ఆదర్శమని" అని అన్నారు.

ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ర్యాలీ వీఆర్ఓ
భూమి మ్యూటేషన్ పేరుతో.. లంచం డిమాండ్ చేసిన వీఆర్ఓను ఏసీబీ పట్టేసింది. ఆత్రేయపురం మండలం ర్యాలీ వీఆర్ఓ నాగేశ్వరరావు.. 0.09 ఎకరాల భూమి మ్యూటేషన్ దరఖాస్తును ఫార్వర్డ్ చేసేందుకు లంచం డిమాండ్ చేశాడు. ఏసీబీ అధికారుల వివరణ ప్రకారం.. రూ. 16,500 లంచం స్వీకరించి షర్ట్ జేబులో పెట్టుకున్న సందర్భంలో ఆయన పట్టుబడ్డారు. లంచం మొత్తం, మ్యూటేషన్ ఫైల్ ఏసీబీ స్వాధీనం చేసుకుందని రాజమహేంద్రవరం ఏసీబీ ఎస్పీ చెప్పారు – కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

ఇక రామేశ్వరం పల్లి PACS కొత్త చైర్మన్ ఇంద్రకరణ్ రెడ్డి
రామేశ్వరం పల్లి PACS కొత్త పాలకవర్గం ప్రమాణం చేసింది. కామారెడ్డి జిల్లాలో శనివారం ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, ఎంపీ సురేష్ కుమార్ షట్కర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బద్దం ఇంద్రకరణ్ రెడ్డి నూతన చైర్మన్‌గా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ – కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికే ప్రాధాన్యం ఇస్తోందన్నారు. కొత్త చైర్మన్ మాట్లాడుతూ "రైతు బలపడితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలంగా మారుతుంది. వ్యవసాయ రంగానికి అన్ని విధాలా సేవ చేస్తా" అని చెప్పారు.

TCలు ఇవ్వకుండా సతాయిస్తున్న Wisdom
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని విస్డం కాలేజీలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కాలేజీ యాజమాన్యం వారి టీసీలు (ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు) ఇవ్వకుండా పలుమార్లు తిప్పించుకుంటోందని ఆరోపిస్తూ.. శనివారం విద్యార్థులు ధర్నాకు దిగారు. విస్డం కళాశాల ఇతర ప్రాంతాలకు అమ్ముడుపోయిన తర్వాత.. టీసీల కోసం వెళ్తే "రేపు రండి" అని వాయిదా వేస్తున్నారని విద్యార్థులు ఆందోళనకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని యాజమాన్యంతో మాట్లాడగా.. "రేపు ఉదయం 10 గంటలకు ఇస్తాం" అని హామీ ఇచ్చారు.

సామాజిక సేవకు డాక్టరేట్.. దేవర వినోద్కు అరుదైన గౌరవం!
సామాజిక సేవే రంగంలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న దేవర వినోద్కు ఇప్పుడు అరుదైన గౌరవం దక్కింది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం ఇందిరా నగర్‌కు చెందిన ఇతని సేవలను గుర్తించి.. యునైటెడ్ అమెరికన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో "డాక్టర్ ఆఫ్ సోషల్ సర్వీస్" గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. శనివారం పుదుచ్చేరి కంబన్ కలైయరంగం ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. యూనివర్సిటీ డైరెక్టర్, TN మాజీ న్యాయమూర్తి Dr.కె. వెంకటేశన్, TN ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.ఆర్. శంపత్ (IAS), , ఐరాస ప్రతినిధులు పాల్గొన్నారు.

తల్లిదండ్రులు “మా కాలంలో…” అని ఎందుకు మొదలుపెడతారు?
“మా కాలంలో ఇలా ఉండేది కాదు..” అని తల్లిదండ్రులు చెప్పడం మనలో చాలామంది వినే ఉంటాం. కానీ వాళ్లు ఇలా ఎందుకు మాట్లాడతారు? మనం పెరిగే సమయంలో మన ప్రపంచం వేగంగా మారిపోతుంది. కానీ తల్లిదండ్రులు తమ అనుభవాలనే మనకు సరైన మార్గంగా భావించడం సహజం. తాము ఎదుర్కొన్న కష్టాలు, చేసిన తప్పులు మనకు రాకూడదనే ఉద్దేశంతో సలహాలు ఇస్తుంటారు. అదే సమయంలో పిల్లల ప్రపంచం తమ కాలంతో పోలిస్తే చాలా మారిపోయిందని అర్థం చేసుకోవడం కష్టం అవుతుంది. అందుకే “మా కాలంలో…” అనేది కేవలం పోలిక కాదు.. వాళ్ల అనుభవం, భయం, ప్రేమ అన్నీ కలిసిన మాట.

2026లో ఉన్నా.. మళ్లీ 2016కి వెళ్లిపోయారా?
2026 వచ్చేసింది.. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలామంది మళ్లీ 2016 రోజుల్లోకి వెళ్లిపోతున్నారు! 😂 “2026 is the new 2016” అంటూ నాస్టాల్జియా ట్రెండ్ మళ్లీ వైరల్ అవుతోంది. అప్పట్లో పాపులర్ అయిన Snapchat Filters, పాటలు, ఫ్యాషన్, మీమ్స్, ఛాలెంజ్‌లను Gen Z మళ్లీ షేర్ చేస్తోంది. అప్పటి ఇంటర్నెట్ కల్చర్‌ను గుర్తు చేసుకుంటూ పాత ఫొటోలు, జ్ఞాపకాలను కూడా పోస్టు చేస్తున్నారు. కొత్త ట్రెండ్స్ ఎన్ని వచ్చినా.. 2016 నాటి ఆ ఓల్డ్ ఇంటర్నెట్ వైబ్‌కు మాత్రం ఇంకా క్రేజ్ తగ్గలేదన్నమాట! ❤️

“Delulu is the Solulu”.. అసలు దీని అర్థం ఏంటి?🤔
“Delulu is the Solulu”.. సోషల్ మీడియాలో ఈ మాట ఎప్పుడైనా చూశారా..? అసలు డెలులు అంటే డెల్యూషనల్ నుంచి వచ్చిన జెన్ జీ స్లాంగ్. నిజంగా జరిగిందా లేదా అనేది పక్కనపెట్టి.. మనకు నచ్చినట్టు ఊహించుకుని, అదే జరుగుతుందని నమ్మేయడాన్ని సరదాగా డెలులు అంటారు. ఇక సొలులు అంటే సొల్యూషన్కి ఫన్నీ వెర్షన్. “Delusional is the solution” అంటే “ఎలాంటి కష్టపరిస్థితుల్లోనైనా మనకు నచ్చిన భ్రమలో లేదా పాజిటివ్ ఆలోచనల్లో బతకడమే సమస్యకు పరిష్కారం” అని భావించడం. కలలు కనడానికి ట్యాక్స్ ఏం లేదుగా బ్రో.. సో నచ్చినట్టు కనేద్దాం! 😂

“నేను బాగున్నా”.. నిజంగా బాగున్నామా?
మనసులో ఏదో బాధగా ఉంటుంది.. కానీ ఎవరైనా “ఏమైంది?” అని అడిగితే మాత్రం వెంటనే “ఏం లేదు.. నేను బాగున్నా” అని చెప్పేస్తాం. అసలు ఎందుకు? మన బాధను బయటపెడితే ఎదుటివాళ్లు మనల్ని బలహీనంగా చూస్తారేమో, ఎక్కువగా ప్రశ్నిస్తారేమో అనే ఆలోచన మనల్ని ఆపొచ్చు. కొన్నిసార్లు మన సమస్యను ఎలా చెప్పాలో తెలియక కూడా మౌనంగా ఉండిపోతాం. కానీ ఇలా బాధను ఎప్పుడూ మనలోనే దాచుకోవడం వల్ల ఒత్తిడి, ఒంటరితనం మరింత పెరగొచ్చు. అందుకే “నేను బాగున్నా” అనేది కొన్నిసార్లు నిజమైన సమాధానం కాదు.. మనసు దాచుకున్న మాట కావచ్చు.

సంపాదన పెరిగింది.. సమయం ఎక్కడికి పోయింది?
జీతం పెరిగితే జీవితం మరింత సౌకర్యంగా ఉంటుందని అనుకుంటాం. కానీ ఆదాయం పెరిగే కొద్దీ ఖర్చులు, బాధ్యతలు, పని ఒత్తిడి కూడా పెరుగుతుంటాయి. మంచి ఇల్లు, కారు, ఖరీదైన జీవనశైలి కోసం ఖర్చులు పెంచుకుంటాం. ఆ జీవనశైలిని కొనసాగించేందుకు ఇంకా ఎక్కువ సమయం పని చేయాల్సి వస్తుంది. పైగా ఇతరులతో పోల్చుకోవడం కూడా ఈ పరుగును పెంచుతుంది. చివరికి డబ్బు పెరిగినా.. మన కోసం మిగిలే సమయం తగ్గిపోవచ్చు. అందుకే మంచి జీవితం అంటే ఎక్కువ సంపాదించడమేనా? లేక సంపాదించిన డబ్బుతో ప్రశాంతంగా జీవించే సమయం ఉండటమా?
నేపాల్ వరదల్లో మిరాకిల్
2026 ఆగస్టు 26న నేపాల్-టిబెట్ బార్డర్‌లో గ్లేసియర్ పగిలి భయంకరమైన ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చాయి. ఈ వరద దెబ్బకి చుట్టుపక్కల బిల్డింగ్స్, వెహికల్స్ అన్నీ కొట్టుకుపోయినా, ఒక లైట్ గ్రీన్ కలర్ ఇల్లు మాత్రం అస్సలు డ్యామేజ్ అవ్వకుండా అలానే నిలబడింది. ఆ టైమ్‌లో ఇంటి బాల్కనీలో ఇరుక్కుపోయిన 8 మంది ఫ్యామిలీ మెంబర్స్‌ని రెస్క్యూ టీమ్ కాపాడింది. అంత పెద్ద ఫ్లడ్‌ను తట్టుకుని ఇల్లు నిలబడటంతో, ఆ హౌస్ డిజైన్ చేసిన ఇంజనీర్‌ను సోషల్ మీడియాలో నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

జగిత్యాలలో 1.5లక్షల ఓటర్లకు నోటీసులు!
జగిత్యాలలో SIR కసరత్తు మొదలైంది. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో అనామలీస్ (Anomalies), నో మ్యాపింగ్ కేటగిరీల్లో గుర్తించిన ప్రతి ఓటరుకు నోటీసులు అందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్. లత మాట్లాడుతూ జిల్లాలో సుమారు 40 వేల నో మ్యాపింగ్, 1.52 లక్షల అనామలీస్ ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటికే నోటీసుల పంపిణీ, విచారణ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు.

పర్లాకిమిడి కోటలో భాషా దినోత్సవం.. గిడుగుకు నివాళి!
తెలుగు భాషకు పునర్జన్మ ఇచ్చిన గిడుగు రామ్మూర్తి పంతులను గుర్తుచేసుకునేందుకు పర్లాకిమిడి కోట ముఖద్వారం వద్ద ప్రత్యేక వేడుకలు జరిగాయి. ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు తెలుగు సాహిత్య ప్రముఖుల వేషధారణతో అందరినీ ఆకట్టుకున్నారు. ప్రధానోపాధ్యాయులు సనపల వైకుంఠరావు మాట్లాడుతూ – "తెలుగు భాషను సామాన్యులకు చేరువ చేసిన గిడుగు సేవలు చిరస్మరణీయం. పర్లాకిమిడి సంస్థానంలో ఆయన సేవలకు గుర్తుగా ఇక్కడ వేడుకలు జరగడం విశేషం" అని అన్నారు.

ఎమ్మెల్యే రాజేష్ రెడ్డికి విద్యార్థినుల రాఖీలు!
రాఖీ పౌర్ణమి సందర్భంగా నాగర్కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డికి విద్యార్థినులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. సరస్వతి శిశుమందిర్ పాఠశాల విద్యార్థినులు ఎమ్మెల్యేను ఆత్మీయంగా కలిసి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ – విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలు సాధించాలని, సోదర–సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలు ఎల్లప్పుడూ కొనసాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జక్కా రాజ్‌కుమార్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు వినోద్ పాల్గొన్నారు.

జన్నారం క్లస్టర్‌కు కొత్త ఏఈవో అక్రమ్..
వార్త:మంచిర్యాల జిల్లా జన్నారం క్లస్టర్ ఏఈఓగా అక్రమ్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన ప్రస్తుతం సింగరాయిపేట్ ఏఈఓగా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు జన్నారం క్లస్టర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే చింతగూడ ఏఈఓగా పనిచేస్తున్న లవన్ కు సింగరాయిపేట్ ఏఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా అక్రమ్ మాట్లాడుతూ – "రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను" అని స్పష్టం చేశారు.

వేంసూరుకి కొత్త ఎస్ఐ ప్రదీప్.. కవిత ఖమ్మం వీఆర్‌కు షిఫ్ట్!
వేంసూరు పోలీస్ స్టేషన్లో కొత్త ఫేస్. పి. ప్రదీప్ వేంసూరు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన గతంలో సత్తుపల్లి పట్టణ ఎస్ఐగా పనిచేశారు. ఇప్పుడు వేంసూరు ప్రజల భద్రత ఆయన బాధ్యత. ఇదివరకు ఇక్కడ ఎస్ఐగా ఉన్న బి. కవిత ఖమ్మం సీపీ కార్యాలయం పరిధిలోని వీఆర్‌కు బదిలీ అయ్యారు. కొత్త ఎస్ఐ ప్రదీప్ మాట్లాడుతూ – "మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తాను" అని స్పష్టం చేశారు.

నెల్లూరులో Sept 5,6న విలేజీ రిపోర్టర్లకు ట్రయినింగ్..
విలేజీ రిపోర్టింగ్లో టాలెంటును డెవలప్ చేసుకోవాలని అనుకునేవారికి మంచి గోల్డెన్ ఛాన్స్. నెల్లూరు జిల్లా గ్రామీణ విలేఖరులకు రాష్ట్ర సి.ఆర్. మీడియా అకాడమీ ఆధ్వర్యంలో, నెల్లూరు జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో , సెప్టెంబర్ 5, 6 తేదీల్లో రెండు రోజుల పాటు ట్రయినింగ్ ఇస్తారు. ఇందులో విలేజీ రిపోర్టింగ్ మెళకువలు, క్రైమ్ రిపోర్టింగ్, పత్రికా భాష, డెస్క్ ఆశించే ప్రమాణాలు అనే సబ్జెక్టులు ఉన్నాయి. సెప్టెంబరు 4 లోపు ఈ <a href="https://docs.google.com/forms/d/e/1FAIpQLScWUWjiKA-BCB42d9JE9TWbMV6b-6qaG3Uci0erw_Z9X1sdVg/viewform?pli=1">లింకు</a>లో రిజిస్టర్ చేసుకోవాలని అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్ చెప్పారు.

'స్పిరిట్' వివాదంపై దీపికా కౌంటర్!
ప్రభాస్ 'స్పిరిట్' సినిమా వివాదంపై దీపికా పదుకొణె స్పందించారు. 10% లాభాల వాటాతో పాటు రోజుకు 8 గంటల వర్క్ టైమింగ్స్ డిమాండ్ చేయడం వల్లే దీపికాను తొలగించి, ఆమె స్థానంలో తృప్తి దిమ్రిని సెలెక్ట్ చేశామని ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగా చెప్పారు. ఈ కామెంట్స్‌పై స్పందిస్తూ.. మేల్ ఈగో, రెమ్యునరేషన్ అసమానతలను తప్పుబడుతూ వచ్చిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను దీపికా లైక్ చేశారు. హీరోల కంటే తన మార్కెట్ సక్సెస్ బాగున్నప్పుడు, సమాన పారితోషికం అడగడం తన హక్కు అని ఆమె పరోక్షంగా స్పష్టం చేశారు.

మక్తల్ ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షునిగా రాఘవేందర్ ఎన్నిక
మక్తల్ మండల ఉప సర్పంచులకు కొత్త నాయకత్వం వచ్చేసింది. ఉప సర్పంచ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ ఆదేశాల మేరకు నారాయణపేట జిల్లా అధ్యక్షులు మ్యాతరి గోపాల్ ఆధ్వర్యంలో శనివారం మక్తల్ మండల కమిటీని ఎన్నుకున్నారు. కొత్త మండల కమిటీ ఇదే: అధ్యక్షులు – రాఘవేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు – కె. సత్యన గౌడ్, ప్రధాన కార్యదర్శి – నంబర్ తిరుపతి, కోశాధికారి – ఎం. సురేష్, జిల్లా కమిటీ సభ్యులు – వాకిటి రమేష్,,, నూతన కమిటీ అధ్యక్షుడు రాఘవేందర్ రెడ్డి షమండలంలోని ఉప సర్పంచుల సమస్యలపై పోరాడతానని అన్నారు.

NEET PG–2026 ప్రవేశ పరీక్షకు ఫుల్ రెడీ : కలెక్టర్
దేశవ్యాప్తంగా రేపు జరగనున్న నీట్ పీజీ–2026 ప్రవేశ పరీక్షకు జగిత్యాల లోనూ అవసరమైన ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు. కొడిమ్యాల మండలం నాచుపల్లిలోని JNTUH కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. ఉదయం 9 am నుంచి 12:30 pm వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు 7am నుంచి 8:30 am మధ్య పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. పోలీసు బందోబస్తు, నిరంతర విద్యుత్, వైద్య, రవాణా, ఇంటర్నెట్ సదుపాయాలతో పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు.