Latest

జగిత్యాలలో 1.5లక్షల ఓటర్లకు నోటీసులు!
జగిత్యాలలో SIR కసరత్తు మొదలైంది. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో అనామలీస్ (Anomalies), నో మ్యాపింగ్ కేటగిరీల్లో గుర్తించిన ప్రతి ఓటరుకు నోటీసులు అందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్. లత మాట్లాడుతూ జిల్లాలో సుమారు 40 వేల నో మ్యాపింగ్, 1.52 లక్షల అనామలీస్ ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటికే నోటీసుల పంపిణీ, విచారణ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు.

పర్లాకిమిడి కోటలో భాషా దినోత్సవం.. గిడుగుకు నివాళి!
తెలుగు భాషకు పునర్జన్మ ఇచ్చిన గిడుగు రామ్మూర్తి పంతులను గుర్తుచేసుకునేందుకు పర్లాకిమిడి కోట ముఖద్వారం వద్ద ప్రత్యేక వేడుకలు జరిగాయి. ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు తెలుగు సాహిత్య ప్రముఖుల వేషధారణతో అందరినీ ఆకట్టుకున్నారు. ప్రధానోపాధ్యాయులు సనపల వైకుంఠరావు మాట్లాడుతూ – "తెలుగు భాషను సామాన్యులకు చేరువ చేసిన గిడుగు సేవలు చిరస్మరణీయం. పర్లాకిమిడి సంస్థానంలో ఆయన సేవలకు గుర్తుగా ఇక్కడ వేడుకలు జరగడం విశేషం" అని అన్నారు.

ఎమ్మెల్యే రాజేష్ రెడ్డికి విద్యార్థినుల రాఖీలు!
రాఖీ పౌర్ణమి సందర్భంగా నాగర్కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డికి విద్యార్థినులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. సరస్వతి శిశుమందిర్ పాఠశాల విద్యార్థినులు ఎమ్మెల్యేను ఆత్మీయంగా కలిసి రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ – విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలు సాధించాలని, సోదర–సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలు ఎల్లప్పుడూ కొనసాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జక్కా రాజ్‌కుమార్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు వినోద్ పాల్గొన్నారు.

జన్నారం క్లస్టర్‌కు కొత్త ఏఈవో అక్రమ్..
వార్త:మంచిర్యాల జిల్లా జన్నారం క్లస్టర్ ఏఈఓగా అక్రమ్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన ప్రస్తుతం సింగరాయిపేట్ ఏఈఓగా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు జన్నారం క్లస్టర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే చింతగూడ ఏఈఓగా పనిచేస్తున్న లవన్ కు సింగరాయిపేట్ ఏఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా అక్రమ్ మాట్లాడుతూ – "రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను" అని స్పష్టం చేశారు.

వేంసూరుకి కొత్త ఎస్ఐ ప్రదీప్.. కవిత ఖమ్మం వీఆర్‌కు షిఫ్ట్!
వేంసూరు పోలీస్ స్టేషన్లో కొత్త ఫేస్. పి. ప్రదీప్ వేంసూరు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన గతంలో సత్తుపల్లి పట్టణ ఎస్ఐగా పనిచేశారు. ఇప్పుడు వేంసూరు ప్రజల భద్రత ఆయన బాధ్యత. ఇదివరకు ఇక్కడ ఎస్ఐగా ఉన్న బి. కవిత ఖమ్మం సీపీ కార్యాలయం పరిధిలోని వీఆర్‌కు బదిలీ అయ్యారు. కొత్త ఎస్ఐ ప్రదీప్ మాట్లాడుతూ – "మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తాను" అని స్పష్టం చేశారు.

నెల్లూరులో Sept 5,6న విలేజీ రిపోర్టర్లకు ట్రయినింగ్..
విలేజీ రిపోర్టింగ్లో టాలెంటును డెవలప్ చేసుకోవాలని అనుకునేవారికి మంచి గోల్డెన్ ఛాన్స్. నెల్లూరు జిల్లా గ్రామీణ విలేఖరులకు రాష్ట్ర సి.ఆర్. మీడియా అకాడమీ ఆధ్వర్యంలో, నెల్లూరు జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో , సెప్టెంబర్ 5, 6 తేదీల్లో రెండు రోజుల పాటు ట్రయినింగ్ ఇస్తారు. ఇందులో విలేజీ రిపోర్టింగ్ మెళకువలు, క్రైమ్ రిపోర్టింగ్, పత్రికా భాష, డెస్క్ ఆశించే ప్రమాణాలు అనే సబ్జెక్టులు ఉన్నాయి. సెప్టెంబరు 4 లోపు ఈ <a href="https://docs.google.com/forms/d/e/1FAIpQLScWUWjiKA-BCB42d9JE9TWbMV6b-6qaG3Uci0erw_Z9X1sdVg/viewform?pli=1">లింకు</a>లో రిజిస్టర్ చేసుకోవాలని అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేశ్ కుమార్ చెప్పారు.

'స్పిరిట్' వివాదంపై దీపికా కౌంటర్!
ప్రభాస్ 'స్పిరిట్' సినిమా వివాదంపై దీపికా పదుకొణె స్పందించారు. 10% లాభాల వాటాతో పాటు రోజుకు 8 గంటల వర్క్ టైమింగ్స్ డిమాండ్ చేయడం వల్లే దీపికాను తొలగించి, ఆమె స్థానంలో తృప్తి దిమ్రిని సెలెక్ట్ చేశామని ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగా చెప్పారు. ఈ కామెంట్స్‌పై స్పందిస్తూ.. మేల్ ఈగో, రెమ్యునరేషన్ అసమానతలను తప్పుబడుతూ వచ్చిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను దీపికా లైక్ చేశారు. హీరోల కంటే తన మార్కెట్ సక్సెస్ బాగున్నప్పుడు, సమాన పారితోషికం అడగడం తన హక్కు అని ఆమె పరోక్షంగా స్పష్టం చేశారు.

మక్తల్ ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షునిగా రాఘవేందర్ ఎన్నిక
మక్తల్ మండల ఉప సర్పంచులకు కొత్త నాయకత్వం వచ్చేసింది. ఉప సర్పంచ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ ఆదేశాల మేరకు నారాయణపేట జిల్లా అధ్యక్షులు మ్యాతరి గోపాల్ ఆధ్వర్యంలో శనివారం మక్తల్ మండల కమిటీని ఎన్నుకున్నారు. కొత్త మండల కమిటీ ఇదే: అధ్యక్షులు – రాఘవేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు – కె. సత్యన గౌడ్, ప్రధాన కార్యదర్శి – నంబర్ తిరుపతి, కోశాధికారి – ఎం. సురేష్, జిల్లా కమిటీ సభ్యులు – వాకిటి రమేష్,,, నూతన కమిటీ అధ్యక్షుడు రాఘవేందర్ రెడ్డి షమండలంలోని ఉప సర్పంచుల సమస్యలపై పోరాడతానని అన్నారు.

NEET PG–2026 ప్రవేశ పరీక్షకు ఫుల్ రెడీ : కలెక్టర్
దేశవ్యాప్తంగా రేపు జరగనున్న నీట్ పీజీ–2026 ప్రవేశ పరీక్షకు జగిత్యాల లోనూ అవసరమైన ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు. కొడిమ్యాల మండలం నాచుపల్లిలోని JNTUH కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. ఉదయం 9 am నుంచి 12:30 pm వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు 7am నుంచి 8:30 am మధ్య పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. పోలీసు బందోబస్తు, నిరంతర విద్యుత్, వైద్య, రవాణా, ఇంటర్నెట్ సదుపాయాలతో పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు.

బొల్లాపల్లిలో KGBV న్యూ బిల్డింగ్ ఓపెనింగ్
AP : పల్నాడు జిల్లా బొల్లాపల్లిలో రూ.1.23 కోట్లతో కొత్తగా కట్టిన KGBV భవనాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. అమ్మాయిలకి క్వాలిటీ ఎడ్యుకేషన్, సేఫ్ హాస్టల్ ఫెసిలిటీస్ ఇవ్వడంలో కేజీబీవీలు కీ రోల్ ప్లే చేస్తున్నాయని చెప్పారు. హైయర్ స్టడీస్‌కి గర్ల్స్‌ని ఎంకరేజ్ చేసేందుకు గవర్నమెంట్ చాలా స్కీమ్స్ తెస్తోందని, వారి ఫ్యూచర్‌కి ఇవి గట్టి పునాది వేస్తున్నాయని తెలిపారు.

పిల్లల హక్కుల రక్షణకు అందరూ కలవాలి! 👶
AP : తాడేపల్లి డోలాస్‌నగర్‌లో గుడ్ షెఫర్డ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాలల హక్కులపై అవేర్‌నెస్ ప్రోగ్రామ్ నిర్వహించారు. చైల్డ్ మ్యారేజెస్, స్కూల్ డ్రాపౌట్స్, సెక్షువల్ హరాస్‌మెంట్స్ ఆపడానికి గవర్నమెంట్ డిపార్ట్‌మెంట్స్, ఎన్జీవోలు, పేరెంట్స్, మీడియా కలిసి పనిచేయాలని సంస్థ మేనేజర్ షాలిని చెప్పారు. గ్రామ స్థాయిలో సమస్యలను ఐడెంటిఫై చేసి యాక్షన్ తీసుకోవాలని, బాధితులైన పిల్లల పర్సనల్ డిటైల్స్ గోప్యంగా ఉంచాలని మీడియాను కోరారు.

వృద్ధులు, దివ్యాంగులకు ఫాస్ట్ సొల్యూషన్స్! 🏛️
AP : గుంటూరు కలెక్టరేట్‌లో వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. వివిధ ప్రాంతాల ప్రజలు పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, రేషన్, హెల్త్ ప్రాబ్లమ్స్, సర్టిఫికెట్ల కోసం అర్జీలు ఇచ్చారు. జిల్లా కలెక్టర్ సి.ఎం.సాయికాంత్ వర్మ దగ్గరుండి అర్జీలు తీసుకుని, ఆఫీసుల చుట్టూ తిప్పకుండా సమస్యలను స్పీడ్‌గా సాల్వ్ చేయాలని అధికారులకు ఆర్డర్స్ ఇచ్చారు. సమస్యలు క్లియర్ చేయాలని, వృద్ధులు, దివ్యాంగులతో హెల్ప్‌ఫుల్‌గా ఉండాలని చెప్పారు.
డెలివరీ బాయ్‌ని ఏడిపించిన పోలీసులు! 💔
హైదరాబాద్‌లో రోడ్డుపై పార్క్ చేసిన జెప్టో డెలివరీ బాయ్ బైక్‌ను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. "నా భార్య హాస్పిటల్‌లో ఉంది సర్, ఈ ఒక్క డెలివరీ పూర్తి చేసి వస్తాను" అని సదరు డెలివరీ బాయ్ ఎంతగానో వేడుకున్నప్పటికీ పోలీసులు వినకుండా టోయింగ్ వెహికల్‌లో బైక్‌ను తీసుకెళ్లారు. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉన్న డెలివరీ బాయ్ పట్ల పోలీసులు కనీస మానవత్వం చూపలేదని, వారి ప్రవర్తన అస్సలు సరికాదని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా ఫైర్ అవుతున్నారు.

రేట్లు ఆకాశంలో.. కూటమి ప్రభుత్వంపై YCP ఫైర్
AP : TDP కూటమి పవర్‌లోకి వచ్చాక రైస్, పప్పులు, ఆయిల్, వెజిటబుల్స్, షుగర్ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయని YCP మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి విమర్శించారు. గవర్నమెంట్ పట్టించుకోకపోవడంతో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ జేబులకు చిల్లులు పడుతున్నాయని మండిపడ్డారు. బ్లాక్ మార్కెటింగ్, ఆర్టిఫిషియల్ షార్టేజ్ ఆపడంలో కూటమి గవర్నమెంట్ ఫుల్ ఫెయిల్ అయ్యిందన్నారు. YCP హయాంలో రైతు బజార్లు, ధరల మార్పు లేకుండా కంట్రోల్ లో ఉంచామని గుర్తుచేశారు. ఇప్పటికైనా రేట్లను అదుపు చేయకపోతే ఊరుకునేది లేదని అన్నారు.

రూ.92.76 కోట్లతో స్పోర్ట్స్ హబ్.. 🏟️
TG : ఉమ్మడి ఖమ్మం జిల్లాను స్పోర్ట్స్ హబ్‌గా మార్చేందుకు గవర్నమెంట్ ప్లాన్స్ చేస్తోంది. రఘునాథపాలెంలో రూ.92.76 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి రెడీ అవుతుండగా, పటేల్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ ఓపెనింగ్‌కి సిద్ధంగా ఉంది. కానీ, గ్రౌండ్స్‌లో కోచ్‌లు, ఫెసిలిటీస్ లేవని ప్లేయర్స్ మండిపడుతున్నారు. అధికారులు వెంటనే రెస్పాండ్ అయ్యి ప్రాజెక్ట్ వర్క్స్ పూర్తి చేయాలని కోరుతున్నారు.

Gen Z కోసం రాజకీయ పార్టీల స్టైల్ మారుతోందా?
రాజకీయాల్లో యువతను ఆకట్టుకోవడానికి ఇప్పుడు పార్టీలు తమ ప్రచార శైలిని మార్చుకుంటున్నాయా? తాజాగా ఈ ట్రెండ్ సోషల్ మీడియాలో స్పష్టంగా కనిపిస్తోంది. బీజేపీ రాష్ట్రాల సోషల్ మీడియా ఖాతాలు మీమ్స్, సినిమాల సీన్లు, హాస్య వీడియోలు, పాప్ కల్చర్ రిఫరెన్స్‌లను రాజకీయ సందేశాలతో కలిపి ప్రచారం చేస్తున్నాయి. కారణం, యువత రాజకీయాల గురించి కూడా ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, మీమ్స్ ద్వారా తెలుసుకుంటున్నారు. అందుకే వాళ్లకు చేరాలంటే సంప్రదాయ ప్రసంగాల కంటే, వాళ్లకు తెలిసిన డిజిటల్ భాషలో మాట్లాడాల్సిన అవసరం పెరుగుతోంది.

15 ఏళ్లుగా రోడ్డు అట్లే ఉంది..
AP : అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మొసలపల్లిలో రోడ్డు వేసి 15 ఇయర్స్ అవుతున్నా ఇప్పటికీ నో చేంజ్ అని అక్కడి ప్రజలు తెలిపారు. పక్కన ఉన్న రోడ్లన్నీ బాగున్నా దీనికి మాత్రం ఎవరు కేర్ తీసుకోవట్లేదు. గవర్నమెంట్స్ మారినా రోడ్డు మాత్రం సేమ్. ఫండ్స్ రిలీజ్ అయ్యాయో లేదో తెలీదు, ఒకవేళ వచ్చినా పేపర్స్ మీదే వర్క్ చూపించి డబ్బులు జేబులో వేసుకున్నారేమో అని ప్రజలు డౌట్ పడుతున్నారు. ఈ రోడ్డు పైన వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందంటు, గవర్నమెంట్ దీన్ని పట్టించుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

బొటానికల్ గార్డెన్ – మసీదు బండ రోడ్డు 🛣️
TG : బొటానికల్ గార్డెన్ నుంచి మసీదు బండ రూట్‌లో డైలీ ఉండే ట్రాఫిక్ జామ్‌కి చెక్ పెట్టేందుకు రూ.1 కోటితో రోడ్డు విస్తరణ పనులు స్టార్ట్ చేశారు. ఈ వర్క్స్‌ని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ స్పాట్‌కి వెళ్లి దగ్గరుండి పరిశీలించారు. స్టూడెంట్స్, ఐటీ ఎంప్లాయీస్ జర్నీ ఈజీ అవ్వడానికే ఈ ఆల్టర్నేటివ్ రోడ్డును వెడల్పు చేస్తున్నట్లు చెప్పారు. పనులన్నీ స్పీడప్ చేసి వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని అధికారులకి ఆర్డర్స్ వేశారు.

పిల్లల హెల్త్‌పై ఏపీ గవర్నమెంట్ ఫోకస్
AP : పిల్లల హెల్త్ ప్రాబ్లమ్స్‌ని ముందుగానే డెటెక్ట్ చేసి ఫ్రీ ట్రీట్‌మెంట్ ఇవ్వడంలో AP గవర్నమెంట్ కేర్ తీసుకుంటోంది. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (RBSK) ద్వారా ఏప్రిల్ నుంచి ఆగస్టు 19 వరకు 18 ఏళ్లలోపు ఉన్న 441 మంది కిడ్స్‌కి ఫ్రీగా సర్జరీలు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశారు. అంగన్‌వాడీలు, స్కూల్స్‌లో హెల్త్ చెకప్స్ చేసి ప్రాబ్లమ్స్‌ని ఐడెంటిఫై చేశారు. దీనికోసం గవర్నమెంట్ ₹2.42 కోట్లకు పైగా బడ్జెట్ స్పెండ్ చేయగా, అందులో 238 సర్జరీలు డైరెక్ట్‌గా గవర్నమెంట్ హాస్పిటల్స్‌లోనే జరిగాయి.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల డేట్ ఫిక్స్!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు డేట్ ఫిక్స్ అయింది. మూడో శాసనసభ 8వ సెషన్‌లో భాగంగా రెండో మీటింగ్ సెప్టెంబర్ 7, 2026న ఉదయం 10AMకు జరగనుంది. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్‌లోని అసెంబ్లీ హాల్‌లో ఈ సెషన్ నిర్వహిస్తున్నట్లు లెజిస్లేచర్ సెక్రటరీ రెండ్ల తిరుపతి అధికారికంగా MLAలందరికీ సమాచారం అందించారు. స్పీకర్ ఆర్డర్ మేరకు MLAలందరూ ఈ మీటింగ్‌కు కచ్చితంగా అటెండ్ కావాలని నోటీస్‌లో స్పష్టం చేశారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించేందుకు అసెంబ్లీ మళ్లీ రీఓపెన్ కాబోతోంది.
గోకవరంలో ట్రాఫిక్‌కి చెక్ 🚨🚗
AP : తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో డైలీ అయ్యే ట్రాఫిక్ జామ్‌కి పోలీసులు ఫైనల్‌గా చెక్ పెట్టేశారు. మెయిన్ రోడ్డుపై ఇష్టమొచ్చినట్లు పార్క్ చేసిన వెహికల్స్‌ని క్లియర్ చేశారు. రోడ్డు పక్కన బండ్లు పెట్టి ట్రాఫిక్‌కి డిస్టర్బెన్స్ కలిగిస్తే డైరెక్ట్‌గా కేసులు బుక్ చేస్తామని కోరుకొండ CI సత్యనారాయణమూర్తి వార్నింగ్ ఇచ్చారు. రూల్స్ బ్రేక్ చేసి పార్కింగ్ చేస్తే యాక్షన్ గ్యారెంటీ అని తెలిపారు.