Latest

టెలిగ్రామ్‌కి షాక్.. ఢిల్లీ హైకోర్టు షాకింగ్ డెసిషన్!
నీట్ (NEET UG) ఎగ్జామ్ పేపర్ లీక్ ఇష్యూ నేపథ్యంలో టెలిగ్రామ్ యాప్‌కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమ యాప్‌పై కేంద్ర ప్రభుత్వం విధించిన టెంపరరీ రెస్ట్రిక్షన్స్‌ను సవాల్ చేస్తూ టెలిగ్రామ్ వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు డిస్మిస్ చేసింది. ఎగ్జామ్స్ సేఫ్టీ, స్టూడెంట్స్ ఫ్యూచర్‌ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కరెక్టేనని కోర్టు జస్టిఫై చేసింది. నేషనల్ సెక్యూరిటీ, పేపర్ లీక్స్ కంట్రోల్ చేయడం కోసమే ఈ రూల్స్ అని స్పష్టం చేసింది.

సచివాలయ ఉద్యోగిపై పోక్సో కేసు
AP: తిరుపతి జిల్లా నాయుడుపేటలోని భరత్ నగర్ సచివాలయ ఉద్యోగి విజయరామయ్య తోటి మహిళా పరిచయాన్ని ఆసరాగా చేసుకుని ఆమె కుమార్తెపై అకృత్యాలకు పాల్పడ్డాడు. విజయరామయ్యకు స్థానికంగా నివాసముంటున్న ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ పరిచయంతో ఆమె కుమార్తె అయిన 9వ తరగతి చదువుతున్న బాలిక బాత్రూమ్‌లో ఉన్నప్పుడు రహస్యంగా వీడియోలు చిత్రీకరించాడు. ఆ వీడియోలను చూపిస్తూ బాలికను బ్లాక్‌మెయిల్ చేస్తూ తన కోరిక తీర్చాలంటూ వేధింపులకు పాల్పడ్డాడు. పోలీసులు నిందితుడిపై పొక్సో కేసు నమోదు చేశారు.

భారీగా తగ్గిన బంగారం ధరలు!
బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్! మార్కెట్‌లో గోల్డ్ రేట్లు భారీగా పడిపోయాయి. హైదరాబాద్‌లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర రూ.3,650 తగ్గి రూ.1,45,860 కి చేరింది. అలాగే 22 క్యారెట్ల ధర రూ.3,350 తగ్గి రూ.1,33,700 కి పడిపోయింది. రేట్లు భారీగా తగ్గాయి కాబట్టి షాపింగ్ ప్లాన్ చేసుకునే వారికి ఇదే బెస్ట్ టైమ్. కానీ ప్రైసెస్ ఎప్పుడైనా మారొచ్చు, సో షాపింగ్‌కి వెళ్లే ముందు ఒకసారి లైవ్ రేట్ చెక్ చేసుకోండి.

నేచురల్ మెడిసిన్.. వేపతో వ్యాధులకు చెక్
మిరాకిల్ ట్రీగా పిలువబడే వేప దాని శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్‌ఫ్లమేటరీ లక్షణాల కారణంగా సాంప్రదాయ వైద్యంలో గొప్ప చరిత్రను కలిగి ఉంది. వాస్తవానికి వేప దాని విస్తృత శ్రేణి ఆరోగ్య ప్రయోజనాల కారణంగా దీనిని ప్రకృతి ఔషధం అని పిలుస్తారు. వేప ఆకులు అద్భుతమైన ఔషధ గుణాలు కలిగిన సర్వ రోగ నివారిణిగా పనిచేస్తాయి. ముఖ్యంగా చర్మవ్యాధులకు ఇది బెస్ట్ మెడిసన్. వేప బెరడు నుంచి ఆకులు, పండ్లు, చివరకు వేరు వరకు ప్రతి ఒక్కటీ వివిధ వ్యాధుల నుంచి మనల్ని కాపాడుతుంది.

రాష్ట్రంలోని ప్రతి పంచాయతీలో ఒక నర్సరీ: పవన్ కల్యాణ్
AP: ‘రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలో ఒక నర్సరీ ఉండేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ CM పవన్ కల్యాణ్ అటవీశాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో అటవీశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని 50 శాతానికి పెంచడమే లక్ష్యంగా ‘గ్రీనింగ్ సొసైటీ’ ఏర్పాటు చేయాలని, జూలై 3వ తేదీ నాటికి సొసైటీ ఏర్పాటు ప్రక్రియ పూర్తి కావాలన్నారు. ఒకే పంచాయతీలో సాధ్యం కాకపోతే.. 3-4 పంచాయతీలను క్లస్టర్‌గా చేసి, ఉమ్మడిగా ఒక నర్సరీని ఏర్పాటు చేయాలని సూచించారు.

బాలింత చితాభస్మంలో కత్తెర
భద్రాద్రికొత్తగూడెం జిల్లా గుండాల మండలం శంభూనిగూడెంకు చెందిన గర్భిణి చాట్ల వనజ(21)కు ఈనెల 13న పురిటినొప్పులు వచ్చాయి. గుండాల గవర్నమెంట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో స్టాఫ్‌నర్సు ఆధ్వర్యంలో కాన్పు చేయగా ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఇద్దరినీ ఇల్లెందు గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. శిశువు అప్పటికే మృతి చెందింది. అనంతరం తల్లి కూడా మృతి చెందింది. తల్లీబిడ్డలకు స్వగ్రామంలో అంత్యక్రియలు చేశారు. వనజ మృతదేహాన్ని దహనం చేసిన ప్రాంతంలో చితాభస్మాన్ని సేకరిస్తుండగా శస్త్రచికిత్సల్లో ఉపయోగించిన కత్తెర బయటపడింది.

ఏఐతో పిల్లలకు పారా సోషల్ అటాచ్ మెంట్
టెక్నాలజీ యుగంలో పిల్లలు మానవ సంబంధాల కంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పరికరాలకే ఎక్కువగా అలవాటు పడుతున్నారు. ఇది వారిలో 'పారాసోషల్ అటాచ్‌మెంట్' (కల్పిత బంధం) పెంచుతూ, నిజమైన భావోద్వేగాలను, సామాజిక నైపుణ్యాలను దూరం చేస్తోంది. డిజిటల్ పరికరాల మితిమీరిన వాడకం వల్ల పిల్లల్లో సానుభూతి లోపించడం, ఒంటరితనం వంటి కొత్త మానసిక సవాళ్లు ఎదురవుతున్నాయి. తల్లిదండ్రులు పిల్లలతో గడుపుతూ ఈ డిజిటల్ దూరాన్ని తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ప్రకృతిని పరిరక్షిస్తే, ప్రకృతే మనల్ని కాపాడుతుంది: రేవంత్‌రెడ్డి
TG: ప్రకృతిని పరిరక్షిస్తే ప్రకృతే మనల్ని కాపాడుతుందని CM రేవంత్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాలోని గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్‌లో తెలంగాణ వన మహోత్సవాన్ని ఆయన ప్రారంభించారు. రూ.15 కోట్ల వ్యయంతో రూపొందనున్న ఎకోపార్క్ పనులకు శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ నగరాన్ని కాలుష్యం నుంచి రక్షించేందుకు కోట్ల సంఖ్యలో మొక్కలు పెంచుతున్నట్లు CM పేర్కొన్నారు. 30వేల ఎకరాల్లో నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో 15వేల ఎకరాల్లో సహజ సిద్ధమైన అటవీ వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

అడ్మిషన్ల జోరు.. ప్రభుత్వ స్కూళ్లలో హౌస్‌ఫుల్ బోర్డులు
TG: వనపర్తి జిల్లా కేంద్రంలోని ZP బాలికల ఉన్నత పాఠశాలలో గతేడాది మొత్తం 905 మంది విద్యనభ్యసించగా, ఈ ఏడాది ప్రవేశాల సంఖ్య వెయ్యి దాటింది. పదిలో ఏకంగా ఆరు సెక్షన్లు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం బోర్గాం(పి) ZP పాఠశాలలో, సిద్దిపేటలోని ఇందిరానగర్ ప్రాథమిక పాఠశాలలో, నల్గొండ జిల్లా కేంద్రం బొట్టుగూడలోని కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో , సిరిసిల్లలోని గీతానగర్ ZP ఉన్నత పాఠశాలలో అత్యధిక అడ్మిషన్లు వచ్చాయి. దీంతో ఈ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

ఫోన్‌పే యూజర్లకు షాక్: ఇన్‌యాక్టివ్ వ్యాలెట్లపై ₹100 ఫీజు!
డిజిటల్ పేమెంట్స్ యాప్ ఫోన్‌పే వ్యాలెట్ వినియోగదారుల కోసం కొత్త నిబంధన తెచ్చింది. వరుసగా 12 నెలల పాటు ఎలాంటి లావాదేవీలు లేకుండా ఇన్‌యాక్టివ్‌గా ఉండే వ్యాలెట్లపై ప్రతి మూడు నెలలకు ₹100 మెయింటెనెన్స్ ఫీజు విధించనున్నారు. ఈ ఛార్జీలను నేరుగా వ్యాలెట్ బ్యాలెన్స్ నుండే కట్ చేస్తారు. అయితే, దీనివల్ల లింక్డ్ బ్యాంక్ ఖాతాలకు ఎలాంటి ప్రమాదం లేదు. ఈ అదనపు ఛార్జీల నుండి తప్పించుకోవడానికి వ్యాలెట్ ద్వారా ఏదైనా ఒక చిన్న లావాదేవీ చేసి దానిని మళ్లీ యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పిల్లలను కనే అంశంపై తల్లి దండ్రుల్లో టెన్షన్ !
పిల్లలను కనాలా వద్దా అనే కీలక నిర్ణయంలో మానసిక ఆరోగ్యం ప్రధాన పాత్ర పోషిస్తోందని ది న్యూయార్క్ టైమ్స్ కథనం పేర్కొంది. ఆందోళన, నిరాశ, ఓసీడీ (OCD) వంటి సమస్యలతో బాధపడుతున్న వారు తమ అనారోగ్యం పిల్లలకు సంక్రమిస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. మరికొందరు ఒంటరిగా పిల్లల్ని పెంచలేమని వెనకడుగు వేస్తుండగా, ఇంకొందరు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తల్లిదండ్రులుగా మారుతున్నారు. మానసిక స్థితి కుటుంబ నియంత్రణపై తీవ్ర ప్రభావం చూపుతోందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

అమ్మయ్య.... హార్మూజ్ లో నౌకలు కదులుతున్నాయ్ !
ప్రపంచ చమురు రవాణా జీవనాడి హర్ముజ్ జలసంధి ఎట్టకేలకు తెరుచుకుంది! అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదరడంతో, వంద రోజులకు పైగా అక్కడ నిలిచిపోయిన వందలాది నౌకలు కదలడం ప్రారంభించాయి. ఇప్పటికే చైనా, యూరప్ దేశాలకు చెందిన నౌకలు తమ ప్రయాణాన్ని సాగించాయి. గ్లోబల్ ఆయిల్ సప్లైకి లైన్ క్లియర్ అవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా టెన్షన్లు తొలగిపోయి అందరిలోనూ భారీ రిలీఫ్ వచ్చేసింది!

రఘురామ టార్చర్ కేసుపై ఏపీ హై కోర్టు సీరియస్ కామెంట్స్..
ఏపీ అసెంబ్లీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు కస్టోడియల్ టార్చర్ కేసుపై ఏపీ హై కోర్టు కీలక కామెంట్స్ చేసింది. ఈ నేరానికి పాల్పడిన వారు, పార్లమెంటుపై దాడి చేసిన వారికి తేడా లేదని కామెంట్ చేసింది. అప్పటి ఎంపీని టార్చర్ చేయబోతున్నారని ముందే తెలిసినా అప్పటి ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ఆ ఘటనలో పాల్గొనకుండా ఉండాల్సిందని అభిప్రాయపడింది. ఇక ఈ కేసులో ఆ అధికారి సరెండర్ అవుతారా? ముందస్తు బెయిల్ పై ప్రొసీడ్అవుతారా ఏదో ఒకటి తేల్చుకోవాలని కోరింది.

మాది సేమ్ సెక్స్ రొమాన్స్ కాదు-కృతిసనన్
కాక్ టెయిల్ 2 మూవీలో తనకు హీరోయిన్ రష్మికకు మధ్య సేమ్ సెక్స్ రొమాన్స్ ఉందన్న గాసిప్స్ కి బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ చెక్ పెట్టింది. అవన్నీ వట్టి పుకార్లేనని అది లెస్బియన్ కంటెంట్ ఓరియంటెడ్ మూవీ కానే కాదని క్లారిటీ ఇచ్చింది. ఇది మూడు క్యారెక్టర్ల మధ్య పండిన ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ తో కూడిన స్టోరీ అంటూ వివరణ ఇచ్చింది.

ధర్మస్థల్ 200 కోట్ల డీల్ పై.. ప్రెస్‌మీట్‌లో ప్రకాష్ రాజ్!
ధర్మస్థల ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు జరిగిన రూ.200 కోట్ల డీల్‌లో నటుడు ప్రకాష్ రాజ్‌కు కూడా భాగస్వామ్యం ఉందంటూ మాజీ కార్మికుడు చిన్నయ్య చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. దీనిపై బెంగళూరులో ప్రెస్‌మీట్ పెట్టిన ప్రకాష్ రాజ్, ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అలాగే తనకు చిన్నయ్యతో ఎలాంటి సంబంధం లేదని, అతడితో ఒకేసారి ఫోన్ మాట్లాడినట్లు, ఆ జరిగిన ఫోన్ సంభాషణల రికార్డింగ్‌లను కూడా తానే సిట్ (SIT) అధికారులకు పంపానని స్పష్టం చేశారు. గతం లో ఆలయ ఆరోపణలపై దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేయాలని సీఎం సిద్ధరామయ్యను తానే కోరినట్లు ప్రకాష్ రాజ్ ప్రెస్‌మీట్‌లో వివరణ ఇచ్చారు.
కోట్లు సంపాదించినా పెళ్లి చేసుకోకపోతే అంతే!
పిల్లలు ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా, కోట్లు సంపాదించినా. వారి పెళ్లి చూడాలనేదే పేరెంట్స్, తాతమ్మల పెద్ద కోరిక అని చెప్పే వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అమెరికాకు చెందిన ఒక మల్టీ మిలియనీర్ కంపెనీ ఓనర్ తన స్టోరీని షేర్ చేశారు. వారి విలేజ్ సాంప్రదాయం ప్రకారం ఒక వేడుకలో పెళ్లయిన కూతుళ్లకు బ్లాంకెట్స్ ఇచ్చే ట్రెడిషన్ ఉందని, తాను మ్యారేజ్ చేసుకోకపోవడంతో ఆ గిఫ్ట్స్ తన అమ్మమ్మకు రాలేదని, దీంతో ఆమె బాధపడుతున్నారు అంటూ చెప్పుకొచ్చారు. కోట్లు సంపాదించినా పెళ్లి చేసుకోకపోతే అంతే అంటూ ప్రెసెంట్ ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
భయపడకుండా పాముతోనే ఫైట్ చేశాడు.. వైరల్ వీడియో!
సాధారణంగా పాములను చూస్తేనే జనాలు భయపడతారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏమాత్రం భయపడకుండా పాముతో ఫైట్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో షేర్ అయిన ఈ వీడియోలో, పంట పొలంలో ఒక వ్యక్తి పామును కాళ్లతో తంతూ దాడి చేశాడు. ఆ సర్పం కూడా ఎదురుతిరిగి అతడిని కాటేయడానికి ప్రయత్నించింది. చివరకు ఆ వ్యక్తి గట్టిగా తన్నడంతో పాము బురదలో పడిపోయింది. సోషల్ మీడియా లో ఈ వీడియో ప్రెజెంట్ ఫుల్ వైరల్ అవుతోంది.

ఇండియన్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి BCCI స్పెషల్ ఆఫర్!
ఇండియన్ క్రికెట్ నయా సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి BCCI స్పెషల్ వెసులుబాటు కల్పించింది. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు ఎంపికైన ఈ 15 ఏళ్ల యువ బ్యాటర్‌తో పాటు అతడి తల్లిదండ్రులను కూడా వెంట తీసుకెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చింది. వారి ట్రావెల్, వసతి ఖర్చులన్నీ బోర్డే భరించనుంది. IPLలో 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్ గెలిచిన వైభవ్, విదేశాల్లో తన తల్లిదండ్రులతో కంఫర్ట్‌గా ఉండేందుకే ఈ స్పెషల్ నిర్ణయం తీసుకున్నట్లు BCCI సెక్రటరీ దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. ఈ సీజన్‌లో వైభవ్ మోస్ట్ వ్యాల్యూబుల్ ప్లేయర్‌గా నిలిచాడు.

స్పాట్‌లోనే 50 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన మంత్రి!
కాస్త గ్యాప్ తర్వాత గాంధీభవన్‌లో 'ప్రజలతో ముఖాముఖి' ప్రోగ్రామ్ మళ్లీ ప్రారంభమైంది. ఈ ఈవెంట్‌కి జనాలు వందలాదిగా తరలివచ్చారు. మినిస్టర్ అజారుద్దీన్ స్వయంగా రంగంలోకి దిగి ప్రజల నుండి దాదాపు 200 పైగా వినతిపత్రాలను రిసీవ్ చేసుకున్నారు. అంతేకాదు, ఏమాత్రం లేట్ చేయకుండా కలెక్టర్లతో ఫోన్‌లో మాట్లాడి, సుమారు 50 సమస్యలను అక్కడికక్కడే స్పాట్‌లోనే సాల్వ్ చేసేశారు. మిగతా అప్లికేషన్స్‌ను కూడా త్వరలోనే క్లియర్ చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రపంచంలోనే మోస్ట్ సీనియర్ సిటిజన్! ఎవరో తెలుసా?
ప్రపంచంలోనే మోస్ట్ సీనియర్ సిటిజన్ ఎవరో తెలుసా? మన 'జోనాథన్' అనే తాబేలు! సుమారు 1832లో పుట్టిన ఈ సెషెల్స్ జెయింట్ జాతి జీవి, ఇప్పుడు ఏకంగా 194వ ఏట అడుగుపెట్టింది. నార్మల్‌గా వీటి లైఫ్ స్పాన్ 150 ఏళ్లే. కానీ జోనాథన్ మాత్రం ఆ రికార్డ్‌ని బ్రేక్ చేసి, భూమిపై ప్రజెంట్ బతికున్న అత్యంత వృద్ధ జంతువుగా నిలిచింది. అందుకే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ దీనికి అఫీషియల్‌గా ఐకాన్ స్టేటస్ ఇచ్చింది. 19వ శతాబ్దం నుండి ఇప్పటివరకు ఎన్నో తరాలను చూసిన ఈ తాబేలు నిజంగా ఒక లివింగ్ లెజెండ్.
తిరుమలలో సమంత అండ్ ‘మా ఇంటి బంగారం’ టీమ్!
హీరోయిన్ సమంత తన లేటెస్ట్ మూవీ ‘మా ఇంటి బంగారం’ సక్సెస్ కోసం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం VIP దర్శనంలో సమంతతో పాటు ఆమె భర్త రాజ్ నిడిమోరు, యాంకర్ శ్రీముఖి, డైరెక్టర్ నందిని రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం తర్వాత పండితులు వీరికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. సమంత మెయిన్ రోల్ చేసిన ఈ సినిమా రేపే (జూన్ 19న) గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది.