Latest

వరంగల్‌ నుంచి తొర్రూర్‌కు బస్సు సౌకర్యం కల్పించాలి
Local· 27 Aug 2026

వరంగల్‌ నుంచి తొర్రూర్‌కు బస్సు సౌకర్యం కల్పించాలి

TG: రాత్రి 8గంటలు దాటితే వరంగల్‌ నుంచి తొర్రూర్‌, వర్ధన్నపేట ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు, ఇతర పనుల కోసం వరంగల్‌కు వచ్చే ప్రజలు రాత్రివేళ స్వగ్రామాలకు చేరుకునేందుకు ప్రత్యామ్నాయ రవాణాపై ఆధారపడాల్సి వస్తోంది. ముఖ్యంగా రాత్రి సమయాల్లో మహిళలు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రయాణికులు పేర్కొంటున్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాత్రి 9గంటల తర్వాత వరంగల్‌ నుంచి తొర్రూర్‌కు ఒక బస్సును నడపాలని కోరారు.

తప్పుల్లేని ఓటర్‌ జాబితానే ఎస్‌ఐఆర్‌ లక్ష్యం
Local· 27 Aug 2026

తప్పుల్లేని ఓటర్‌ జాబితానే ఎస్‌ఐఆర్‌ లక్ష్యం

TG: అర్హులైన ప్రతి ఓటరుకు ఓటు హక్కు కల్పిస్తూ తప్పుల్లేని, స్పష్టమైన ఓటర్‌ జాబితా రూపొందించడమే ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటీల్‌ అన్నారు. పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామంలో నోటీసులు జారీ చేసిన ఓటర్లతో నిర్వహించిన హియరింగ్‌ను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఒక ఓటరు వివరాలను ఆయన స్వయంగా యాప్‌లో అప్‌లోడ్‌ చేశారు. అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వ ఐటీఐలో 3వ విడత అడ్మిషన్లు.. తేదీలు ఇవే
Local· 27 Aug 2026

ప్రభుత్వ ఐటీఐలో 3వ విడత అడ్మిషన్లు.. తేదీలు ఇవే

TG: ప్రభుత్వ ఐటీఐ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌ (ఏటీసీ)లో 2026–27 విద్యా సంవత్సరానికి మిగిలిన సీట్ల భర్తీకి 3వ విడత వాక్‌ఇన్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ ఏటీసీలో ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్‌ 5 వరకు ఈ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతుందని ప్రిన్సిపాల్‌ కె. జయమ్మ గురువారం తెలిపారు. ప్రవేశం కోరుకునే అభ్యర్థులు ముందుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

నల్ల బ్యాడ్జీలతో విధులకు.. కాంట్రాక్ట్‌ సిబ్బంది నిరసన
Local· 27 Aug 2026

నల్ల బ్యాడ్జీలతో విధులకు.. కాంట్రాక్ట్‌ సిబ్బంది నిరసన

AP: తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ కాంట్రాక్ట్‌ వైద్య, పారామెడికల్‌ సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ పారామెడికల్‌ జేఏసీ ఆదేశాల మేరకు గురువారం పల్నాడు జిల్లా శావల్యాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ నిరసన చేపట్టారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయాలని, 100 శాతం గ్రాస్‌ జీతం అమలు చేయాలని సిబ్బంది డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల కుటుంబాలకు భరోసా కల్పించేలా రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా మంజూరు చేయాలని కోరారు.

మతాలకు అతీతమైన మానవత్వం..అదే ‘కేరళం’
Current Affairs· 27 Aug 2026

మతాలకు అతీతమైన మానవత్వం..అదే ‘కేరళం’

కేరళం రాష్ట్రం మరోసారి మతాలకతీతంగా నిలబడి తన ఘనత చాటింది. చోట్టానిక్కరకు చెందిన ఆర్థడాక్స్ క్రైస్తవ ఫాదర్ ఓ.జె. జేకబ్ ఇంట్లో 26 ఏళ్లుగా ఉన్న పార్వతి(88) అనే మహిళకు హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. అదే సమయంలో క్రైస్తవ ప్రార్థనలు కూడా చేశారు. 2000లో ఫాదర్ జేకబ్ భార్య మరణించిన తర్వాత ఆయన ఆరేళ్ల కుమార్తె మెరిన్‌ను చూసుకోవడానికి పార్వతి అక్కడికి వచ్చారు. అలా ఆ కుటుంబంలో మనిషిగా మారారు.

స్వీట్‌ Shopsపై రైడ్స్.. కస్టమర్స్‌కు పోలీసుల అలర్ట్‌!
Crime· 27 Aug 2026

స్వీట్‌ Shopsపై రైడ్స్.. కస్టమర్స్‌కు పోలీసుల అలర్ట్‌!

TG: హైదరాబాద్‌ పోచారం IT కారిడార్‌లో స్వీట్‌ షాప్స్‌పై పోలీసులు యాక్షన్‌ తీసుకున్నారు. చౌదరిగూడలోని ఓ స్వీట్‌ షాపులో ఉప్పల్‌ పోలీసులు, SOT టీమ్‌ రైడ్‌ చేశారు. స్వీట్ల తయారీలో ఆరోగ్యానికి హాని చేసే సింథటిక్ కలర్స్ వాడుతున్నట్లు గుర్తించారు. దీంతో రాజస్థాన్‌కు చెందిన షాప్ ఓనర్ కమల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు బుక్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. కస్టమర్స్ స్వీట్స్ కొనేముందు తయారీ, Expiry డేట్ చెక్ చేయాలని, స్మెల్, టేస్ట్‌తో పాటు స్వీట్ క్వాలిటీని కూడా ఒకసారి చెక్ చేయాలని సూచించారు.

మైనర్లకు మద్యం అమ్మితే కఠిన చర్యలు
Local· 27 Aug 2026

మైనర్లకు మద్యం అమ్మితే కఠిన చర్యలు

AP: బార్‌, వైన్స్‌ షాపుల వద్ద శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణపై తాడేపల్లి పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో బార్‌, వైన్స్‌ షాపుల యాజమానులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సీఐ వీరేంద్ర పర్యవేక్షణలో ఎస్సై ఖాజావలి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు. నాణ్యమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం పనిచేసేలా చూడాలని సూచించారు. షాపుల వద్ద గొడవలు, అనుమానాస్పద వ్యక్తుల సంచారం, అసాంఘిక కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు.

29న ‘భారత రాజ్యాంగం, రక్షణ’పై Special Talk
Current Affairs· 27 Aug 2026

29న ‘భారత రాజ్యాంగం, రక్షణ’పై Special Talk

TG: ఎస్.జైపాల్ రెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 29 సాయంత్రం 6 గంటలకు ‘భారత రాజ్యాంగం, రక్షణ’ అనే అంశంపై Special Talk నిర్వహించనున్నారు. సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్, రాజ్యసభ MP డా.మేనకా గురుస్వామి మాట్లాడతారు. చీఫ్ గెస్టుగా నల్సార్(NALSAR) హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శ్రీకృష్ణ దేవరావు వస్తారు. హైదరాబాద్ నగరం ఖైరతాబాద్‌లోని ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్(ఇండియా) మెయిన్ ఆడిటోరియంలో ఈ ప్రోగ్రామ్ జరుగుతోంది.

పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలని ధర్నా
Local· 27 Aug 2026

పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలని ధర్నా

AP: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని సీపీఐ ఆధ్వర్యంలో గురువారం చింతూరు ఐటీడీఏ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. నిర్వాసితులతో కలిసి చేపట్టిన ఈ ఆందోళనలో ముంపు ప్రాంతంలోని అన్ని గ్రామాలకు వెంటనే పరిహారం చెల్లించాలని నాయకులు డిమాండ్‌ చేశారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వడంతో పాటు ముంపునకు గురవుతున్న వ్యవసాయ భూములకు మెరుగైన ప్యాకేజీ అందించాలని కోరారు. నిర్వాసితులను ఖాళీ చేయించే సమయాన్నే కటాఫ్‌ తేదీగా ప్రకటించి 18ఏళ్లు నిండిన ప్రతిఒక్కరికీ పరిహారం ఇవ్వాలన్నారు.

లారీ డ్రైవర్‌పై దాడి.. Vehicle Inspector డ్రైవర్‌పై కేసు
AP· 27 Aug 2026

లారీ డ్రైవర్‌పై దాడి.. Vehicle Inspector డ్రైవర్‌పై కేసు

AP: విశాఖ షీలానగర్‌లో లారీ డ్రైవర్‌పై దాడి ఘటనలో మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వెహికల్స్ చెక్ చేసే టైమ్‌లో లారీ ఆపకుండా వెళ్లడంతో దాన్ని వెంబడించి అడ్డుకున్న ఇన్‌స్పెక్టర్ డ్రైవర్.. <a href="https://www.theclearcutnews.com/n/LsCCiAo">క్యాబిన్‌లోకి వెళ్లి డ్రైవర్‌పై దాడి</a> చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. లారీ ఓనర్ల అసోసియేషన్ కంప్లైంట్‌తో కేసు బుక్ అవగా, మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్‌ పార్వతిను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఘటనపై పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని హైకోర్టు సీపీని ఆదేశించింది.

రైతుల పంటలకు మెరుగైన మార్కెటింగ్‌ సదుపాయాలు
Local· 27 Aug 2026

రైతుల పంటలకు మెరుగైన మార్కెటింగ్‌ సదుపాయాలు

AP: రైతులు పండించిన పంటలకు మెరుగైన మార్కెటింగ్‌ సదుపాయాలు కల్పించేందుకు మంగళగిరిలో మోడల్‌ రైతుబజారు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గుంటూరు జిల్లా మంగళగిరి నిడమర్రు రోడ్డులో 5.90 ఎకరాల విస్తీర్ణంలో రూ.18 కోట్లతో నిర్మించనున్న రైతుబజారుకు మంత్రి నారా లోకేష్‌ శంకుస్థాపన చేశారు. రైతులు పండించిన కూరగాయలు, పండ్లు, పూలను నేరుగా విక్రయించుకునేలా రిటైల్‌, హోల్‌సేల్‌ మార్కెట్లు ఏర్పాటు చేయనున్నారు. కోల్డ్‌ స్టోరేజీ, వెజిటబుల్‌ వాష్‌ ఏరియా వంటి ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.

నేపాల్ వరదలు..భారత్‌లో నదులకు అలర్ట్
National· 27 Aug 2026

నేపాల్ వరదలు..భారత్‌లో నదులకు అలర్ట్

వరదలు నేపాల్ దేశాన్ని అతలాకుతలం చేశాయి. ఇదే టైంలో భారత్‌లోని నదులకు కూడా అలర్ట్ ఏర్పడింది. వరద నీళ్లు పైనుంచి గండక్ నది ద్వారా భారత్‌లోకి ప్రవహించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. దీంతో బిహార్ రాష్ట్రం వాల్మీకినగర్‌లోని గండక్ బ్యారేజ్ వద్ద అన్ని 36 గేట్లు తెరిచారు. ఒక రోజులో సుమారు 1.50 లక్షల క్యూసెక్స్ నీరు విడుదల చేశారు. లో-లైయింగ్ ఏరియాలు, బ్రిడ్జ్‌లను వాచ్ చేస్తున్నారు. UPలో మహారాజ్‌గంజ్, కుషీనగర్ జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు.

ఐదేళ్ల బాలుడికి టార్చ్‌ వెలుగులో వైద్యం
AP· 27 Aug 2026

ఐదేళ్ల బాలుడికి టార్చ్‌ వెలుగులో వైద్యం

AP: పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి బిడ్డిక జీవన్‌(5) కాలిన గాయాలతో వచ్చాడు. ప్రమాదవశాత్తు వేడి నీళ్లు పడటంతో గాయపడిన బాలుడిని కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే ఆస్పత్రిలో విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో పాటు జనరేటర్‌ సదుపాయం కూడా లేకపోవడంతో వైద్యులు టార్చ్‌ వెలుగులో చికిత్స అందించారు. మెరుగైన వైద్యం అవసరమని వైద్యులు సూచించడంతో పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. నూతన ఆస్పత్రిలోనే కనీస సౌకర్యాలు లేకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నేపాల్ వరదలు.. తెలంగాణ వాసులకు హెల్ప్‌లైన్ ఏర్పాటు
TG· 27 Aug 2026

నేపాల్ వరదలు.. తెలంగాణ వాసులకు హెల్ప్‌లైన్ ఏర్పాటు

TG: నేపాల్‌లో భారీ వరదల కారణంగా తెలంగాణ CM రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. అక్కడ చిక్కుకున్న తెలంగాణ వాసులకు సాయం అందించేందుకు దిల్లీలోని తెలంగాణ భవన్‌లో స్పెషల్ హెల్ప్‌లైన్, కోఆర్డినేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. కేంద్ర విదేశాంగ శాఖ (MEA), ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయంతో అధికారులు కోఆర్డినేట్ చేస్తున్నారు. నేపాల్‌లోని ఫ్యామిలీ మెంబెర్స్ కాంటాక్ట్‌లోకి రాకపోతే హెల్ప్‌లైన్‌కు కాల్ చేయొచ్చు. హెల్ప్‌లైన్: 9871999044, 9949351270, 9618597969

నూతన పంచాయతీ భవనానికి భూమిపూజ
Local· 27 Aug 2026

నూతన పంచాయతీ భవనానికి భూమిపూజ

AP: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం వీర్లపాలెంలో నూతన పంచాయతీ భవన నిర్మాణానికి గురువారం భూమిపూజ నిర్వహించారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో రూ.32 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఈ భవన నిర్మాణ పనులకు కూటమి నాయకులు ప్రత్యేక పూజలు చేసి శ్రీకారం చుట్టారు. గ్రామ పరిపాలనకు అవసరమైన మౌలిక వసతులు అందుబాటులోకి రానుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. నూతన పంచాయతీ భవనం పూర్తయితే ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ కానున్నాయని నాయకులు తెలిపారు.

వరంగల్‌ నిరసనకు బ్రేక్.. హరీశ్‌రావు హౌస్ అరెస్ట్
TG· 27 Aug 2026

వరంగల్‌ నిరసనకు బ్రేక్.. హరీశ్‌రావు హౌస్ అరెస్ట్

TG: BRS లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావును ఈరోజు ఉదయం పోలీసులు హౌస్‌ అరెస్ట్ చేశారు. వరంగల్‌లో GO 97ను వెనక్కి తీసుకోవాలని పాలిటెక్నిక్ స్టూడెంట్స్ నిరసన చేస్తున్నారు. వారిని కలిసేందుకు వెళ్తుండగా కోకాపేటలోని అయన ఇంట్లో పోలీసులు ముందస్తుగా అడ్డుకున్నారు. దీంతో హరీశ్‌రావు సపోర్టర్స్, BRS కార్యకర్తలు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హౌస్‌ అరెస్టును BRS నేతలు ఖండించారు. మరోవైపు, ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే హౌస్‌ అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

దొంగల భయానికి చెక్‌.. గ్రామస్థులే రాత్రి సైనికులు
Local· 27 Aug 2026

దొంగల భయానికి చెక్‌.. గ్రామస్థులే రాత్రి సైనికులు

TG: గ్రామ రక్షణ కోసం హవర్గ గ్రామస్థులు వినూత్నంగా ముందడుగు వేశారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం హవర్గలో గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ) ఆధ్వర్యంలో గ్రామస్థులే బృందాలుగా ఏర్పడి రాత్రివేళల్లో గల్లీగల్లీ తిరుగుతూ గస్తీ నిర్వహిస్తున్నారు. భైంసా మండలం పెండ్పల్లిలో ఇటీవల దొంగతనాల ఘటనలు చోటుచేసుకోవడంతో అప్రమత్తమైన గ్రామస్థులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. దొంగతనం జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందే జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు.

హైదరాబాద్‌లో ఇక రాత్రివేళల్లోనూ బస్సు సర్వీసులు
Local· 27 Aug 2026

హైదరాబాద్‌లో ఇక రాత్రివేళల్లోనూ బస్సు సర్వీసులు

హైదరాబాద్ నగరంలో ఇకపై అర్ధరాత్రి, తెల్లవారుజామున కూడా బస్సు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ప్రజా రవాణాను మరింత బలోపేతం చేసేందుకు టీజీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 29 నుంచి హైదరాబాద్‌లోని ఆరు ప్రధాన మార్గాల్లో రాత్రి బస్సు సర్వీసులను ప్రారంభించనుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు బస్సులు నడపనున్నారు. ఐటీ ఉద్యోగులు, హోటళ్లు, హాస్పిటాలిటీ రంగం, షాపింగ్‌ మాల్స్‌, ఇతర నైట్‌ షిఫ్ట్‌ ఉద్యోగులు, పర్యాటకుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్లాస్టిక్‌ కవర్లు తొలగించండి.. అధికారులు వార్నింగ్‌
Local· 27 Aug 2026

ప్లాస్టిక్‌ కవర్లు తొలగించండి.. అధికారులు వార్నింగ్‌

AP: పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు గురజాల నగర పంచాయతీ అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. కమిషనర్‌ వైవీఎల్‌ శివన్నారాయణరావు ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్‌ కవర్లు, కప్పులు, ప్లేట్లు, స్ట్రాలు, థర్మాకోల్‌ వస్తువుల విక్రయాలు, వినియోగాన్ని నిలిపివేయాలని సూచించారు. సెప్టెంబర్‌ 5లోపు దుకాణాల్లో నిల్వఉన్న నిషేధిత ప్లాస్టిక్‌ వస్తువులను తొలగించాలన్నారు.

వాడపల్లిలో అష్టోత్తర పూజలకు పోటెత్తిన భక్తులు
Local· 27 Aug 2026

వాడపల్లిలో అష్టోత్తర పూజలకు పోటెత్తిన భక్తులు

AP: అంబేద్కర్‌ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం అష్టోత్తర పూజలను అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఏడు వారాల నోము ఆచరించిన భక్తులు అష్టోత్తర పూజల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయంలో రద్దీ నెలకొంది. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మోరంపూడికి చెందిన చనుమూరి లక్ష్మీ వెంకట గణపతి, ఆయన కుటుంబసభ్యులు నిత్య అన్నదానానికి రూ.1,01,116 విరాళం అందజేశారు.

తెలంగాణలో ఖేలో ఇండియా గేమ్స్.. కేంద్రం రూ.22 కోట్లు రిలీజ్
TG· 27 Aug 2026

తెలంగాణలో ఖేలో ఇండియా గేమ్స్.. కేంద్రం రూ.22 కోట్లు రిలీజ్

TG: రాష్ట్రంలో ఈ ఏడాది 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జరగనున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌లో పోటీలు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు ఆరు వేల మంది యువ అథ్లెట్లు 25 క్రీడల్లో పోటీపడనున్నారు. ఈ గేమ్స్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.22 కోట్లు రిలీజ్ చేసింది. తెలంగాణకు మరో లోకల్ స్పోర్ట్‌ను ప్రతిపాదించే ఛాన్స్ కూడా ఇచ్చారు. యంగ్ స్పోర్ట్స్ ప్లేయర్లకు ఇది మంచి ఆపర్చునిటీగా మారనుంది.