Latest

లారీ డ్రైవర్‌పై దాడి.. Vehicle Inspector డ్రైవర్‌పై కేసు
AP: విశాఖ షీలానగర్‌లో లారీ డ్రైవర్‌పై దాడి ఘటనలో మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వెహికల్స్ చెక్ చేసే టైమ్‌లో లారీ ఆపకుండా వెళ్లడంతో దాన్ని వెంబడించి అడ్డుకున్న ఇన్‌స్పెక్టర్ డ్రైవర్.. <a href="https://www.theclearcutnews.com/n/LsCCiAo">క్యాబిన్‌లోకి వెళ్లి డ్రైవర్‌పై దాడి</a> చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. లారీ ఓనర్ల అసోసియేషన్ కంప్లైంట్‌తో కేసు బుక్ అవగా, మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ పార్వతిను కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఘటనపై పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని హైకోర్టు సీపీని ఆదేశించింది.

రైతుల పంటలకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు
AP: రైతులు పండించిన పంటలకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు కల్పించేందుకు మంగళగిరిలో మోడల్ రైతుబజారు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. గుంటూరు జిల్లా మంగళగిరి నిడమర్రు రోడ్డులో 5.90 ఎకరాల విస్తీర్ణంలో రూ.18 కోట్లతో నిర్మించనున్న రైతుబజారుకు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. రైతులు పండించిన కూరగాయలు, పండ్లు, పూలను నేరుగా విక్రయించుకునేలా రిటైల్, హోల్‌సేల్ మార్కెట్లు ఏర్పాటు చేయనున్నారు. కోల్డ్ స్టోరేజీ, వెజిటబుల్ వాష్ ఏరియా వంటి ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.

నేపాల్ వరదలు..భారత్‌లో నదులకు అలర్ట్
వరదలు నేపాల్ దేశాన్ని అతలాకుతలం చేశాయి. ఇదే టైంలో భారత్‌లోని నదులకు కూడా అలర్ట్ ఏర్పడింది. వరద నీళ్లు పైనుంచి గండక్ నది ద్వారా భారత్‌లోకి ప్రవహించే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. దీంతో బిహార్ రాష్ట్రం వాల్మీకినగర్‌లోని గండక్ బ్యారేజ్ వద్ద అన్ని 36 గేట్లు తెరిచారు. ఒక రోజులో సుమారు 1.50 లక్షల క్యూసెక్స్ నీరు విడుదల చేశారు. లో-లైయింగ్ ఏరియాలు, బ్రిడ్జ్‌లను వాచ్ చేస్తున్నారు. UPలో మహారాజ్‌గంజ్, కుషీనగర్ జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించారు.
ఐదేళ్ల బాలుడికి టార్చ్ వెలుగులో వైద్యం
AP: పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి బిడ్డిక జీవన్(5) కాలిన గాయాలతో వచ్చాడు. ప్రమాదవశాత్తు వేడి నీళ్లు పడటంతో గాయపడిన బాలుడిని కుటుంబసభ్యులు ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే ఆస్పత్రిలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పాటు జనరేటర్ సదుపాయం కూడా లేకపోవడంతో వైద్యులు టార్చ్ వెలుగులో చికిత్స అందించారు. మెరుగైన వైద్యం అవసరమని వైద్యులు సూచించడంతో పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. నూతన ఆస్పత్రిలోనే కనీస సౌకర్యాలు లేకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

నేపాల్ వరదలు.. తెలంగాణ వాసులకు హెల్ప్‌లైన్ ఏర్పాటు
TG: నేపాల్‌లో భారీ వరదల కారణంగా తెలంగాణ CM రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు ఇచ్చారు. అక్కడ చిక్కుకున్న తెలంగాణ వాసులకు సాయం అందించేందుకు దిల్లీలోని తెలంగాణ భవన్‌లో స్పెషల్ హెల్ప్‌లైన్, కోఆర్డినేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. కేంద్ర విదేశాంగ శాఖ (MEA), ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయంతో అధికారులు కోఆర్డినేట్ చేస్తున్నారు. నేపాల్‌లోని ఫ్యామిలీ మెంబెర్స్ కాంటాక్ట్‌లోకి రాకపోతే హెల్ప్‌లైన్‌కు కాల్ చేయొచ్చు. హెల్ప్‌లైన్: 9871999044, 9949351270, 9618597969

నూతన పంచాయతీ భవనానికి భూమిపూజ
AP: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం వీర్లపాలెంలో నూతన పంచాయతీ భవన నిర్మాణానికి గురువారం భూమిపూజ నిర్వహించారు. మంగళగిరి నియోజకవర్గ పరిధిలో రూ.32 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఈ భవన నిర్మాణ పనులకు కూటమి నాయకులు ప్రత్యేక పూజలు చేసి శ్రీకారం చుట్టారు. గ్రామ పరిపాలనకు అవసరమైన మౌలిక వసతులు అందుబాటులోకి రానుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. నూతన పంచాయతీ భవనం పూర్తయితే ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ కానున్నాయని నాయకులు తెలిపారు.

వరంగల్ నిరసనకు బ్రేక్.. హరీశ్‌రావు హౌస్ అరెస్ట్
TG: BRS లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావును ఈరోజు ఉదయం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వరంగల్‌లో GO 97ను వెనక్కి తీసుకోవాలని పాలిటెక్నిక్ స్టూడెంట్స్ నిరసన చేస్తున్నారు. వారిని కలిసేందుకు వెళ్తుండగా కోకాపేటలోని అయన ఇంట్లో పోలీసులు ముందస్తుగా అడ్డుకున్నారు. దీంతో హరీశ్‌రావు సపోర్టర్స్, BRS కార్యకర్తలు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హౌస్ అరెస్టును BRS నేతలు ఖండించారు. మరోవైపు, ఎలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే హౌస్ అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

దొంగల భయానికి చెక్.. గ్రామస్థులే రాత్రి సైనికులు
TG: గ్రామ రక్షణ కోసం హవర్గ గ్రామస్థులు వినూత్నంగా ముందడుగు వేశారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం హవర్గలో గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ) ఆధ్వర్యంలో గ్రామస్థులే బృందాలుగా ఏర్పడి రాత్రివేళల్లో గల్లీగల్లీ తిరుగుతూ గస్తీ నిర్వహిస్తున్నారు. భైంసా మండలం పెండ్పల్లిలో ఇటీవల దొంగతనాల ఘటనలు చోటుచేసుకోవడంతో అప్రమత్తమైన గ్రామస్థులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. దొంగతనం జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందే జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు.

హైదరాబాద్‌లో ఇక రాత్రివేళల్లోనూ బస్సు సర్వీసులు
హైదరాబాద్ నగరంలో ఇకపై అర్ధరాత్రి, తెల్లవారుజామున కూడా బస్సు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ప్రజా రవాణాను మరింత బలోపేతం చేసేందుకు టీజీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 29 నుంచి హైదరాబాద్‌లోని ఆరు ప్రధాన మార్గాల్లో రాత్రి బస్సు సర్వీసులను ప్రారంభించనుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు బస్సులు నడపనున్నారు. ఐటీ ఉద్యోగులు, హోటళ్లు, హాస్పిటాలిటీ రంగం, షాపింగ్ మాల్స్, ఇతర నైట్ షిఫ్ట్ ఉద్యోగులు, పర్యాటకుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్లాస్టిక్ కవర్లు తొలగించండి.. అధికారులు వార్నింగ్
AP: పల్నాడు జిల్లా గురజాల పట్టణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు గురజాల నగర పంచాయతీ అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. కమిషనర్ వైవీఎల్ శివన్నారాయణరావు ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్లు, కప్పులు, ప్లేట్లు, స్ట్రాలు, థర్మాకోల్ వస్తువుల విక్రయాలు, వినియోగాన్ని నిలిపివేయాలని సూచించారు. సెప్టెంబర్ 5లోపు దుకాణాల్లో నిల్వఉన్న నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను తొలగించాలన్నారు.

వాడపల్లిలో అష్టోత్తర పూజలకు పోటెత్తిన భక్తులు
AP: అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం అష్టోత్తర పూజలను అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఏడు వారాల నోము ఆచరించిన భక్తులు అష్టోత్తర పూజల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయంలో రద్దీ నెలకొంది. భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మోరంపూడికి చెందిన చనుమూరి లక్ష్మీ వెంకట గణపతి, ఆయన కుటుంబసభ్యులు నిత్య అన్నదానానికి రూ.1,01,116 విరాళం అందజేశారు.

తెలంగాణలో ఖేలో ఇండియా గేమ్స్.. కేంద్రం రూ.22 కోట్లు రిలీజ్
TG: రాష్ట్రంలో ఈ ఏడాది 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జరగనున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్‌లో పోటీలు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు ఆరు వేల మంది యువ అథ్లెట్లు 25 క్రీడల్లో పోటీపడనున్నారు. ఈ గేమ్స్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.22 కోట్లు రిలీజ్ చేసింది. తెలంగాణకు మరో లోకల్ స్పోర్ట్‌ను ప్రతిపాదించే ఛాన్స్ కూడా ఇచ్చారు. యంగ్ స్పోర్ట్స్ ప్లేయర్లకు ఇది మంచి ఆపర్చునిటీగా మారనుంది.

గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఘోర విషాదం
TG: గ్రీన్‌ఫీల్డ్ హైవేపై అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కేఎం బంజర్ సమీపంలో రహదారిపై నిలిపి ఉంచిన లారీని వెనుక నుంచి వచ్చిన డీసీఎం వాహనం బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు డీసీఎం క్యాబిన్ పూర్తిగా దెబ్బతినడంతో డ్రైవర్ అందులోనే చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పెనుబల్లి పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్‌ను బయటకు తీశారు. మృతుడిని మహారాష్ట్రకు చెందిన నవనీత్ గా గుర్తించారు.

చేయూత పెన్షన్‌కు 31 చివరి గడువు: MPDO
TG: చేయూత పెన్షన్‌కు అర్హులైన వారు ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల ఎంపీడీవో అబ్దుల్ సయీద్ ఖాన్ సూచించారు. గడువు ముగిసిన తర్వాత వచ్చిన దరఖాస్తులను స్వీకరించే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేయూత పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ అందించేందుకు ప్రక్రియ కొనసాగుతోంది. పాత ఫైళ్లను పంచాయతీల సమన్వయంతో అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ సుమారు 80 శాతం పూర్తయిందని ఎంపీడీవో తెలిపారు.

నేపాల్‌లో వరదలు.. ఏపీ సర్కార్ అలర్ట్!
AP: నేపాల్‌లో భారీ వరదలతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. అక్కడ ఏపీకి చెందిన వారు ఎవరైనా చిక్కుకున్నారా? అనే దానిపై అధికారులు అప్‌డేట్ తీసుకుంటున్నారు. బాధితులను గుర్తించి సేఫ్ ప్లేస్‌కు తీసుకెళ్లేలా చర్యలు తీసుకోవాలని CM చంద్రబాబు ఆదేశించారు. కేంద్రంతో కోఆర్డినేట్ చేస్తూ సాయం అందించాలని సూచించారు. రియల్ టైమ్ గవర్నెన్స్ (RTG) ద్వారా పరిస్థితిని మానిటర్ చేయాలని చెప్పారు. దిల్లీలోని ఏపీ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. హెల్ప్‌లైన్: 011-23384016, 011-23387089, వాట్సాప్: 9059824101
నవజాత శిశువు మృతి.. ఆస్పత్రి వద్ద ఆందోళన
TG: భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం మాతా శిశు కేంద్రంలో నవజాత శిశువు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ములకలపల్లికి చెందిన విజయలక్ష్మికి పాప జన్మించగా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో కుటుంబసభ్యులు చికిత్స కోసం శిశువును మాతా శిశు కేంద్రానికి తీసుకొచ్చారు. అయితే వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే పాప మృతి చెందిందని కుటుంబసభ్యులు ఆరోపించారు. తమ పాప మృతికి బాధ్యులైన వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మదర్ థెరిసా సేవలు అందరికీ స్ఫూర్తిదాయకం
AP: సేవా మార్గంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిన మదర్ థెరిసా జయంతి వేడుకలను గుత్తి పెన్షనర్స్ భవనంలో ఘనంగా నిర్వహించారు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని పెన్షనర్స్ భవనంలో అసోసియేట్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ, కోశాధికారి జెన్నే కుల్లాయిబాబు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. తొలుత మదర్ థెరిసా చిత్రపటానికి కోశాధికారి జెన్నే కుల్లాయిబాబు, సెక్రటరీ రామ్‌మోహన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలు, ఆకలితో అలమటించే వారు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మదర్ థెరిసా అందించిన సేవలను గుర్తుచేశారు.

పులివెందులలో దొంగల ముఠా అరెస్ట్
AP: కడప జిల్లా పులివెందుల నియోజకవర్గ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల ఏడు బైక్‌లతో పాటు ఆలయం వద్ద నిల్వ ఉంచిన ఇనుప సామగ్రి చోరీకి గురైనట్లు ఫిర్యాదులు అందాయని తెలిపారు. కేసులపై దర్యాప్తు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు రూ.7 లక్షల విలువైన బైకులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే చోరీ చేసిన ఇనుప సామగ్రిని విక్రయించగా వచ్చిన రూ.1 లక్ష నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ శ్రీరామ్ తెలిపారు.

గోల్డ్, సిల్వర్ రేట్‌లో నో చేంజ్.. ఇవాళ ధరలు ఇవే!
వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు స్టేబుల్‌గా ఉన్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, గురువారం హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.1,63,740 కాగా, 22 క్యారెట్ల 10 గ్రా. ఆర్నమెంటల్ గోల్డ్ రేట్ రూ.1,50,090గా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.2,64,900గా నమోదైంది. అయితే గోల్డ్, సిల్వర్ రేట్స్ ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి కొనే ముందు మార్కెట్‌లో ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్.

B-Pharmacy, Pharma-D కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్
TG: రాష్ట్రంలో ఎప్‌సెట్-ఎంపీసీ స్ట్రీమ్ అభ్యర్థులకు B-Pharmacy, Pharma-D కౌన్సెలింగ్‌కు షెడ్యూల్ డేట్స్ రిలీజ్ అయ్యాయి. సెప్టెంబరు 3, 4 తేదీల్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలని టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన తెలిపారు. సెప్టెంబరు 6లోపు సీట్ల అలాట్‌మెంట్ ఉంటుంది. సీటు వచ్చినవాళ్లు సెప్టెంబరు 7లోపు ఆన్‌లైన్‌లో ఫీజు పే చేసి, సెప్టెంబరు 8లోపు అలాట్ చేసిన కాలేజీలో రిపోర్ట్ చేయాలి. ఇప్పటికే ఇంజినీరింగ్ కాలేజీలో జాయిన్ అయిన వారు ఈ కౌన్సెలింగ్‌కు అనర్హులని తెలిపారు.
పాడేరు ITDA గేటు వద్దే విద్యార్థుల నిద్ర, నిరసన
AP: పాఠశాల నుంచి తమను బలవంతంగా పంపించడాన్ని నిరసిస్తూ గిరిజన విద్యార్థులు, తల్లిదండ్రులు పాడేరు ITDA గేటు వద్ద నిద్రిస్తూ ఆందోళన చేపట్టారు. విశాఖపట్నంలోని మారికవలస గురుకులం స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీలో 5, 6, 7, 8 తరగతులు చదువుతున్న 480 మంది గిరిజన విద్యార్థులను పాఠశాల నుంచి పంపించారని తల్లిదండ్రులు ఆరోపించారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ప్రారంభిస్తామంటూ విద్యార్థులు, తల్లిదండ్రులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా పోలీసుల సమక్షంలో విద్యార్థులను బయటకు పంపించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.