Latest

ఏప్రిల్ థర్డ్ వీక్ లో 7 సినిమాలు రిలీజ్
ఏప్రిల్ థర్డ్ వీకెండ్లో ఏకంగా 7 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నాగశౌర్య నటించిన 'బ్యాడ్ బాయ్ కార్తీక్', కిరణ్ అబ్బవరం ప్రొడ్యూస్ చేసిన 'తిమ్మరాజుపల్లి టీవీ', తిరువీర్ యాక్ట్ చేసిన 'పాపం ప్రతాప్', వీటితో పాటు 'గాలి', 'తెరచాప', 'కాలగమనం' మరియు తమిళ డబ్బింగ్ మూవీ 'మిస్టర్ ఎక్స్' కూడా రిలీస్ ఔతుంది. మరి ఈ వారం థియేటర్లలో ఏ సినిమా సూపర్ హిట్ అవుతుందో చూడాలి.

బిహారీ టాకోస్'తో నెలకు ₹1.3 కోట్లు!
ప్రపంచంలో జాబ్ సెక్యూరిటీయే లేదు. ఎవరి ఉద్యోగం పోతుందో ఎప్పుడు పోతుందో తెలీదు. జీషన్ బఖ్రానీ అనే ఇండియన్ కి న్యూయార్క్ లో హై ప్రొఫైల్ జాబ్ పోయింది. అలా రెండు సార్లు లే ఆఫ్ లు ఎదుర్కొన్నాడు. దీంతో తన సేవింగ్ నుంచే మన్ హట్టన్ లో స్ట్రీట్ పుడ్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. 'బిహారీ టాకోస్' అమ్ముతూ ఇప్పుడు కోట్లు కొల్లగొడుతున్నాడు! మన దేశీ ఫ్లేవర్స్‌ని మెక్సికన్ స్టైల్‌తో మిక్స్ చేసి ఒక క్రేజీ Fusion బ్రాండ్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు నెలకు ₹1.3 కోట్ల టర్నోవర్‌తో ఇంటర్నెట్లో వైరల్ గా మారాడు.

నాకు అత్తామామలంటే చాలా ఇష్టం: జేడీవాన్స్ అమెరికా వైస్ ప్రెసిడెంట్
అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తన అత్తమామలైన ఉషా చిలుకూరి పేరెంట్స్ పై ప్రశంసలు కురిపించారు. భారతీయ వలసదారులు అమెరికా అభివృద్ధిలో Key Role పోషిస్తున్నారని మాట్లాడారు. ఇదే సమయంలో H-1B వీసా వ్యవస్థలో మార్పులు అవసరమని పేర్కొన్నారు. మరోవైపు, ఇరాన్‌తో ఉన్న పాత గొడవలు రాత్రికి రాత్రే పోవని, అయితే శాంతి ఒప్పందం కోసం Trump నేతృత్వంలో ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరుగుతాయని స్పష్టం చేశారు.

ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ మలక్కా జలసంధి !
హార్మూజ్ జలసంధిపై పట్టుసాధించలేక ఆపసోపాలు పడుతున్న అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మలక్కా జలసంధిపై కన్ను వేశారు. ఇండోనేషియాతో అమెరికా కుదుర్చుకున్న రక్షణ ఒప్పందం ఇందులో భాగమేనని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఒప్పందం ద్వారా అమెరికా విమానాలకు ఇండోనేషియా గగనతలంలో ప్రవేశం లభిస్తుంది, ఇది మలక్కా జలసంధిపై నిఘా ఉంచేందుకు అమెరికాకు సాయపడుతుంది. ఇండోనేషియా,మలేసియా, సింగపూర్ మీదుగా సాగే ఈ జలసంధి ద్వారా ప్రపంచ వాణిజ్యంలో 40శాతం రవాణా అవుతుంది. చైనా తన ఇంధన అవసరాల కోసం ఈ మార్గంపైనే ఆధారపడుతుంది. భారత్‌కు చెందిన అండమాన్ నికోబార్ దీవులు ఈ జలసంధికి సమీపంలో ఉండటం వల్ల, భవిష్యత్తులో ఈ ప్రాంతంలో అమెరికా-భారత్ సహకారం మరింత పెరిగి, చైనా ప్రాబల్యాన్ని అడ్డుకునే అవకాశం ఉంది.

ఆప్ ఎంపీ అశోక్ మిట్టల్ కు చెందిన యూనివర్సిటీపై ఈడీ దాడులు
కేంద్రంలో అధికార బీజేపీ సీబీఐ, ఈడీలను పొలిటికల్ గా ఎలా వాడుకుంటుందో చెప్పే మరో ఘటన ఇది. ఆప్ ఎంపీ అశోక్ మిట్టల్ కు చెందిన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలపై ఈడీ అధికారులు మెరుపు దాడులు చేశారు. విదేశీ నిధుల మళ్లింపు మరియు ఆర్థిక అక్రమాలకు సంబంధించిన ఫిర్యాదులతో సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రాజ్యసభలో రాఘవ్ చద్దా స్థానంలో పార్టీ డిప్యూటీ చీఫ్‌గా మిట్టల్ బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజులకే ఈ దాడులు మొదలయ్యాయి. రాఘవ్ చద్దా బీజేపీలో చేరతారన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి టైమ్ లో ఈ దాడులు రాజకీయ కక్షసాధింపేనని ఆప్ అంటోంది.
బి.సి. హాస్టల్లో విద్యార్థిని అనుమానాస్పద మృతి!
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి బి.సి. గర్ల్స్ హాస్టల్ లో 8త్ క్లాస్ స్టూడెంట్ శ్రావణి అనుమానాస్పదంగా చనిపోయింది. ఆ అమ్మాయి గుండెపోటుతో చనిపోయిందని హాస్టల్ స్టాఫ్ చెబుతున్నారు, పేరెంట్స్ మాత్రం తమ కూతురి మరణంపై అనుమానాలు ఉన్నాయని, దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపించి న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

బీహార్‌లో బీజేపీ తొలి సీఎంగా సామ్రాట్ చౌధరి ప్రమాణం
బీహార్ రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. బీజేపీ నేత సామ్రాట్ చౌధరి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్రంలో బీజేపీ తరపున సీఎం పదవి చేపట్టిన తొలి నాయకుడిగా రికార్డు సృష్టించారు. గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన అనుభవం ఉన్న సామ్రాట్ ఇప్పుడు రాష్ట్ర పగ్గాలను చేపట్టడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిణామంతో బీహార్‌లో బీజేపీ తన పట్టు మరింత బిగించింది.

350 అశ్లీల వీడియోలు తీసి బెదిరింపులు
మహారాష్ట్రలోని అమరావతిలో షాకింగ్ క్రైమ్ బయటపడింది! 180 మందికి పైగా మైనర్ బాలికలను మహమ్మద్ అయాజ్ అనే యువకుడు లైంగికంగా వేధించాడు. స్నాప్‌చాట్, వాట్సాప్ గ్రూపుల ద్వారా అమ్మాయిలను టార్గెట్ చేసి, సుమారు 350 అశ్లీల వీడియోలు తీసి వాళ్లను బ్లాక్ మెయిల్ చేశాడు. ఈ వీడియోలతో బాధితులను వేధించేవాడు. రాజ్యసభ ఎంపీ అనిల్ బోండే దృష్టికి ఈ విషయం రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ప్రస్తుతం నిందితుడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ఇంటర్నెట్ ప్రపంచంలో తెలియని వ్యక్తులతో చాట్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి! Be safe and Stay alert

B 12 లోపిస్తే ఇవి తినండి!
వెజిటేరియన్స్ అయితే... *రోజూ ఒక గ్లాసు పాలు, పెరుగు లేదా పనీర్ *ప్రతిరోజూ ఒక ఉడికించిన గుడ్డు * విటమిన్లు కలిపిన ఓట్స్ లేదా కార్న్ ఫ్లేక్స్ వంటి 'Fortified Foods' బెటర్.. *నాన్ వెజిటేరియన్స్ కి సాల్మన్, ట్యూనా వంటివి చేపలు మేలు . వాటిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటు B12 పుష్కలంగా ఉంటుంది. *లీన్ మీట్ మరియు చికెన్ తీసుకోండి * షిటాకే (SHIITAKE) పుట్టగొడుగులలో కొంత మేర B12 దొరుకుతుంది.

విటమిన్ బీ 12 లోపిస్తే జరిగేది ఇదే !!
' ఎక్కువ అలసిపోవడం, బాగా నీరసంగా ఉండటం.. *నాడులు దెబ్బతినడం వల్ల చేతులు మరియు కాళ్ళలో సూదులతో గుచ్చినట్లు లేదా తిమ్మిర్లుగా అనిపిస్తుంది. *విషయాలను మర్చిపోవడం, ఏకాగ్రత లేకపోవడం మరియు గందరగోళంగా అనిపించడం. *నాలుక ఎర్రగా మారడం లేదా నోటిలో తరచూ పుండ్లు కావడం. *కొద్ది దూరం నడిచినా ఆయాసం రావడం లేదా గుండె దడ రావడం. *చర్మం పసుపు రంగులోకి లేదా పాలిపోయినట్లు కనిపించడం

రేవంత్ హైబ్రిడ్ నమూనా ఇదే
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైబ్రిడ్ నమూనా విధానంలో రెండు రకాలుగా ఎలా లోక్ సభ సీట్లు పెంచాలో చెప్పారు. హైబ్రిడ్ నమూనా 1 : దేశంలో పెంచాలనుకుంటున్న సీట్లలో 50% ఆయా రాష్ట్రాల జీడీపీ ఆధారంగా మరో 50% ఆ రాష్ట్ర ఆర్థిక పనితీరు, జనాభా ఆధారంగా పెంచాలి. జీడీపీ వృద్ధికి 70% GDP per capitaకి 15%, తలసరి ఆదాయానికి 15% వెయిటేజీ ఇవ్వాలి. హైబ్రిడ్ నమూనా 2 : ఈ నమూనా ప్రకారం 40శాతం జనాభా, 40 శాతం ఆర్థిక పనితీరు, 20శాతం సమాఖ్య స్ఫూర్తిని పరిగణనలోకి తీసుకొని సీట్లను పెంచాలి. అప్పుడే పార్లమెంట్ లో ఏ ప్రాంతానికి ఆధిపత్యం ఉండదు. జనాభాని నియంత్రించిన రాష్ట్రాలకు న్యాయం జరుగుతుంది.

డీలిమిటేషన్ పై ఎందుకింత వ్యతిరేకత ?
డీ లిమిటేషన్ తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం జరగబోతోంది. కేంద్రం ప్రోరేటా అంటే జనాభా ప్రకారం సీట్ల పెంపు ఈ నమూనాలో ఇప్పుడున్న సీట్లకు మరో 50 శాతం కలుపుతారు. ప్రస్తుత సీట్లు యూపీ+బీహార్+ఎంపీ - 149 (27%) తమిళనాడు+కర్ణాటక+కేరళ - 87 16% Ratio : 1.7 : 1 డీలిమిటేషన్ తర్వాత యూపీ+బీహార్+ఎంపీ - 274 (32%) తమిళనాడు+కర్ణాటక+కేరళ - 110 (13%) Ratio : 2.49 : 1 సీట్ల నిష్ఫత్తిలో ఇంత భారీ తేడా వచ్చేస్తుంది

జయహో భారత్ ... న్యూక్లియర్ పవర్ లో రికార్డు!!
న్యూక్లియర్ పవర్లో భారత్ కొత్త విజయం సాధించింది. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ల ద్వారా ఇంధనాన్ని తయారు చేయడంలో సక్సెస్ అయింది. తమిళనాడు, కల్పక్కంలోని ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ మన దేశంలో దొరికే యురేనియం 238 రకం, థోరియం లను ఉపయోగించి రియాక్టర్ నడిచేందుకు ఇంధనాన్ని తయారు చేసింది. కానీ అణు రియాక్టర్ నడవాలంటే యురేనియం 235 రకం అవసరం. మనకు ఈ నిల్వలు లేవు. దాంతో పుష్కలంగా దొరికే ఆల్టర్నేటివ్ ఖనిజంతో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ ను పనిచేయించారు. ఇది ఇంధనం తనకు తాను తయారు చేసుకుంటుంది..పైగా అణు శక్తిని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది.

దక్షిణాదికి దారుణమైన శిక్ష
మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ల అమలు, పార్లమెంటులో సీట్ల సంఖ్యను 850 వరకు పెంచడానికి వీలుగా కేంద్రం తీసుకువస్తున్న 131 రాజ్యాంగ సవరణ బిల్లు-2026 పొలిటికల్ గా హీట్ పెంచుతోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇది దక్షిణాదిపై కేంద్రం పన్నిన కుట్రని మండిపడ్డారు. దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకమై ఈ బిల్లుని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. సీట్లు పెంచకుండా నియోజకవర్గాలు పెంచితే తమకు ఓకేనంటూ ప్రధాని మోదీకి లేఖ రాశారు. ఈ బిల్లుని అడ్డుకోవాలంటూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి సీఎంలకు రేవంత్ లేఖలు రాశారు. ప్రోరేటా అంటే జనాభా ఆధారంగా సీట్లు పెంచడం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని అన్నారు.

తమిళనాడు ఎన్నికల బీజేపి మేనిఫెస్టో ఇదీ !!
కుటుంబంలోని మహిళా పెద్దకురూ.2000 సాయం ఏడాదికి మూడుఎల్పీజీ సిలెండర్లు ఒక ఇంటికి ఒకేసారి రూ. 5,000-10,000 ఆర్ధిక సాయం మహిళలకు ఇ- స్కూటర్ కొనుగోలుపై రూ.25,000 రాయితీ జల్లికట్టు ఎద్దుల పెంపకం దార్లకు నెలకు రూ. 2,000 జల్లికట్టులో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా మహిళలకు రూ.8,000 విలువైన గృహోపకరణాల కూపన్లు మొదటిసారి ఇల్లు కొంటే మహిళలకు 3% స్టాంప్ డ్యూటీ రాయితీ స్కూళ్లు, కాలేజీల్లో సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు ప్రధాన ఆలయాల్లో స్థానికులకు రోజూ 2 గంటల ప్రత్యేక దర్శన సమయం

ఉదయం గోరువెచ్చని నీరు మ్యాజిక్!
మార్నింగ్ నిద్రలేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా చేయడం వల్ల బాడీలోని టాక్సిన్స్‌ను బయటకు వెళ్ళిపోతాయి మరియు మెటబాలిసం పెరిగి ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు. ఇది బ్లడ్ సర్క్యులేషన్‌ను మెరుగుపరిచి స్కిన్‌ను గ్లో అయ్యేలా చేస్తుంది, అలాగే హెయిర్‌ను కూడా హెల్దీగా ఉంచుతుంది. Digestion సిస్టమ్ మెరుగ్గా పనిచేయడమే కాకుండా, గొంతు నొప్పి నుండి రిలీఫ్ ఇస్తూ మిమ్మల్ని రోజంతా Activeగా ఉంచుతుంది.

మళ్లీ జనసేన లోకి తోట?
మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్ మళ్లీ జనసేనలో జాయిన్ అవుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలవడంతో దీనిపై క్లారిటీ వచ్చింది. గతంలో జనసేననుంచే ఆయన బీఆర్ ఎస్ లో చేరారు. ఏపి నుంచి తెలంగాణ పార్టీ అయిన బీఆర్ ఎస్ లో చేరడం అప్పట్లో సెన్సేషన్ అయింది. ఇప్పుడు కూటమి పవర్ లోకి రావడంతో మళ్లీ సొంత గూటికి చేరుకుంటున్నారు. తొందరలోనే అధికారికంగా ఒక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. తోట చంద్రశేఖర్ గతంలో 99 టివిని కొన్నాళ్లు నిర్వహించారు.

ఫ్రూట్స్, వెజిటబుల్స్ వాటర్ తో కడుగుతున్నారా? అయితే ఇది మీకోసమే!
మార్కెట్ నుండి తెచ్చే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్‌పై హానికరమైన Pesticides (పురుగుమందులు) వాడే ఛాన్స్ ఉంది. కాబట్టి వీటిని జస్ట్ వాటర్ తో కడిగితే ఆ కెమికల్స్ పోవు. ఒక గిన్నెలో గోరువెచ్చని నీళ్ళు పోసి కొంచెం సాల్ట్ లేదా Baking Soda వేసి 10 నిమిషాలు నానబెట్టండి. దీనివల్ల బాడీకి హాని చేసే Toxins క్లీన్ అయిపోతాయి. హెల్తీగా ఉండాలంటే ఈ సింపుల్ క్లీనింగ్ రొటీన్ ని తప్పకుండా ఫాలో అవ్వండి.

ట్రంప్ ప్లాన్ రివర్స్ అవుతుందా?
హర్ముజ్ జలసంధిని బ్లాక్ చేయడం వల్ల ఇరాన్ కు రోజుకు 435 మిలియన్ డాలర్ల నష్టం కలుగుతుందని వాల్ స్ట్రీట్ జర్నల్ అంచనా. ఇరాన్ ను దెబ్బ తీయడానికి ట్రంప్ ఈ డెసిషన్ తీసుకున్నారు. అయినా హర్ముజ్ బయట ఉన్న జాస్క్ టెర్మినల్ ద్వారా ఇరాన్ చమురును తరలిస్తోంది.కానీ అక్కడ స్పీడ్ గా పనులు జరగడం లేదు. సముద్రంపై ఫ్లోటింగ్ స్టోరేజ్ టెక్నాలజీతో 154 మిలియన్ బ్యారెళ్ల చమురు ఇరాన్ స్టోర్ చేసుకుంది కాబట్టి కొంత నష్టం తగ్గుతుందంటోంది కెప్లర్ సంస్థ. హర్ముజ్ ను బ్లాక్ చేయడం రాను రాను యూఎస్ కి కష్టమేనట!!

హాస్టల్ లో ఉగ్రవాది ?
యూపీలోని AMU హాస్టల్లో సీన్ మామూలుగా లేదు! ఉగ్రవాది ఉన్నాడన్న అనుమానంతో పోలీసులు రైడ్ చేస్తే గన్ బుల్లెట్లు, 8 ఫోన్లు, ఫేక్ కరెన్సీ, దొరికాయి. మెయిన్ నిందితుడు షహబాజ్ అప్పటికే ఎస్కేప్! అయ్యాడు. మొన్న అల్ ఫలా యూనివర్సిటీ లో డాక్టర్లు. ఇప్పుడు ఇక్కడ కూడా ఇలాంటి వైబ్స్ రావడం రియల్లీ షాకింగ్. పోలీసులు ఇన్వెస్టిగేషన్ గట్టిగా చేస్తున్నారు.

ఒకప్పుడు నితీష్ నే ఎదిరించి.. ఇప్పుడు సీఎం గా !!
బీహార్ కొత్త సీఎం సమ్రాట్ చౌదరి కి పదవులు కేక్ వాక్..మొదట్లో లాలూ యాదవ్ వెంట, నితీష్ కుమార్ వెంట ఉన్న సమ్రాట్ ఆ తర్వాత వారిపై తిరుగుబాటు చేసి బీజేపి పంచన చేరారు. అక్కడ నుంచి రకరకాల మంత్రి పదవులు అందుకుంటూ వచ్చారు. ఇప్పుడు అలయెన్స్ గవర్నమెంట్ లో బీహార్ కొత్త సీఎంగా ఎన్నికయ్యారు. తారాపూర్ నియోజక వర్గం వీరికి పెట్టని కోట. అక్కడనుంచే తండ్రి, తల్లి, సమ్రాట్ కూడా ఎన్నికయ్యారు. 12 ఏళ్లుగా ఈ నియోజక వర్గం వీరి గుప్పిట్లోనే ఉంది.