ఇండియా (INDIA) కూటమిలోకి TVK
నటుడు విజయ్ నేతృత్వంలోని TVK పార్టీ 'ఇండియా' (INDIA) కూటమిలో చేరిందని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మాణికం ఠాగూర్ తెలిపారు. TVK రాకతో తమిళనాడులో 'ఇండియా' కూటమి మరింత బలోపేతమైందని, ఇది ఒక చారిత్రాత్మక రోజని అన్నారు. RSS, బీజేపీలతో పాటు మోదీ, అమిత్ షాల పాలనకు వ్యతిరేకంగా తమిళనాడులో పోరాటం మరింత ఆసక్తికరంగా మారనుందని చెప్పారు. జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని నిర్ణయించారు.
