← Back to news

కేదార్‌నాథ్ యాత్రలో భక్తులపై దాడి!

By A.Ajay· 1h ago

కేదార్‌నాథ్ యాత్రలో ముంబైకి చెందిన భక్తులపై దాడి జరిగినట్లు సమాచారం. అక్టోబర్ 1న జంగల్‌చట్టి వద్ద మ్యూల్స్‌ (గుర్రాలు, ఖచ్చర్లు) కదలికపై భక్తులు, మ్యూల్ హ్యాండ్లర్ల మధ్య గొడవ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ముగ్గురు మ్యూల్ హ్యాండ్లర్లు కర్రలతో దాడి చేసినట్లు కంప్లయింట్ నమోదైంది. సోన్‌ప్రయాగ్ పోలీసులు ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులపై BNS 115(2) కింద కేసు నమోదు చేశారు. పోలీసులు నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.

More in National