NTPC SIగా వెంకటస్వామి.. బాధ్యతలు స్వీకరణ

పెద్దపల్లి జిల్లా రామగుండం పరిధిలోని NTPC SIగా వెంకటస్వామి బాధ్యతలు స్వీకరించారు. గతంలో అంతర్గాం SIగా విధులు నిర్వహించిన వెంకటస్వామిని ఇటీవల పోలీస్ అధికారులు NTPC SIగా బదిలీ చేశారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఆయన పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ప్రజల సహకారంతో శాంతిభద్రతలను కాపాడేందుకు కృషి చేస్తానని చెప్పారు. ప్రజలు తమ సమస్యలను పోలీసుల దృష్టికి తీసుకురావాలని, పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.



