‘X’ టేక్‌డౌన్ రిక్వెస్ట్‌పై జగన్ బిగ్ క్వశ్చన్స్

AP: పోలీసులపై YCP అధినేత YS జగన్ తన <a href="https://x.com/ysjagan/status/2100201514707173537">‘X’లో సంచలన</a> ఆరోపణలు చేశారు. ‘X’లో పోస్టుల తొలగింపు కోసం AP పోలీసులు తమను FBIగా పేర్కొంటూ టేక్‌డౌన్ రిక్వెస్ట్ పంపారని ఆరోపించారు. ఈ రిక్వెస్ట్ AP పోలీసుల ఆఫీషియల్ ఈమెయిల్ నుంచే వచ్చిందని ‘X’ క్లారిటీ ఇచ్చిందని తెలిపారు. ఇది ఇంటెన్షనల్‌గా జరిగిందా? ఎవరి ఆదేశాలతో రిక్వెస్ట్ పంపారు? అని జగన్ ప్రశ్నించారు. ప్రభుత్వం విమర్శలకు సమాధానం పనితీరుతో ఇవ్వాలని, సెన్సార్‌షిప్‌తో కాదని కామెంట్ చేశారు.




