← Back to news

భూముల కబ్జాపై R.S.ప్రవీణ్ కుమార్ ఆగ్రహం

By A.Ajay· 1h ago

TG: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో చర్చి భూముల వివాదంపై BRS జనరల్ సెక్రటరీ R.S.ప్రవీణ్ కుమార్ స్పందించారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి బాధితులను కలిసిన ఆయన భూమిని ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మహిళలపై దాడి జరిగిందని, పోలీసులు ప్రైవేట్ వ్యక్తులకు మద్దతుగా ఉన్నారని అన్నారు. అధికారిక పత్రాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రజల ఆస్తులను కాపాడేందుకు కబ్జాదారులకు వ్యతిరేకంగా పోరాడతామని చెప్పారు.

More in TG