‘ఈసారి పోటీ చేయను’.. అక్బరుద్దీన్ షాకింగ్ కామెంట్స్!

TG: పాతబస్తీలోని తన ఎడ్యుకేషన్ క్యాంపస్‌లో స్టూడెంట్స్‌తో జరిగిన కార్యక్రమంలో అక్బరుద్దీన్ ఓవైసీ తన పొలిటికల్ జర్నీ గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో తన పోటీపై కీలక కామెంట్స్ చేశారు. ‘నేను ముసలోడిని అయిపోయాను.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానో లేదో తెలియదు. పోటీ చేయాలని ఆలోచన కూడా లేదు.. చేయను’ అని అన్నారు. దీంతో అక్బరుద్దీన్ కామెంట్స్ పాతబస్తీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

