స్టూడెంట్స్‌కు డ్రగ్స్..కేరళలో లెక్చరర్ పాడుపని

కేరళలోని మలప్పురం జిల్లాలో స్టూడెంట్స్‌కు డ్రగ్స్ సప్లై చేసిన కేసులో కాలేజీ లెక్చరర్‌తో సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. టీచర్ సుహైల్ పెరింగోడన్ ఎంఈఎస్ మంపాడ్ కళాశాలలో పనిచేస్తున్నారు. మిగతా ముద్దాయిలు రీనా టీఎన్, వివేక్ విజయన్, సుబ్రహ్మణ్యన్. నిలంబూర్, పరిసర ప్రాంతాల్లోని స్టూడెంట్స్‌కు ఈ డ్రగ్స్ ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెట్‌వర్క్ పెద్ద మొత్తంలో డ్రగ్స్ సరఫరా చేస్తోందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.



