హిట్ అండ్ రన్.. ముగ్గురి పరిస్థితి విషమం

మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కుషాయిగూడలో వేగంగా దూసుకొచ్చిన కారు 9 మందిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, మరో ఆరుగురు గాయపడ్డారు. ఘటన తర్వాత డ్రైవర్ కారు ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. పోలీసులు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసి, ప్రమాదానికి కారణమైన వాహనం, డ్రైవర్ కోసం దర్యాప్తు చేపట్టారు.



