← Back to news

పార్టీ మారిన ఇద్దరిపై సీపీఎం యాక్షన్

By B V Appalanaidu· 55m ago· Yandapallivalasa, Araku Valley, Alluri Sitharama Raju
పార్టీ మారిన ఇద్దరిపై సీపీఎం యాక్షన్

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు మండలం పద్మాపురం గ్రామ శాఖకు చెందిన కిలో మహేష్, పొట్టంగి కుమార్‌లను సీపీఎం నుంచి తొలగించినట్లు మండల కార్యదర్శివర్గ సభ్యుడు జె. భగత్‌రామ్ తెలిపారు. వారు టీడీపీలో చేరిన నేపథ్యంలో పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా భగత్‌రామ్ మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం గిరిజనుల హక్కులకు విఘాతం కలిగిస్తోందని ఆరోపించారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమిని ఓడిస్తామని అన్నారు.

More in Local