← Back to news

మోగిన ఫోన్ సైరన్... మీకూ వచ్చిందా ?

By aravinda nyayapati· 2 May 2026· Hyderabad
మోగిన ఫోన్ సైరన్... మీకూ వచ్చిందా ?

జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ చేపట్టిన నేషనల్ మొబైల్ సైరన్ అలర్ట్ సిస్టమ్ సక్సెస్ అయింది. ఇవాళ 11.30 తర్వాత రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఫోన్లు పెద్ద శబ్దంతో సైరన్ చేశాయి. ఆ తర్వాత ఇది కేవలం టెస్టింగ్ మాత్రమేనని, ఇది ఆగిపోయాక ఎవరూ ఏమీ చెయ్యనక్కర్లేదంటూ వాయిస్ మెసేజ్ వచ్చింది. భూకంపాలు వంటి ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేయడానికి ఈ సైరన్ వాడతారు. అదెలా పనిచేస్తుందాని ఇవాళ పరీక్షించి చూశారు. ఫ్రెండ్స్ మరీ మీకూ ఈ సైరన్ వచ్చిందా ? కామెంట్ చేయండి

More in General