← Back to news

వీరమాచినేని రామకృష్ణపై కేసు!

By Mahesh· 19h ago· హైదరాబాద్
వీరమాచినేని రామకృష్ణపై కేసు!

TG: ‘వీరమాచినేని డైట్’, ‘VRK డైట్’ పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం చేసే వీరమాచినేని రామకృష్ణపై సైబరాబాద్ పోలీసులు క్రిమినల్ కేసు ఫైల్ చేసినట్లు తెలుస్తోంది. టైప్-1 డయాబెటిస్‌ను నయం చేస్తామని రామకృష్ణ, కోటేశ్వరరావు ఓ 30 ఏళ్ల లా స్టూడెంట్‌కు సూచనలు ఇచ్చి 26 వేల రూపాయలు ఫీజు తీసుకున్నట్లు సమాచారం. ఇన్సులిన్, ఇతర మందులు వాడొద్దని చెప్పిన తర్వాత రెండు రోజుల్లోనే స్టూడెంట్ హెల్త్ ఇష్యూస్‌తో ఆసుపత్రిలో చేరారు. బాధితుడి కంప్లైంట్‌తో పోలీసులు కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

More in Crime