బ్లూ డ్రమ్ హత్య కేసులో దోషుల గుర్తింపు

మీరట్‌లో సంచలనం సృష్టించిన బ్లూ డ్రమ్ హత్య కేసులో సౌరభ్ రాజ్‌పుత్ భార్య ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాలను కోర్టు దోషులుగా గుర్తించింది. 2025 మార్చి 3న ముస్కాన్ తన భర్త సౌరభ్‌కు ఆహారంలో మత్తుమందు కలిపి ఇచ్చింది. ఆ తర్వాత సాహిల్‌తో కలిసి సౌరభ్‌ను కత్తులతో పొడిచి చంపారు. బాత్‌రూమ్‌లో శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి, పెద్ద నీలి ప్లాస్టిక్ డ్రమ్‌లో వేసి మూసేశారు. 22 మంది సాక్షులు వాంగ్మూలం విన్న కోర్టు వారిని దోషులుగా ప్రకటించింది.


