లవ్‌కి నో చెప్పిందని.. పెట్రోల్ పోసుకున్న యువకుడు

లవ్‌కి నో చెప్పిందని యువకుడు ఓ యువతిని కౌగలించుకుని తనపైనే పెట్రోల్ పోసుకుని మంటలు పెట్టుకున్నాడు. కర్ణాటకలోని మైసూరు విజయనగర్‌లోని డిప్లమో కాలేజీ హాస్టల్ దగ్గర ఈ షాకింగ్ ఘటన జరిగింది. మండ్య జిల్లాకు చెందిన చందన్(27) మూడేళ్లుగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. కానీ ఆమె అంగీకరించలేదు. ఉదయం తనపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకొని ఆమెను గట్టిగా కౌగలించుకున్నాడు. స్థానికులు ఆమెను రక్షించి మంటలు ఆర్పారు. ఇద్దరికీ ఆసుపత్రికి తరలించారు.


