అంగన్వాడీ కేంద్రంలో 'పోషణ్ ఉత్సవాలు'

దుగ్గిరాల మండలంలోని అంగన్వాడీ కేంద్రంలో పోషకాహారంపై లబ్ధిదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ ద్వారా అందుతున్న పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ సేవలను లబ్ధిదారులకు వివరించారు. తర్వాత పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ICDS సూపర్‌వైజర్ భవాని, స్థానిక నాయకులు, గర్భిణులు, బాలింతలు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.



