పేదరికాన్ని ఓడించి.. సివిల్ కానిస్టేబుల్!

అల్లూరి జిల్లా పెదబయలు మండలం చుట్టుమెట్ట గ్రామానికి చెందిన కిముడు కామరాజు సివిల్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. ఆర్థిక ఇబ్బందులు, పేదరికాన్ని ఎదుర్కొంటూ ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. గ్రామ యువత ఆధ్వర్యంలో ఘన సన్మానం చేశారు. గ్రామ పెద్దలు, యువత అభినందించారు. ఆయన విజయాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. పేదరికం అడ్డంకి కాదని, పట్టుదలతో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని నిరూపించాడు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత పాల్గొన్నారు.





