← Back to news

ట్యాంకర్ నీళ్లతో పంటల సాగు

By BK· 1h ago· జోగులాంబ గద్వాల

TG : ఎల్ నినో వర్షాభావంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సరైన వర్షాలు లేక పంటలు ఎండిపోతున్న టైములో, జోగులాంబ గద్వాల జిల్లా మదనపల్లికి చెందిన రైతు నాగిరెడ్డి ట్యాంకర్లతో కంది పంటకు నీళ్లు పోస్తున్నారు. దీని కోసం 2 లక్షల రూపాయలు అప్పు చేసినట్లు తెలిపారు. తాను ఇప్పటికే పత్తి పంటతో నష్టపోయానని, కంది పంటనైనా దక్కించుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

More in TG