← Back to news

ఏపీకి వర్ష సూచన.. అల్పపీడనం ప్రభావం

By Bala· 9h ago· AP
ఏపీకి వర్ష సూచన.. అల్పపీడనం ప్రభావం

AP: ఏపీలో వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమపై ఉపరితల ఆవర్తనం, కర్ణాటక నుంచి గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ వరకు గాలుల ప్రభావంతో 19న ఉత్తర అండమాన్‌లో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది 3 నుంచి 4 రోజుల్లో బలపడి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర వైపు కదిలే అవకాశం ఉంది. దీంతో వచ్చే వారంలో కోస్తాంధ్రలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. గురువారం పలు జిల్లాల్లో పిడుగులతో తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

More in AP