స్నో స్ప్రే కొడుతున్నారా? ఈ డేంజర్స్ తెలుసా!

బర్త్‌డే అయినా.. పెళ్లి వేడుకైనా.. ఫెస్టివల్ అయినా.. స్నో స్ప్రేతో సెలబ్రేట్ చేయడం కామన్‌గా మారింది. కానీ ఈ సరదా అలవాటు ప్రమాదాలకు దారితీయొచ్చని ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. స్నో స్ప్రే మంటలకు దగ్గరగా పడితే క్షణాల్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంటుంది. స్ప్రేలోని రేణువులు పీల్చడం వల్ల దగ్గు, తలనొప్పి, మైకం, వికారం రావచ్చు. చర్మంపై పడితే దురద, అలర్జీ, ఎర్రబడటం వంటి సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా పిల్లలు, సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.


