వర్కౌట్ చేస్తే లగ్జరీ గిఫ్ట్‌లు.. ఉద్యోగులకు కంపెనీ ఆఫర్
ఉద్యోగుల ఆరోగ్యంపై సౌత్‌కొరియాలోని ఓ కంపెనీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. రెండు నెలలు క్రమం తప్పకుండా వర్కౌట్ చేసే ఉద్యోగులకు గూచీ, షనెల్, ప్రదా వంటి లగ్జరీ బ్రాండ్ల గిఫ్ట్స్ ఇస్తోంది. ఇందుకోసం ఉద్యోగులు తమ ఎక్సర్‌సైజ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను మేనేజర్‌కు పంపాలి. సియోల్‌లో పనిచేస్తున్న భారతీయ కంటెంట్ క్రియేటర్ మాన్సి ఆరోరా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వీడియో వైరల్‌గా మారింది. ఉద్యోగుల్లో ఫిట్‌నెస్ పెంచేందుకు కంపెనీ చేస్తున్న ప్రయత్నంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.



