వెల్‌నెస్ పేరుతో విటమిన్ డ్రిప్స్.. నిజంగా అవసరమేనా?

ఆరోగ్యంగా ఉండేందుకు ఇప్పుడు కొత్త కొత్త వెల్‌నెస్ ట్రెండ్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగా విటమిన్ ఇన్ఫ్యూషన్స్, IV డ్రిప్స్ తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. సాధారణంగా ఎమర్జెన్సీ మెడికల్ కేర్, తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో ఉపయోగించే వీటిని వెల్‌నెస్ కోసం తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మందులు, ట్రీట్‌మెంట్లపై జరిగే తప్పుడు ప్రచారం కూడా ప్రజల నిర్ణయాలను ప్రభావితం చేస్తోందని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. డాక్టర్ సలహాతోనే విటమిన్ డ్రిప్స్ తీసుకోవాలి.


