మనసుపై ఒత్తిడి.. గుండెపై ప్రభావం

బ్రిటన్‌లోని ఇంపీరియల్ కాలేజ్ రీసెర్చెర్స్ 4.88 లక్షల మందిపై చేసిన స్టడీలో మానసిక ఒత్తిడి గుండె ఆరోగ్యంపై ఎఫెక్ట్ చూపిస్తుందని తేలింది. దీర్ఘకాలిక ఒత్తిడి శరీరంలో మంట, వాపును పెంచుతుందని గుర్తించారు. దీనివల్ల హార్ట్ వాల్స్ మందంగా మారి, గుండె గదులు చిన్నవయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఫలితంగా గుండె పనితీరు దెబ్బతిని హార్ట్ ఎటాక్స్ వచ్చే ప్రమాదం ఉందని చెప్పారు. ఎప్పుడూ మంట, వాపు ఉన్నవారిలో గుండెపోటు, పక్షవాతం ముప్పు 43 శాతం ఉన్నట్లు స్టడీ తెలిపింది.


