తాళ్లరాంపూర్‌లో వీడీసీపై వేటు!

నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్‌లో వీడీసీ అరాచకంగా వ్యవహరించింది. 39 గౌడ కుటుంబాలు, 10 ఎస్సీ కుటుంబాలపై చట్టవిరుద్ధంగా సాంఘిక బహిష్కరణ విధించింది. బాధితులతో మాట్లాడినా, సరుకులు అమ్మినా రూ.25 వేలు జరిమానా విధిస్తామంటూ డప్పు చాటింపు వేయించింది. బాధితులు కలెక్టర్, పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. స్పందించిన అధికారులు వీడీసీ బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ప్రజాస్వామ్యంలో సాంఘిక బహిష్కరణలను సహించేది లేదని అధికారులు హెచ్చరించారు.



