తెలంగాణ సాయుధ పోరాట యోధ..మల్లు స్వరాజ్యం

మల్లు స్వరాజ్యం.. తొలి దశ తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో ఆమెది చెరగని సంతకం. 13 ఏళ్ల వయస్సులోనే పోరుబాట పట్టిన ఆమె, పదహారేళ్లకే భూమి, భుక్తి, విముక్తి కోసం బందూక్ చేతబట్టారు. నిజాం నిరంకుశత్వాన్ని నిరసించారు. దొరలు, దేశ్‌ముఖ్‌లపై పోరాడారు. ఆమె జీవిత చరిత్రను హైదరాబాద్ బుక్ ట్రస్ట్ పుస్తక రూపంలో తీసుకొచ్చింది. 1981లో మల్లు స్వరాజ్యం ఐద్వాను స్థాపించారు. 2001 వరకు అధ్యక్షురాలిగా ఉన్నారు. జీవితాంతం పోరాట యోధురాలిగా పేరు తెచ్చుకున్నారు. పుస్తకం ఖరీదు 200 రూపాయలు. పుస్తకం కొనే <a href="https://hyderabadbooktrust.com/products/na-maate-tupaki-toota-mallu-swarajyam-as-told-to-katyayini-and-vimala?srsltid=AU7gw4VleZFXYB60-kUyRNi8Tp2yYfss9FWy50y9xGjOISq7AtB1o6dO&sku_id=28621326">లింక్</a>.



