ఆక్రమణకు చెక్.. ప్రభుత్వ భూమి స్వాధీనం!

సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైంది. సర్వే నంబర్లు 731, 733లో 2 ఎకరాల 18 గుంటల భూమి ఇది. గ్రామస్తులు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ క్షేత్రస్థాయిలో పరిశీలించి, అది ప్రభుత్వ భూమేనని నిర్ధారించారు. వెంటనే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయించారు. ఇకపై ఆక్రమణకు ప్రయత్నిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తహసీల్దార్‌కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.



