బ్యాంకుల 5-Day Workingపై వైరల్ గెజిట్?

SBI సహా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకూ ప్రతి శనివారం సెలవు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న గెజిట్ ఫేక్ అని PIB ఫాక్ట్ చెక్ టీమ్ తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇలాంటి గెజిట్ జారీ చేయలేదు. ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకులకు 2వ, 4వ శనివారాలు మాత్రమే సెలవు ఉంది. మిగతా శనివారాలు సాధారణ పని దినాలుగానే కొనసాగుతున్నాయి. 5-day banking అమలుపై చర్చలు కొనసాగుతున్నప్పటికీ.. అది ఇంకా అమల్లోకి రాలేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.


