← Back to news

గాంధీజీ ఆశయాలే సమాజానికి మార్గదర్శకం: శ్రీనివాసరావు

By KUCHIPUDI BUJJIBABU· 1h ago· Salivahanapeta, Mangalagiri, Guntur
గాంధీజీ ఆశయాలే సమాజానికి మార్గదర్శకం: శ్రీనివాసరావు

గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ టీడీపీ కార్యాలయం డా. ఎంఎస్ఎస్ భవన్‌లో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి మండల టీడీపీ అధ్యక్షులు పల్లబోతుల శ్రీనివాసరావు, ఇతర నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గాంధీజీ ఆశయాలే సమాజానికి మార్గదర్శకమని శ్రీనివాసరావు తెలిపారు. సత్యం, అహింస, శాంతి మార్గాలను గాంధీజీ ప్రపంచానికి చాటిచెప్పారని చెప్పారు. స్వాతంత్ర్య ఉద్యమంలో ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.

More in Local