← Back to news

డ్రైవర్‌ లేకుండానే టాక్సీ.. చైనాలో కొత్త ట్రెండ్

By Anusha· 19h ago· X

చైనాలో డ్రైవర్‌లెస్‌ టాక్సీ సేవలు రోజువారీ ప్రయాణాల్లో భాగమవుతున్నాయి. బైడు అపోలో గో లాంటి సంస్థలు వుహాన్‌, బీజింగ్‌, గ్వాంగ్‌జౌ వంటి నగరాల్లో ఆటోనమస్‌ టాక్సీలను నడుపుతున్నాయి. ప్రయాణికులు యాప్‌ ద్వారా టాక్సీని బుక్‌ చేసుకుని డ్రైవర్‌ లేకుండానే ప్రయాణిస్తున్నారు. నార్మల్ టాక్సీలతో పోలిస్తే తక్కువ ఖర్చు, ట్రాఫిక్‌లో సమర్థవంతమైన ప్రయాణం లాంటి ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ సేవలు ఇంకా అన్ని నగరాలకు పూర్తిస్థాయిలో విస్తరించలేదు.

More in International