కేసీఆర్ ఫాంహౌస్ విచారణ.. కక్ష సాధింపే: BRS!

నిజామాబాద్ జిల్లాలో రాజకీయం వేడెక్కింది. కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్, కుటుంబ భూములపై విచారణపై BRS ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది రాజకీయ కక్ష సాధింపేనని జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఫాంహౌస్ భూముల ఆరోపణలు వాస్తవ విరుద్ధమన్నారు. కాంగ్రెస్ చర్యలను BRS అడ్డుకుంటుందని స్పష్టం చేశారు. 30 రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు.


