నో బస్ @ చర్లపల్లి రైల్వే స్టేషన్
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఆర్టీసీ బస్సుల కొరత ఇబ్బందిగా మారింది. రైళ్లలో వచ్చే ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నా సిటీ బస్సులు సరిపోవడం లేదని వారు చెబుతున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం రద్దీ సమయాల్లో బస్సుల కోసం ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తోందని, ఆటోలు, క్యాబ్‌లను ఆశ్రయించాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. రైల్వే స్టేషన్‌కు అనుసంధానంగా మరిన్ని బస్సులు నడపాలని, రద్దీ సమయాల్లో అదనపు సర్వీసులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.


