← Back to news

మీ ఫోన్ నుంచి సైరన్... భయం వద్దు

By aravinda nyayapati· 2 May 2026· Hyderabad
మీ ఫోన్ నుంచి సైరన్... భయం వద్దు

ఈ రోజు మీ మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో సైరన్ చేసినా లేదంటే వైబ్రేట్ అయినా అస్సలు భయపడకండి. భూకంపాలు వంటి అత్యవసర సమయాల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు 'నేషనల్ మొబైల్ సైరన్ అలర్ట్' సిస్టమ్‌ను జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ పరీక్షిస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని నెట్‌వర్క్‌ల మొబైల్స్‌కు ఈ టెస్ట్ మెసేజ్ పంపనున్నారు. ఇది కేవలం మీ ఫోన్ యొక్క ఎమర్జెన్సీ అలర్ట్ సామర్థ్యాన్ని చెక్ చేయడానికి మాత్రమే. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో టైమ్ లో ఈ అలెర్ట్ పంపిస్తారు. ఏపీలో 11.15 నుంచి 12 మధ్య, తెలంగాణలో 11.30 నుంచి 12 గంటల మధ్య ఈ అలెర్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది.

More in General