హౌస్‌కీపింగ్ కార్మికుల వేతనాలు పెంచాలని నిరసన
రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీలో పనిచేస్తున్న హౌస్ కీపింగ్ కార్మికుల వేతనాలు వెంటనే పెంచాలని, ఆగస్టు, సెప్టెంబర్ నెలల పెండింగ్ వేతనాలను తక్షణమే చెల్లించాలని విశాఖపట్నంలోని మల్కాపురం సెంటర్‌లో CITU ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. CITU జిల్లా అధ్యక్షుడు బి. లక్ష్మణరావు మాట్లాడుతూ.. వేతనాలు పెంచి ఎనిమిదేళ్లు దాటినా జీవన వ్యయాలు భారీగా పెరిగాయని తెలిపారు. సానుకూల హామీలు ఇవ్వడం కాకుండా వేతనాల పెంపుపై వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు.


