పదేళ్ల బాలికపై లైంగిక దాడి

AP : తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలం అబ్బినాయుడుపల్లెలో 10 ఏళ్ల బాలికపై 45 ఏళ్ల చీరల రమేష్ నాయుడు లైంగిక దాడి చేశాడు. ఇంటి బయట ఉన్న బాలికను ఆటోలో రైల్వే స్టేషన్, ఆ తర్వాత ఊరి బయటకు తీసుకెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మరుసటి రోజు బాలిక, తల్లికి విషయం చెప్పడంతో బాధితులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు కేసు ఫైల్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు.


